kirana stores online
-
కిరాణా వర్తకులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: కిరాణా వర్తకుల మూలధన నిధుల అవసరాలకు మద్దతుగా నిలిచేందుకు ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ నూతనంగా ఒక ‘క్రెడిట్ ప్రోగ్రామ్’ను ప్రకటించింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు భాగస్వామ్యంతో సులభ రుణాలను సమకూర్చనుంది. కిరాణా వర్తకుల ఇబ్బందులను పరిష్కరించేందుకు, వ్యాపార వృద్ధికి నిధుల అవసరాలను తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ప్రకటించింది. ఇందులో భాగంగా కిరాణా వర్తకులు ఎటు వంటి వ్యయాలు లేకుండానే రుణ సాయాన్ని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు, ఇతర ఫిన్‌టెక్ సంస్థల నుంచి పొందొచ్చని తెలిపింది. ఈ రుణాలు రూ.5,000 నుంచి రూ.2 లక్షల వరకు.. 14 రోజుల కాలానికి ఎటువంటి వడ్డీ లేకుండా లభిస్తాయని పేర్కొంది. చదవండి : ఆ పేరు మార్చండి, అమెజాన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు -
ఆన్లైన్లో కిరాణా ఈ స్టోర్
సాక్షి, హైదరాబాద్: గతేడాది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను అనుసంధానం చేస్తూ తెలంగాణ స్టేట్ గ్లోబల్ లింకర్ నెట్ వర్కింగ్ పోర్టల్‌ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ‘కిరాణా లింకర్’అనే పోర్టల్‌ను సోమవారం లాంఛనంగా ప్రారంభించింది. గతంలో ఎంఎస్ఎంఈల కార్యకలాపాలను డిజిటలైజేషన్ చేసిన తరహాలోనే ప్రస్తుతం కిరాణా దుకాణాలను కూడా ప్రత్యేక పోర్టల్ ద్వారా ఒకే వేదిక మీదకు తేవాలని నిర్ణయించింది. దీనికోసం తెలంగాణ స్టేట్ గ్లోబల్ లింకర్ నెట్వర్కింగ్ పోర్టల్‌తో పాటు, ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ (సీఏఐటీ) సహకారం తీసుకోవాలని తెలంగాణ పరిశ్రమల శాఖ నిర్ణయించింది. సమీకృత చెల్లింపుల విధానం, ఇతర పరిష్కారాలతో కూడిన ‘కిరాణా లింకర్’పోర్టల్‌లో స్థానికంగా కిరాణా, నిత్యావసరాలు అమ్మే వ్యాపారులు తమ వివరాలతో ‘ఈ స్టోర్’ను నిమిషాల వ్యవధిలో చాలా సులభంగా సృష్టించుకోవచ్చు. లాక్డౌన్ పరిస్థితుల్లో సామాజిక దూరం పాటించడం, ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్థానిక నిత్యావసరాల దుకాణాల నుంచి అవసరమైన సరుకుల కొనుగోలు వంటివి ‘కిరాణా లింకర్’పోర్టల్ ద్వారా సాధ్యమవుతుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో ‘ఈ స్టోర్’లను కేవలం నిత్యావసరాలకే కాకుండా, ఇతర వ్యాపార సంస్థలకూ విస్తరించే అవకాశమున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో, వారణాసి, గోరఖ్‌పూర్, ప్రయాగ్‌రాజ్ వంటి పట్టణాల్లో ‘కిరాణా లింకర్’పోర్టల్‌ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకించి తెలంగాణలో ఆచరణలోకి తేవాలని సీఏఐటీ కోరుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం.. తెలంగాణలోని ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు గతంలో ‘టీఎస్ గ్లోబల్ లింకర్’ను ప్రారంభించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. కిరాణా లింకర్‌ను లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా గ్లోబల్ లింకర్, సీఏఐటీ ప్రతినిధులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో నిత్యావసరాలు గుమ్మం ముందుకు రావాలని వినియోగదారులు కోరుకుంటున్న నేపథ్యంలో కిరాణా, నిత్యావసరాల దుకాణాల యజమానులు కిరాణా లింకర్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. కిరాణా లింకర్‌ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన చోట వినియోగదారులు, వ్యాపారుల నుంచి మంచి స్పందన వస్తోందని జయేశ్ వ్యాఖ్యానించారు. త్వరలో ‘భారత్ ఈ మార్కెట్’తో టీఎస్ గ్లోబల్ లింకర్ నెట్‌వర్క్‌ను అనుసంధానం చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో కలసి పనిచేసే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. -
జియోకు పోటీగా దూసుకొస్తున్న అమెజాన్
సాక్షి, ముంబై: ఫేస్ బుక్, వాట్సాప్ భాగస్వామ్యంతో రిలయన్స్ ఆధ్వర్యంలోని రిలయన్స్ జియో మార్ట్ ఆన్లైన్ కిరణా వ్యాపారంలోకి దూసుకొచ్చేందుకు సిద్దంగా వుంది. మరోవైపు ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగిపోయింది. 'లోకల్ షా ప్స్ ఆన్ అమెజాన్' పేరుతో పైలట్ ప్రోగ్రామ్ ను లాంచ్ చేసింది. 6 నెలల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో భారతదేశంలోని 100కుపైగా నగరాల్లో 5 వేల స్థానిక షాపులురిటైలర్ల భాగస్వామ్యంతో కిరాణా, తదితర అవసరమైన సరుకులను వినియోగదారులకు అందించనుంది. కరోనా వైరస్ విస్తరణ, లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో అత్యవసర వస్తువులతో పాటు, ఇతర ఉత్పత్తుల విక్రయానికి కూడా అనుమతినివ్వాలని రీటైలర్లు ప్రభుత్వాన్ని కోరుతున్న నేపథ్యంలో అమోజాన్ తాజా వ్యూహంతో ముందుకు రావడం గమనార్హం. టాప్ మెట్రోలతో పాటు టైర్ 1, టైర్ 2 నగరాలైన బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణే, జైపూర్, అహ్మదాబాద్, కోయంబత్తూర్, సూరత్, ఇండోర్ లక్నో, సహారాన్పూర్, ఫరీదాబాద్, కోటా, వారణాసి తదితర నగరాల్లోని రీటైలర్స్ సిద్దంగా ఉన్నారని అమెజాన్ వెల్లడించింది. కిచెన్, ఫర్నిచర్, దుస్తులు, ఆటోమోటివ్, బ్యూటీ, ఎలక్ట్రానిక్స్, స్పోర్ట్స్, కిరాణా, తోట, పుస్తకాలు, బొమ్మలు ఇతర ఉత్పత్తులను అందుబాటులోకి ఉంచినట్టు చెప్పింది. అమెజాన్ అందిస్తున్న ఈ కొత్త సదుపాయం ద్వారా స్థానిక దుకాణాల నుండి తమకు కావాల్సింది ఎంపిక చేసుకునే వెసులుబాటుతో పాటు వేగంగా డెలివరీ చేయడానికి అవకాశం లభిస్తుందని తెలిపింది. అంతేకాకుండా, దుకాణదారులు తమ ప్రాంతానికి మించి వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కూడా ఇది సహాయపడుతుందని పేర్కొంది. ప్రపంచంలో ఎక్కడైనా, భారతదేశంలోని స్థానిక దుకాణాల సరుకులను ఆన్లైన్లో విక్రయించడానికి శక్తినిచ్చేందుకు, తమ టెక్నాలజీ సామర్థ్యాలను ఉపయోగిస్తామని అమెజాన్ ఇండియా వివరించింది. వినియోగదారులకు ఖచ్చితమైన డెలివరీ కోసం అమెజాన్ డెలివరీ యాప్‌ను ఉపయోగించాలని, అన్ని సరుకుల రవాణాను రోజూ ట్రాక్ చేస్తామని స్పష్టం చేసింది. (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాకివ్వనున్న జియో మార్ట్) స్థానిక దుకాణాలు డిజిటల్ స్టోర్లుగా మారనున్నాయి. షాపులు తమ ప్రస్తుత ప్రోగ్రామ్‌లో చేరవచ్చనీ, అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి వారికి సహాయపడుతుందని అమెజాన్ వెల్లడించింది. అంతేకాదు తమ యాప్ లోని ఐ హ్యావ్ స్పేస్ సదుపాయం ద్వారా డెలివరీ, పికప్ పాయింట్లుగా పనిచేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చని అమెజాన్ ఇండియా సెల్లర్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ పిళ్ళై చెప్పారు. దీంతో పాటు వాక్-ఇన్ కస్టమర్లకు 'అమెజాన్ ఈజీ' అనే సౌకర్యం కూడా అందుబాటులో వుంటుందన్నారు. అమెజాన్ ఈజీ మార్కెట్లలోని వినియోగదారులకు ఆన్లైన్ షాపింగ్ సౌలభ్యాన్ని పొందటానికి వీలు కల్పిస్తుందనీ, మొదటిసారి ఆన్లైన్ దుకాణదారులకు, ఇంటర్నెట్, భాషతో పాటు డిజిటల్ చెల్లింపులు వంటి వివిధ లావాదేవీల అడ్డంకులను తొలగించడానికిసహాయపడుతుందన్నారు. భారతదేశంలోని ఏ ప్రాంతం నుండైనా స్థానిక షాపులు, ఆఫ్‌లైన్ రిటైలర్లు ఈ కార్యక్రమంలో చేరవచ్చన్నారు. ఈ పైలట్ కార్యక్రమం కోసం రూ .10 కోట్లు పెట్టుబడులతో ఇప్పటికే 100 కి పైగా నగరాల నుండి 5,000 మంది స్థానిక దుకాణాలను, రిటైలర్లను తన ప్లాట్ఫామ్లోకి చేర్చుకున్నామని గోపాల్ పిళ్లై వెల్లడించారు. (కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ) (1/2) Happy to announce “Local Shops on Amazon”, a program enabling local retailers & shopkeepers of all sizes to leverage Amazon’s technology & grow their footprint digitally. After a successful pilot with 5000+ stores, we are pledging Rs10 Crores to scale the program. — Gopal Pillai (@GopalPillai) April 23, 2020 -
అమెజాన్ నుంచి ఇక ‘కిరాణా నౌ’
త్వరలో దేశవ్యాప్తంగా విక్రయాలు దీనికోసం చిరు వ్యాపారులతో జట్టు ‘సాక్షి’తో అమెజాన్ డెరైక్టర్ అమిత్ పాండే హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిత్యావసర వస్తువుల్ని ఆన్‌లైన్‌లోకి తేవడానికి ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ సిద్ధమయింది. ఇందుకోసం ‘కిరాణా నౌ’ పేరిట చిన్నచిన్న కిరాణా వర్తకులతో చేతులు కలుపుతోంది. బెంగళూరులో కంపెనీ ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ సేవల్ని ఆరంభించింది. దుకాణదారులు స్మార్ట్‌ఫోన్ ఉంటే ‘కిరాణా నౌ’లో భాగస్వాములుత కావొచ్చు. ప్రస్తుతానికి కస్టమర్ తన మొబైల్ ఫోన్ నుంచి మాత్రమే ఆన్లైన్లో సరుకులను ఆర్డర్ చేయాలి. 4 గంటల్లోపు డెలివరీ చేస్తారు. వ్యాపారులను సమాయత్తం చేసేందుకు 18 నగరాల్లో తమ బృందాలు నిమగ్నమయ్యాయని అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ డెరైక్టర్ అమిత్ దేశ్‌పాండే తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. పెట్టుబడులు రూ.12,000 కోట్లు... భారత్‌లో రూ.12,000 కోట్ల పెట్టుబడులకు సిద్ధమైనట్లు అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ తెలియజేశారు. ఇందులో భాగంగానే 2.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో హైదరాబాద్‌లోని కొత్తూరులో గిడ్డంగి నిర్మిస్తున్నట్లు తెలిపారు. ‘మే’ నెల నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్న ఈ గిడ్డంగి... భారత్‌లో కంపెనీకి అతిపెద్దదిగా మారుతుంది. దీంతో 9 రాష్ట్రాల్లో కంపెనీ నిర్వహిస్తున్న 10 గిడ్డంగుల మొత్తం సామర్థ్యం 10 లక్షల చదరపు అడుగులకు చేరుతుంది. ఈ గిడ్డంగితో దక్షిణాది రాష్ట్రాలకు ఉత్పత్తులను వేగంగా డెలివరీ ఇచ్చేందుకు కంపెనీకి వీలవుతుందన్నారు. పెద్ద నగరాల వాటా సగమే... అమెజాన్ వ్యాపారంలో పెద్ద నగరాల వాటా 50 శాతం ఉండగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కూడా 50 శాతం నమోదవుతోందని అమిత్ దేశ్‌పాండే చెప్పారు. 50 శాతం కస్టమర్లు మొబైల్ ఫోన్ ద్వారా ఆర్డర్లిస్తున్నారని తెలియజేశారు. ‘దేశవ్యాప్తంగా 22వేల మంది వ్యాపారులు అమెజాన్‌తో చేతులు కలిపారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 3 వేల మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో ముత్యాలు, పట్టు వస్త్రాలు, ఆభరణాల వ్యాపారులు దేశవ్యాప్తంగా విస్తరణకు ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రాముఖ్యత ఉన్న నిర్మల్ బొమ్మలు, పోచంపల్లి చీరల వంటి ఉత్పత్తులకు ఆన్లైన్ వేదిక కల్పించనున్నాం. గిడ్డంగి ఏర్పాటైతే వ్యాపారం గణనీయంగా పెరుగుతుంది’ అని చెప్పారు.