Flipkart Wholesale Rolls Out New Credit Program To Support Kirana Stores - Sakshi
Sakshi News home page

Flipkart: కిరాణా వర్తకులకు ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్‌

Published Wed, Aug 25 2021 8:30 AM | Last Updated on Wed, Aug 25 2021 2:29 PM

Flipkart Announced The Launch First Credit Programs For Kirana Business - Sakshi

న్యూఢిల్లీ: కిరాణా వర్తకుల మూలధన నిధుల అవసరాలకు మద్దతుగా నిలిచేందుకు ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ నూతనంగా ఒక ‘క్రెడిట్‌ ప్రోగ్రామ్‌’ను ప్రకటించింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు భాగస్వామ్యంతో సులభ రుణాలను సమకూర్చనుంది. 

కిరాణా వర్తకుల ఇబ్బందులను పరిష్కరించేందుకు, వ్యాపార వృద్ధికి నిధుల అవసరాలను తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా కిరాణా వర్తకులు ఎటు వంటి వ్యయాలు లేకుండానే రుణ సాయాన్ని ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు, ఇతర ఫిన్‌టెక్‌ సంస్థల నుంచి పొందొచ్చని తెలిపింది. ఈ రుణాలు రూ.5,000 నుంచి రూ.2 లక్షల వరకు.. 14 రోజుల కాలానికి ఎటువంటి వడ్డీ లేకుండా లభిస్తాయని పేర్కొంది.  

చదవండి : ఆ పేరు మార్చండి, అమెజాన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement