ముంబై: కరోనా వైరస్ సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. లాక్‌డౌన్ కారణంగా అనేక రంగాలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. కరోనా ప్రభావం లేనప్పుడు నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి ప్రజలు షాపింగ్ మాల్స్, లగ్జరీ సూపర్ మార్కెట్ల వైపు మొగ్గు చూపేవారు. అయితే ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో ప్రజలు నిత్యావసరాల కొనుగోలుకు కిరాణా షాపులను ఆశ్రయిస్తున్నారని ‘డెలైట్ గ్లోబల్ స్టేట్ కన్సుమర్ ట్రాకర్’ అనే సర్వే నివేదిక వెల్లడించింది.
ఈ సర్వేలో 18 సంవత్సరాలు పై బడిన 1,000 మంది ప్రజలు పాల్గొన్నారు. ప్రజలు 52 శాతం డబ్డులను నిత్యావసరాల కొనుగోలుకే వాడుతున్నారని సర్వే తెలిపింది. దేశంలోని 72 శాతం వినియోగదారులు కిరాణా షాపులోనే కొనడానికి ఇష్టపడుతున్నారని సర్వే పేర్కొంది. అత్యధిక ప్రజలు కరోనాను నియంత్రించే క్రమంలో జన సమూహానన్ని తగ్గించడానికి మొగ్గు చూపుతున్నట్లు సర్వే పేర్కొంది. లాక్‌డౌన్ కొనసాగుతున్న క్రమంలో సర్వే ఫలితాలు ప్రజల మనోభావాలను స్పష్టం చేస్తున్నాయిని డెలైట్ ఇండియా ఉన్నతాధికారి అనిల్ తాల్ రేజా అభిప్రాయపడ్డారు.
చదవండి: ఎన్‌సీఎల్‌టీలో డెలాయిట్‌కు దక్కని ఊరట
Comments
Please login to add a commentAdd a comment