
టెర్రరిస్టుల హిట్‌లిస్ట్‌లో బేగంబజార్!
హైదరాబాద్: టెర్రరిస్టుల హిట్‌లిస్ట్‌లో బేగంబజార్ ఉన్నట్లు నిఘా వర్గాల పరిశీలనలో వెల్లడైంది. బేగంబజార్‌లో ఈరోజు పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పంద్రాగష్టు వేడుకల సందర్భంగా పోలీసులు నిఘా పెంచారు.
స్వాతంత్ర్య దినోవత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. షాపింగ్ కాంప్లెక్స్‌లు, రద్దీ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.