kirana store
-
కిరాణా దుకాణాలకు టెక్నాలజీ ప్లాట్‌ఫామ్
క్విక్ కామర్స్(quick commerce) సంస్థల మాదిరిగానే కిరాణా దుకాణాలకు ప్రత్యేకంగా ఆన్లైన్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి తీసుకురావాలని ది ఫెడరేషన్ ఆఫ్ రిటెయిలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FRAI) ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే క్విక్ కామర్స్ సంస్థల ద్వారా వస్తున్న పోటీని తట్టుకోలేక కిరాణా దుకాణాలు కుదేలవుతున్నాయని చెప్పింది. వీటికితోడు రిటైల్(Retail) అవుట్లెట్లు పెరుగుతున్నాయని పేర్కొంది. కొత్త కంపెనీలు రిటైల్ స్టోర్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాయని, ఇప్పటికే ఆన్లైన్ షాపింగ్ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు క్విక్‌కామర్స్ సేవలు ప్రారంభిస్తున్నాయని వివరించింది.ఈ నేపథ్యంలో కిరాణాదారులకు భారీగా నష్టం వాటిల్లుతుందని ఎఫ్ఆర్ఏఐ తెలిపింది. క్విక్ కామర్స్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు సంప్రదాయ కిరాణా దుకాణాలకు ప్రత్యేక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వం కల్పించాలని చెప్పింది. ఇప్పటికే మార్కెట్లో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో(Zepto) వంటి క్విక్ కామర్స్ సంస్థల నుంచి పోటీ పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం కిరాణా దుకాణాలకు తోడ్పాటు అందించాలని తెలిపింది.ఇదీ చదవండి: ఎకానమీపై ఆర్బీఐ బులెటిన్ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఏఐ గౌరవ అధికార ప్రతినిధి అభయ్ రాజ్ మిశ్రా మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) వంటి కొత్త టెక్నాలజీలు, కిరాణా దుకాణాలకు క్విక్ కామర్స్ పోటీను తట్టుకునేలా పరిష్కారం అందిస్తాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎఫ్ఆర్ఏఐలో 42 రిటైల్ సంఘాలు ఉన్నాయి. 80 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి రిటైలర్లకు ఈ అసోసియేషన్ ప్రాతినిధ్యం వహిస్తోంది. -
'రెండు లక్షల కిరాణా స్టోర్లు మూతపడతాయి': ఏఐసీపీడీఎఫ్
భారతదేశంలో క్విక్ కామర్స్ బిజినెస్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఆన్లైన్ వ్యాపారం దేశంలోని సుమారు 2 లక్షల కిరాణా షాపులు మూతపడటానికి కారణమవుతాయని 'రిటైల్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్' (AICPDF) వెల్లడించింది.చాలామంది నిత్యావసర వస్తువులను ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ పండుగ సీజన్లో కిరాణా స్టోర్ల విక్రయాలు చాలా వరకు మందగించాయని ఫెడరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో సుమారు 13 మిలియన్ల కిరాణా స్టోర్స్ ఉన్నట్లు.. ఇందులో 10 మిలియన్ల కంటే ఎక్కువ టైర్ 2, చిన్న నగరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.ఏఐసీపీడీఎఫ్ జాతీయ అధ్యక్షుడు ధైర్యశీల్ పాటిల్ ప్రకారం.. క్విక్ కామర్స్ సైట్స్ వల్ల చిన్న వ్యాపారులు భారీగా నష్టపోతున్నారు. దీనికి కారణం ఆ సైట్లలో అందించే కొన్ని డిస్కౌంట్స్ కూడా అని వెల్లడించారు. ఆన్లైన్లో కొనుగోళ్లు పెరగటం వల్ల రాబోయే రోజుల్లో చిల్లర వ్యాపారులను భారీ నష్టాన్ని చూడాల్సి ఉంటుంది, లేదా వారి వ్యాపారాలకు మంగళం పాడాల్సి ఉంటుందని అన్నారు.ఇదీ చదవండి: బాంబుల్లా పేలుతున్న బంగారం ధరలు: తారాజువ్వలా మరింత పైకి..గత రెండు, మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది కిరాణా స్టోర్లకు కస్టమర్ల సందర్శనలు దాదాపు సగానికి పడిపోయాయని తెలుస్తోంది. క్విక్ కామర్స్ ప్రభావం మెట్రోల్ నగరాల్లో ఎక్కువగా ఉంది. ఈ కారణంగా ఇప్పటికే.. టైర్ 1 నగరాల్లో 60,000 స్టోర్స్, టైర్2, టైర్ 3 నగరాల్లో 50,000 స్టోర్స్ మూతపడ్డాయి. కాబట్టి చిన్న చిల్లర వ్యాపారులకు రక్షణ కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఏఐసీపీడీఎఫ్ వెల్లడించింది. View this post on Instagram A post shared by Upsc World official (@upscworldofficial) -
ప్రజలను దోచుకుంటున్న వ్యాపారస్తులు.. ఇలా మోసం చేస్తున్నారు!
నగరంలోని ఓ కిరాణా దుకాణంలోని ఎలక్ట్రానిక్ కాంటాపై అర కిలో బరువు తూకం రాయి (బాట్) వేసి బరువు చూడగా 640 గ్రాములు డిస్ప్లే అయింది. కిలో బాట్ వేస్తే 1,180 గ్రాములు డిస్ప్లే అయింది. రెండు కిలోలకు 2,205 గ్రాములు డిస్ప్లే అయింది. చేపలు, మాంసం మార్కెట్లలో సైతం ఇదే పరిస్థితి కనిపించింది. ఓ షాపులో కిలో కంది పప్పు కొనుగోలు చేసి మరో షాపులోని డిజిటల్ త్రాసుపై తూకం వేస్తే 1100 గ్రాముల బరువు డిస్ప్లే అయింది. తిరిగి ఆప్షన్ సరి చేసి తూకం వేస్తే అసలు బరువు రూ.900 గ్రాములు డిస్ప్లే అయింది. దీనిని బట్టి చూస్తే ప్రతి షాపులో తూకంలో దోపిడే. ఒక షాపులో 100 గ్రాములు, మరో షాపులో 200 గ్రాములుంది. తూనికల కొలతల శాఖచే స్టాంపింగ్ చేసిన తూకం రాళ్లతో నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు. మార్కెట్లలో ‘సాక్షి’ పరిశీలనలో తూకం దోపిడీ బయటపడింది. సాక్షి, హైదరాబాద్: తప్పుడు తూకంతో వినియోగదారులు నిత్యం మోసపోతూనే ఉన్నారు. నిలువు దోపిడీకి గురై జేబులు గుల్ల చేసుకుంటున్నారు. వీధిలోని చిన్న కిరాణా దుకాణానికో, సూపర్ మార్కెట్‌కో వెళ్లి ఏది కొన్నా.. తక్కువ తూకమే వస్తోంది. ఎలక్ట్రానిక్, డిజిటల్ త్రాసుపై తూకం వేసి ఇవ్వడంతో అంతా సవ్యంగానే ఉందనుకుంటాం. కానీ ఉండేది కిలో కాదు.. 900 నుంచి 950 గ్రాములే! లీటర్ నూనె గానీ, పాలు గానీ తీసుకుంటే వస్తున్నవి 850 నుంచి 950 మిల్లీలీటర్లే. ఇవే కాదు బియ్యం, ఉప్పులు, పప్పుల నుంచి బంగారం దాకా తూకంలో మోసం జరుగుతూనే ఉంది. ఇక నేరుగా లారీ లు, ట్రక్కులతోనే బరువు తూచే ఇసుక, ఇనుము వంటి వాటి తూకంలోనైతే భారీగా మోసాలు జరుగుతుంటాయి. వ్యాపారులు సాధారణ త్రాసులతో పాటు ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను ట్యాంపర్ చేసి వినియోగదారులను నిలువు దోపిడీ చేయడం షరామామూలుగా మారింది. ఎలక్ట్రానిక్ కాంటాపై 1000, 2000 గ్రాముల తూకం రాళ్ల బరువు ఇలా.. 1,180, 2,205 ఎలక్ట్రానిక్లోనూ ట్యాంపరింగ్.. సాధారణ తూకం రాళ్ల త్రాసులతో మోసం జరుగుతుందని అందరూ భావిస్తారు.. అనుమానం వ్యక్తం చేస్తారు. అవసరమైతే వ్యాపారులను నిలదీస్తారు.. ఎలక్ట్రానిక్, డిజిటల్ త్రాసు, కాంటాల రీడింగ్ డిస్ప్లే అవుతుంది... అంతా కళ్ల ముందే కనిపిస్తుందని కాబట్టి మోసం జరగదన్న నమ్మకం ఉంటుంది. కానీ ఇక్కడే పప్పులో కాలేసేది. అసలు సాధారణ త్రాసుల కన్నా ఎలక్ట్రానిక్, డిజిటల్ త్రాసులతో మరింత సులువుగా మోసం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ కాంటాల్లో బరువు తూచే విధానాన్ని సవరించేందుకు మోడ్ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లను మార్చడం ద్వారా తక్కువ సరుకులు పెట్టినా డిస్ప్లేపై ఎక్కువ బరువు కనిపించేలా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. చేతివాటం ఇలా.. వ్యాపారులు ఎలక్ట్రానిక్, డిజిటల్ లో ఉన్న నాలుగు ఆప్షన్లలో ఒకదానిలో కిలోకు 100 నుంచి 150 గ్రాములు తక్కువగా సెట్టింగ్ చేస్తారు. ఉదాహరణకు.. ఆప్షన్ నొక్కి ఎలక్ట్రానిక్ మిషన్‌పై 850 నుంచి 900 గ్రామలు బరువు పెడితే 1000 గ్రాములు (కిలో) తూకం డిస్ప్లే అవుతోంది. అదే మీషన్‌పై వాస్తవంగా కిలో బరువు పెడితే 1100 నుంచి1150 గ్రాములు డిస్ప్లే అవుతుంది. అంటే ప్రతి కిలోకు వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు చేతివాటమే. అయిదు కిలోలు తీసుకుంటే 500 నుంచి 750 గ్రాముల వరకు కత్తెరే . మరో ఆప్షన్‌ను నొక్కి వేస్తే మాత్రం తూకం సక్రమంగా ఉంటుంది. బ్రాండ్ల ప్యాకింగ్‌లో సైతం మార్కెట్లో వివిధ బ్రాండ్ల నూనె ప్యాకెట్లలో నిర్దేశించిన బరువు కంటే తక్కువగా నూనె ఉంటోంది. లీటర్ ప్యాకెట్లలో 50 నుంచి 100 మిల్లీలీటర్లు, 5 లీటర్ల బాటిళ్లలో 200 నుంచి 400 మిల్లి లీటర్ల వరకు తక్కు వగా ఉండటం సర్వసాధారణం. పెట్రోల్ బంకుల్లో ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్ 50 మిల్లీలీటర్ల నుంచి 100 మిల్లీలీటర్ల వరకు తక్కువగా ఉంటోంది. కూరగాయలు, పండ్లు, మాంసం, చేపల మార్కెట్ల వంటి చోట్ల అడుగున కట్ చేసిన తప్పుడు తూకం రాళ్లను వినియోగిస్తుంటారు. కొందరు వినియోగదారులు గుర్తించి ఫిర్యాదులు చేసినా... చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నగరంలోని సికింద్రాబాద్, రాంనగర్, గడ్డిఅన్నారం, మాదన్నపేట, గుడిమల్కాపూర్, కొత్తపేట తదితర మార్కెట్లలో తనిఖీ చేసేందుకు సిబ్బంది కొరత ఉంది. సమస్య వేధిస్తోంది.. నగర పరిధిలో çసుమారు 3 లక్షలకు పైగా వ్యాపార సంస్థలు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వ్యాపార సముదాయాలపై దాడులు, తనిఖీలు చేసి అక్రమాలను నియంత్రించే తూనికలు, కొలతల శాఖ సిబ్బంది సంఖ్య వేళ్లపై లెక్కించవచ్చు. గ్రేటర్ పరిధిలో అధికారులు, సిబ్బంది 25 మందికి మించరు. వారు కూడా తూతూమంత్రపు తనిఖీలు, నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. కళ్లెదుటే మోసగిస్తారు.. మాదన్నపేట మార్కెట్లో కళ్లెదుటే తూకంలో దండి కొడతారు. అడిగితే గొడవకు దిగుతారు. కిలో కూరగాయలు కొంటే 800 గ్రాములే వస్తున్నాయి. – దశరథ లక్ష్మి, మాదన్నపేట ఫిర్యాదు నంబర్లను ప్రదర్శించాలి తూకంలో తేడా వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఫోన్‌నంబర్లను మార్కెట్లలో ప్రదర్శించాలి. – లలిత, కుర్మగూడ ఫిర్యాదు చేయొచ్చు ఇలా.. టోల్ ఫ్రీ నంబర్ : 180042500333 వాట్సాప్ నంబర్ : 73307 74444 ఈ మెయిల్ ఐడీ: clm&ts@nic.in -
వినడానికి కొత్తగా ఉన్నా.. ఈ టైర్ల కంపెనీ సేల్స్ టెక్నిక్ మైండ్‌బ్లోయింగ్!
వీధి చివర కిరాణా దుకాణంలో వాహన టైర్లు అందుబాటులో ఉంటే..? వినడానికే కొత్తగా ఉంది కదూ..! ఆర్పీజీ గ్రూపు కంపెనీ సియట్ ఇదే ఆలోచనను అమలు చేస్తోంది. కస్టమర్లకు చేరువ అయ్యేందుకు కిరాణా దుకాణాలను సైతం వినియోగించుకోవాలన్నది ఈ సంస్థ ప్రణాళికగా ఉంది. పాలు, కూరగాయలు, పప్పులు, ఉప్పులు కొనుగోలు చేసే షాపులో టైర్లు అమ్మడమే ఇప్పుడు కొత్త ట్రెండ్. నిత్యావసరాలు, ఆహారం, ఔషధాల మాదిరిగా కాకుండా.. టైర్ల పరిశ్రమ పరిమిత వృద్ధితో కూడినది. ఈ పరిమిత మార్కెట్లోనూ మెరుగైన విక్రయాలు నమోదు చేయాలన్నది సియట్ అభిమతంగా ఉంది. అందుకే ఇప్పటి వరకు అసలు టైర్లను విక్రయించని దుకాణాలతో ఓ నెట్‌వర్క్‌ను సియట్ ఏర్పాటు చేసింది. ఈ దుకాణాల వద్ద కూడా కస్టమర్ల కోసం టైర్లను అందుబాటులో ఉంచుతుంది. దీంతో దాదాపు దేశ ప్రజల్లో అధిక శాతాన్ని చేరుకోవచ్చన్నది కంపెనీ యోచన. దాదాపు ప్రతిరోజు ఏదో ఒక అవసరం కోసం వెళ్లే వీధి దుకాణం వద్ద.. ‘సియట్’ టైర్లు కస్టమర్ల కళ్లలో పడుతుంటాయి. దీంతో బ్రాండ్‌కు ఉచిత ప్రచారం కూడా లభించినట్టు అవుతుంది. నూతన నమూనా.. ‘‘కిరాణా స్టోర్లు, పంక్చర్ రిపేర్ దుకాణాలు, ఓఈఎం మినీ అధీకృత సేవా కేంద్రాలు, వాహన విడిభాగాలు విక్రయించే స్టోర్ల యజమానులను సంప్రదించి, సియట్ టైర్లను విక్రయించాలని కోరాం’’అని సియట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్ణబ్ బెనర్జీ తెలిపారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా ఉంది. 2021–22లో 1.34 కోట్ల ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోయాయి. ఇందులో సగానికి పైన గ్రామీణ, చిన్న పట్టణాల నుంచే ఉండడం గమనార్హం. ఒక విధంగా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల మార్కెటింగ్ నమూనాను సియట్ అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. సియట్ కంపెనీ విక్రయించే ద్విచక్ర వాహన టైర్లలో 70 శాతం సంప్రదాయేతర స్టోర్ల నుంచే ఉంటున్నాయి. గత కొన్నేళ్లుగా ద్విచక్ర వాహన టైర్ల మార్కెట్లో సియట్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. 2011 నాటికి 11 శాతంగా ఉన్న మార్కెట్ వాటాను 30 శాతానికి పెంచుకుని మార్కెట్ లీడర్‌గా ఎదిగింది. మార్కెట్ అగ్రగామిగా ఉన్న ఎంఆర్‌ఎఫ్‌ను సైతం టూవీలర్ విభాగంలో వెనక్కి నెట్టేసింది. కొన్నేళ్ల క్రితం 20,000 విక్రయ కేంద్రాలు ఉంటే, వాటిని 50,000కు పెంచుకున్నట్టు ఆర్ణబ్ బెనర్జీ వెల్లడించారు. కస్టమర్లకు మరింత చేరువ అయ్యే చర్యలను అనుసరిస్తున్నట్టు చెప్పారు. ఇతర టైర్ల కంపెనీలతో పోలిస్తే డీలర్లు, సబ్ డీలర్లకు సియట్ విక్రయించే ధర అధికంగానే ఉన్నప్పటికీ.. తన వాటాను మాత్రం పెంచుకోగలుగుతోంది. చదవండి: Elon Musk: ట్విటర్‌పై మరో బాంబు వేసిన ఎలాన్ మస్క్ -
డబ్బులు జేబులో పెట్టుకొని సామాను సర్దుకోమన్నారు.. కిందకు వంగడంతో..
లింగాలఘణపురం (ములుగు): లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన కిరాణ వ్యాపారిని తనిఖీ చేస్తున్నట్లు చేసి రూ.2 లక్షలు మాయం చేసి ఉడాయించారు. ఈ ఘటన వరంగల్– హైదరాబాద్ జాతీయ రహదారిపై జెర్సీ పాలకేంద్రం సమీపంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు జరిగింది. ఘటనకు సంబంధించి బాధితుడు కొడితాల శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. జెర్సీ పాలకేంద్రం సమీపంలో ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లో శేఖర్ బంధువు ప్లాటు కొనుగోలు చేయగా అతనికి ఇవ్వాల్సిన రూ.2 లక్షలతో పాటు కిరాణం సామాను కోసం మరో రూ.7వేలు తీసుకుని ఎక్సెల్ వాహనంపై జనగామకు బయలు దేరాడు. (చదవండి: వైరల్: యమ ‘స్పీడ్’గా వెళ్తున్న కామారెడ్డి కలెక్టర్ వాహనం.. ఏకంగా రూ.27,580 చలాన్లు!) నెల్లుట్ల బైపాస్ నుంచి సదరు వెంచర్ వద్దకు వెళ్లేందుకు యశ్వంతాపూర్ సమీపంలో ఉన్న బస్టాప్ వద్ద ఆగి బంధువుకు ఫోన్ చేశాడు. అతను కూడా వస్తున్నానని చెప్పడంతో వెంచర్ వద్దకు వెళ్తున్నాడు. అప్పటికే బస్టాప్ వద్ద బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అతని ముందుకు వెళ్లి అడ్డంగా బైక్ ఆపారు. వెంటనే ఒకరు దిగి ఫోన్ తీసుకుని, ఎక్సెల్ తాళం చెవి తీసుకున్నాడు. పెట్రోల్ పంపులో ఎవరిని కలిశావు.. ఏదో ఇచ్చావంటూ బుకాయించారు. నేను బంక్‌లోకి వెళ్లలేదని, ఎవరిని కలువలేదని చెబుతుండగానే సంచిలో ఏం ఉన్నాయి బయటకు తీయాలని ఆదేశించారు. సంచి తీయగానే జేబులో ఏం ఉన్నాయని గద్దించారు. డబ్బులు ఉన్నాయని చెప్పి చూపించగా డబ్బులు జేబులో పెట్టుకొని సంచిలో సామాను సర్దుకోమని చెప్పారు. వంగి సామాను సర్దుకుంటుండగానే జేబులోని డబ్బులు మాయం చేసి ఎక్సెల్ తాళం చెవితో బైక్‌పై పరారయ్యారు. సంచి సర్దుకుని జేబులో డబ్బులు చూసుకోగానే లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. అప్పటికే తన బంధువు అక్కడికి రావడంతో ఇద్దరూ కలిసి సదరు వ్యక్తులను వెంబడించే ప్రయత్నం చేశారు. నిడిగొండ వరకు వెళ్లి రఘునాథపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ పరిధి తమకు లేదని, జనగామకు వెళ్లాలని సూచించగా అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేశారు. సీఐ బాలాజీవరప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీశారు. (చదవండి: కూరలు కుతకుత.. టమాటా ఒకటే అనుకుంటే పొరపాటే.. ఈ పట్టిక చూడండి) -
కిరాణా వర్తకులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: కిరాణా వర్తకుల మూలధన నిధుల అవసరాలకు మద్దతుగా నిలిచేందుకు ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ నూతనంగా ఒక ‘క్రెడిట్ ప్రోగ్రామ్’ను ప్రకటించింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు భాగస్వామ్యంతో సులభ రుణాలను సమకూర్చనుంది. కిరాణా వర్తకుల ఇబ్బందులను పరిష్కరించేందుకు, వ్యాపార వృద్ధికి నిధుల అవసరాలను తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ప్రకటించింది. ఇందులో భాగంగా కిరాణా వర్తకులు ఎటు వంటి వ్యయాలు లేకుండానే రుణ సాయాన్ని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు, ఇతర ఫిన్‌టెక్ సంస్థల నుంచి పొందొచ్చని తెలిపింది. ఈ రుణాలు రూ.5,000 నుంచి రూ.2 లక్షల వరకు.. 14 రోజుల కాలానికి ఎటువంటి వడ్డీ లేకుండా లభిస్తాయని పేర్కొంది. చదవండి : ఆ పేరు మార్చండి, అమెజాన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు -
ఆడియో కలకలం.. బోధన్ ఎమ్మెల్యే బూతు పురాణం
సాక్షి, నిజామాబాద్: బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఆడియో టేపు కలకలం రేపుతోంది. ఓ కిరాణా దుకాణం యజమానిని బూతులు తిడుతూ వేధిస్తున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రంజాన్ పండుగకు ఆర్డర్ ఇచ్చిన తోఫా ప్యాకెట్లకు సంబంధించిన డబ్బులు అడిగిన దుకాణం యజమానిపై ఎమ్మెల్యే బూతు పురాణం మొదలెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నాలుగేళ్ల క్రితం బోధన్ ఎమ్మెల్యే షకీల్ రంజాన్ పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన కిరాణా వ్యాపారి అయిన రుద్రంగి మురళీధర్‌కు 6వేల తోఫా ప్యాకెట్లను ఆర్డర్ చేశారు. ఒక్కోటి రూ.600 రూపాయల చొప్పున 6000 వేల ప్యాకెట్లకు ఆర్డర్ ఇవ్వగా.. ఎమ్మెల్యే 36లక్షలు రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో షకీల్ అడ్వాన్స్‌గా 12 లక్షల రూపాయలు చెల్లించి మిగిలిన మొత్తాన్ని తర్వాత ఇస్తానని చెప్పారు. 2019 ఎన్నికల్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా క్యాటరింగ్ నిమిత్తం మురళీధర్‌కు మరో 4 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఇలా ఎమ్మెల్యే షకీల్, కిరాణా వ్యాపారికి 30లక్షల రూపాయల వరకు బాకీ పడ్డారు. తన డబ్బులు ఇప్పించాలని మురళీధర్ రెండేళ్ల నుంచి ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నా ఆయన స్పందించడం లేదు. దీంతో బాధితుడు ఎమ్మెల్యే సన్నిహితుడి వద్ద బాధను చెప్పుకోగా ఆ వ్యక్తి ఎమ్మెల్యే షకీల్‌తో రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడించాడు. ఈ నేపథ్యంలోనే మురళీధర్‌పై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నీకు డబ్బులు ఇచ్చేది ఎక్కడిదిరా..’ అంటూ చెప్పుకోలేని రీతిలో దుర్భాషలాతుడూ కాల్ కట్ చేశారు. ఎమ్మెల్యే బూతు పురాణాన్ని సెల్ఫోన్లో రికార్డు చేసిన బాధితుడు మీడియా ఎదుట తన గోడు వెళ్లిబోసుకున్నాడు. బ్యాంక్ రుణం తీసుకుని షాపు పెట్టుకున్నానని, ఎమ్మెల్యే కారణంగా ఈఎంఐలు కట్టలేకపోవడంతో అధికారులు తన షాపును సీజ్ చేశారని మురళీధర్ తెలిపాడు. తనకు న్యాయం చేయాలని బోధన్ ఏసీపీని ఆశ్రయిస్తే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎమ్మెల్యే కారణంగా తన కుటుంబం రోడ్డున పడిందని, తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. చదవండి: వీఆర్ఓపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తిట్ల పురాణం! ఆడియో టేప్ లీక్: ఖుష్బూ క్షమాపణ -
కిరాణా C/o గల్లీ దుకాణం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ నిత్యావసరాల కొరత లేకుండా ప్రజలకు విశేష సేవలందించడంలో గల్లీ కిరాణా దుకాణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎక్కడికక్కడ పోలీసు కట్టడి, దూరపు ప్రయాణాల నియంత్రణ, ప్రభుత్వాల హెచ్చరికల నేపథ్యంలో వినియోగదారులంతా ఢిల్లీ నుంచి గల్లీ వరకు అంతా కిరాణా దుకాణాల మీదే ఆధారపడుతున్నారు. తాజా సరుకులు అందిస్తూ, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటుండటంతో 94 శాతం వినియోగదారులు ఈ దుకాణాల వైపే మొగ్గు చూపుతున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. చిన్న దుకాణమే పెద్ద దిక్కు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోన్న నేపథ్యంలో నిత్యావçసర సరుకులు అందుబాటులో ఉంచడంలో కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు, స్టోర్లు, ఈ–కామర్స్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తూ వచ్చాయి. అయితే లాక్‌డౌన్‌తో సాధారణంగా వారానికి సరిపడా సరుకులను కొనుగోలు చేసే అలవాటుకు భిన్నంగా వినియోగదారులు నెల రోజులకు సరిపడా సరుకుల కొనుగోలు చేశారు. దీంతో పెద్దపెద్ద సూపర్ మార్కెట్లు, స్టోర్లలో సరుకులు నిండుకున్నాయి. అదీగాక చాలా స్టోర్లలో పనిచేసే 20 నుంచి 30 మంది సిబ్బందిలో ప్రస్తుతం 5 మంది కూడా అందుబాటులో లేరు. దీనికి తోడు సరుకులు తెచ్చే వాహనాల రవాణాలో ఇబ్బందులు, గోదాముల్లో సరుకుల ప్యాకేజింగ్‌కు సిబ్బంది కొరత నేపథ్యంలో పెద్ద మార్కెట్లు చేతులెత్తేయడంతో వినియోగదారులంతా కిరాణా దుకాణాల వైపు మళ్లారు. దేశవ్యాప్తంగా 6.65 మిలియన్ల కిరాణా దుకాణాలు ఉండగా, రాష్ట్రంలో 35 లక్షలకు పైగా కిరాణా దుకాణాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి పది కుటుంబాలకు ఒకటి చొప్పున అందుబాటులో ఉన్నాయి. దీంతో హోల్‌సేల్ వ్యాపారులు ఈ దుకాణదారులే లక్ష్యంగా సరుకుల సరఫరా పెంచారు. అదీగాక సరుకుల కొనుగోలుకు 3 కి.మీ. దాటి వెళ్లరాదన్న పోలీసుల నిబంధనతో పాటు కిరాణా దుకాణాల వద్ద పక్కాగా అమలవుతున్న పరిశుభ్రత, ఇంటి దగ్గరలోనే కొనుగోలు, నాణ్యత, ప్రయాణ సౌకర్యాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 94 శాతం మంది వినియోగదారులు కిరాణా దుకాణాల మీదే ఆధారపడుతున్నారని ‘బిజినెస్ టూ బిజినెస్’సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. గతంలో ఈ వాటా కేవలం 82 శాతంగా ఉండేదని తెలిపింది. దీనికి అదనంగా కిరాణా దుకాణాదారులు సైతం డిజిటల్ చెల్లింపులను పెంచారు. గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా చెల్లింపులు జరపడం వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తోంది. కిరాణా దుకాణాల ద్వారా సరుకుల కొనుగోళ్లు జరుగుతుండటంతో హోల్‌సేల్ వ్యాపారులు సైతం వీటికి సరఫరా పెంచారు. పండ్లు, ఉల్లిగడ్డ, నిమ్మకాయలు.. ప్రస్తుత డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులను సైతం కిరాణా దుకాణాలు నిర్ణీత ధరలకే అమ్ముతున్నాయి. వీటితో పాటే చాలా కిరాణా దుకాణాల్లో టమాటా, ఉల్లిగడ్డ, నిమ్మకాయలు, కొన్ని రకాల పండ్ల అమ్మకాలు సైతం మొదలు పెట్టారు. వినియోగదారుల నుంచి వచ్చిన డిమాండ్‌ను బట్టి అదనపు సరుకులు అందుబాటులో ఉంచుతున్నారు.ఇది కూడా దుకాణాల వైపు మొగ్గు చూపేందుకు కలిగి స్తోంది. ‘స్థానిక కిరాణా దుకాణదారులపై వినియోగదారులకు నమ్మకం ఎక్కువ. ధరలు అందుబాటులో ఉంచడంతో పాటే నాణ్యమైన సరుకును అందించడంతో నమ్మకం కలిగిన అమ్మకందారులని విశ్వసిస్తారు. అయితే వీరు మరిన్ని సౌకర్యాలు అప్‌గ్రేడ్ చేసుకుంటే వీరిపై ఆధారపడే వారి సంఖ్య మరింత పెరుగుతుంది’అని సర్వే వెల్లడించింది. పండ్లు, కూరగాయలు అడుగుతున్నరు ‘సాధారణ రోజుల్లో మా వద్ద పాలు, పెరుగు, ఇతర కిరణా సామానుకు డిమాండ్ ఉండేది. అర్ధ కిలో, కిలో మేరకే గోధుమపిండి, రవ్వ, చక్కెర వంటివి తీసుకునేవారు. ఇప్పుడు దుకాణానికి వస్తున్నవారు రెండు, మూడు కిలోలు ఒకేసారి తీసుకెళ్తున్నరు. నిమ్మకాయలు, ఉల్లిగడ్డ, టమాటా, పండ్లు అమ్మమని కోరుతున్నారు’. – వెంకటేశం, కిరాణా దుకాణదారు, సంగారెడ్డి సూపర్ మార్కెట్లకు పోవడం లేదు.. ‘లాక్‌డౌన్‌కు ముందు వరకు సరుకుల కోసం సూపర్మార్కెట్లు, స్టోర్‌కు వెళ్లేవాళ్లం. 15 రోజులకు సరిపడా సరుకులు ఒకేసారి తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు అంత దూరం పోలేం. అందుకు కిరాణా దుకాణాల్లోనే అన్ని తెచ్చుకుంటున్నాం. ధరలు సూపర్మార్కెట్ల కన్నా తక్కువే ఉన్నాయి’. – జ్యోతి,వినియోగదారు, ఖైరతాబాద్ -
కొరుకుడు బాబా..దొంగ లీల
సాక్షి, ఆత్మకూరు(ఎం) : యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పుల్లాయిగూడెం గ్రామానికి చెందిన కొప్పుల రాంరెడ్డికి 35 ఏళ్ల వ యస్సు ఉంటుంది. నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయంలో ఆశించిన దిగుబడులు లేకపోవడంతో జీవనోపాధికి బొంబా యికి వెళ్లాడు. అక్కడ సాంచాలు నడుపుకుంటూ జీవితం గడిపాడు. తర్వాత స్వగ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. గ్రామంలో అతని కున్న నాలుగు ఎకరాలను సాగు చేస్తున్నాడు. గ్రామంలోని పంచా యతీ కార్యాలయం వద్ద కిరాణం కొట్టును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంత చేసినా.. పెద్దగా లాభం లేదనుకున్నాడు. ఎటువంటి పెట్టుబడి లేకుండా డబ్బు సంపాధించాలనుకున్నాడు. అందుకు బాబాగా అవతారం ఎత్తడమే.. మేలని తలచాడు. చెర్వుగట్టు వద్ద.. కొన్ని జిమ్మిక్కులు నేర్చుకుని బాబాగా అవతారం ఎత్తాలనున్న రైతు కొప్పుల రాంరెడ్డి కట్టుబొట్టును మార్చాడు. జుట్టును పెంచాడు. కాషాయపు అడ్డలుంగీ చుట్టాడు. బాబాగా అవతారం ఎత్తాడు. కొన్ని జిమ్మింగ్లు నేర్చుకోవడాని ప్రతి అమవాస్య రోజున చెర్వుగట్టుకు వెళ్లుండేవాడు. అక్కడ శివసత్తుల పూనకాలను గ్రహించసాగాడు. తర్వాత గ్రామానికి వచ్చి పూనకం ఊగుతుంతేవాడు. తన కంటూ కొందరు శిష్యులను తయారు చేసుకున్నాడు. తనకు దైవ శక్తులు అవహించినట్లుగా.. నేనేది చెప్పితే అది జరిగి తీరుతుందని ప్రజల్లో శిష్యుల ద్వార ప్రచారం కల్పించుకున్నాడు. రాంరెడ్డి కాస్తా కొరుకుడుగా బాబాగా.. కొప్పుల రాంరెడ్డి కొరుకుడు బాబాగా మారాడు. కొద్ది రోజులనుంచి కొరుకుడు బాబా దగ్గరకు భ క్తులు రావడం ప్రారంభమైంది. దీర్ఘకాలిక వ్యాధులు, సంతానలేమితో బాధపడుతున్న వారు, వ్యాపార రంగంతో కలిసి రాక ఇబ్బందులు పడుతున్న వారు కొరుకుడు బాబా దగ్గరకు రావడం ప్రారంభమైంది. రానురాను వారి సంఖ్య పెరిగిం ది. గతంలో ప్రతి ఆదివారం మాత్రమే భక్తులను చూసే ఈ కొరుకుడు బాబా ఆదివారంతో పాటు శుక్రవారం కూడా చూడడం ప్రారంభించాడు. భక్తుడిని కొరుకుతున్న కొప్పుల రాంరెడ్డి, భక్తురాలి ఒళ్లంతా వత్తుతున్న దొంగబాబా (ఫైల్) పంటిగాటుతో వికృత చేష్టలు.. తన వద్దకు వచ్చే భక్తులకు చిన్న సమస్య అయితే చిన్న పంటి గాటు, పెద్ద సమస్య అయితే పెద్ద పంటి గాటు చేసేవాడు. వంటి మీద కాషాయం వస్త్రం పరిచి తన పంటితో గాటు వేస్తాడు. అయితే ఇందుకు పీజు రూ.200 నుంచి రూ.500 తీసుకునే వాడు. మగవాళ్లు అయితే పడుకోబెట్టి, ఆడవాళ్లు అయితే నిలబెట్టి శరీమంతా తడుముతూ పండి గాట్లు పెట్టేవాడు. అంతే కాకుండా మీ సమస్య జఠిలంగా ఉంది.. ఇక్కడ పరిష్కారం అయ్యేది కాదు.. మీ ఇంటికి వచ్చి చూడాలని అక్కడకు వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు పలువురు బాధితులు చెబుతున్నారు. కొబ్బరి కాయలు దందా చేస్తున్న భార్య ఓ.. వైపు ఇంట్లో కూర్చొని కొరుకుడా బాబా కొప్పుల రాంరెడ్డి తన పంటి గాట్లతో నాలుగు కాసులు సంపాధిస్తుంటే.. అతడి భార్య కవిత వచ్చే భక్తులకు కొబ్బరికాయలు అమ్ముతూ భర్తకు చేదోడుగా నిలుస్తోంది. కొబ్బరికాయ మార్కెట్లో రూ.18 ఉంటే.. ఇక్కడ రూ.100కు అమ్ముతుంటుంది. కొబ్బరికాయతో పాటు రెండు నిమ్మకాయలు. పసుపు, కుంకుమ ప్యాకెట్ కవరు భక్తులకు అందచేసి రూ.100 తీసుకుంటూ దైవం చాటు దందాగా చేస్తోంది. ఎవరైనా భక్తులు బయట నుంచి కొబ్బరికాయలు తీసుకొస్తే అవి ఇక్కడ పనికి రావు.. బాబా ఆగ్రహానికి గురికా వాల్సి వస్తుందని చెప్పడంతో.. భక్తులు చేసేది లేక రూ.100 పెట్టి కొబ్బరికాయ సెట్ తీసుకునేవారు. ఈ కొరుకుడు బాబా వద్దకు హైదరాబాద్, భువనగిరి, మోత్కూరు, ఆత్మకూరు(ఎం), తిరుమలగిరి నుంచి బాధితులు వచ్చేవారు. వాట్సప్‌లో వైరల్ కావడంతో.. కొరుకుడు బాబా లీలలు వీడియో ఇటీవల వా ట్సప్‌లో వైరల్ కావడంతో పోలీసులు స్పందిం చారు. దీంతో కొరుకుడు బాబాను స్థానిక ఎస్ఐ కనకటి యాదగిరి ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ పి.జ్యోతి ఎదు ట బైండోవర్ చేశారు. దీంతో ఈ కొరుకుడు బా బా లీలలు ఒకోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గ్రామస్తులు కూడా ఇటువంటి కార్యక్రమాలను పోత్సహించొద్దని పోలీసులు హెచ్చరించారు. దీంతో ఈ బాబా ప్రస్తుతం గ్రామంలో ఉండకుండా.. బయట తిరుగుతున్నట్లు సమాచారం. -
కిరాణా సేవల్లోకి ‘స్విగ్గీ’
బెంగళూరు: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ నిర్వహణ సంస్థ ‘స్విగ్గీ’ వేగం పెంచింది. పోటీ సంస్థలను దీటుగా ఎదుర్కోవడం కోసం వ్యాపార సేవలను విస్తృతం చేసింది. ఇప్పటివరకు కేవలం ఫుడ్ డెలివరీ సేవల్లోనే ఉన్న ఈ సంస్థ.. గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్ తరహాలో ఇక నుంచి కిరాణా వస్తువులు, మందులు, శిశు సంరక్షణ ఉత్పత్తులు, ఇతర రోజువారీ సదుపాయాలను అందించనుంది. ఇందుకోసం ‘స్టోర్స్’ పేరిట ఒక ప్రత్యేక ఎఫ్ఎంసీజీ ఫ్లాట్‌ఫాంను మంగళవారం ఆవిష్కరించింది. తొలుత ఈ సేవలను హరియాణాలోని గురుగ్రామ్‌లో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించింది. ఇక్కడి 3,500 స్టోర్స్‌ను యాప్‌తో అనుసంధానం చేసినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ, సహ వ్యవస్థాపకులు శ్రీహర్ష మాజేటీ మాట్లాడుతూ.. ‘ప్రతి స్టోర్‌కు మా సేవలను అనుసంధానం చేయడంలో భాగంగా ప్రత్యేక ఎఫ్ఎంసీజీ ప్లాట్‌ఫాంను ప్రారంభించాం. స్విగ్గీ యాప్‌లోనే ఈ ప్రత్యేక సేవ ఉంటుంది. పళ్ళు, కూరగాయలు, పూలు, పెట్ కేర్ వంటి 200 ప్రత్యేక స్టోర్లను ఇప్పటికే యాప్‌తో అనుసంధానం చేశాం అని వ్యాఖ్యానించారు. -
చౌక ఇంటర్నెట్ : రూపాయికే వై-ఫై
వై-ఫై ఇప్పుడు నిత్యావసర జాబితాలో చేరిపోయింది. వై-ఫై లేని చోటు లేదంటే అతిశయోక్తి కాదేమో! అదే వైఫై ఇప్పుడు రోజూ తాగే టీ కంటే కూడా చవగ్గా అందుబాటులోకి వచ్చేసింది. ఛాయ్ దుకాణంలో కూర్చుని ఇంటర్నెట్ సర్ఫ్ చేసుకోవడమే కాకుండా... అదే ఛాయ్ దుకాణంలో, లేదా పక్కనే ఉన్న కిరాణా షాపుల్లో వై-ఫై కూపన్లను కొనుక్కొని ఎంచక్కా వాడుకోవచ్చు. ఇందుకోసం ఢిల్లీ, బెంగళూరులోని ఈ స్టోర్లు, ప్రీ-పెయిడ్ వై-ఫై ప్యాక్స్‌లను అందించడానికి కొన్ని స్టార్టప్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. రూపాయి నుంచి రూ.20 వరకు అందరికీ అందుబాటులో ఉండేలా కూపన్లను విడుదల చేస్తున్నాయి. పట్టణాల్లోని మురికివాడలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అత్యంత చవగ్గా వైర్లెస్ ఇంటర్నెట్ను అందించడమే లక్ష్యంగా స్టార్టప్‌లు ఈ సర్వీసులను అందిస్తున్నాయి. హరియాణా సరిహద్దులో ఉన్న ఢిల్లీలోని సంగం విహార్‌కు చెందిన ఓ స్టేషనరీ దుకాణ యజమాని బ్రహం ప్రకాశ్ ఇప్పటికే 250 వై-ఫై కూపన్లను విక్రయించాడు. రెండున్నర నెలల క్రితం తన దుకాణంలో వై-ఫై హాట్ స్పాట్‌ను ఏర్పాటు చేశాడు. ఐదు నిమిషాల పాటు వై-ఫైను ఉపయోగించుకునేందుకు రూపాయి కూపన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో యువత ఎక్కువగా ఈ ప్యాక్‌లను కొనుగోలు చేస్తున్నారని అతను పేర్కొన్నాడు. రూపాయితో కొనుగోలు చేసిన వైఫైతో ఐదు నిమిషాల్లో తమకు కావాల్సిన గేములు, పాటలు డౌన్లోడ్ చేసుకుని వెళ్లిపోతున్నారని తెలిపాడు. తన వద్ద రూ.20 కూపన్లు కూడా ఉన్నాయని ప్రకాశ్ చెప్పుకొచ్చాడు. ఢిల్లీకి చెందిన 'ఐ2ఆ1', బెంగళూరుకు చెందిన 'వైఫై డబ్బా' స్టార్టప్‌లు పబ్లిక్ డేటా ఆఫీసు(పీడీవో)లు ప్రారంభించి ప్రతి ఒక్కరికి వై-ఫైని అందుబాటులోకి తెస్తున్నాయి. అంతేకాక కిరాణా స్టోర్లలో రూటర్లను ఇన్స్టాల్ చేయడం 23 శాతం పెరిగిందని తమ అనాలసిస్‌లో వెల్లడైనట్టు ఐ2ఈ1 సహ వ్యవస్థాపకుడు సత్యం ధర్మోరా చెప్పారు. బెంగళూరు వ్యాప్తంగా 600 దుకాణాల్లో తాము వై-ఫై సేవలందిస్తున్నామని, 50ఎంబీపీఎస్ స్పీడులో 100-200 మీటర్ల రేడియస్ వరకు వైఫై అందిస్తున్నామని వైఫైడబ్బా సహ వ్యవస్థాపకుడు సుభేంద్ శర్మ చెప్పారు. అయితే ఖరీదైన ప్రాంతాల్లో మాత్రం వై-ఫై కూపన్లు అమ్ముడుపోవడం లేదని ఢిల్లీకి చెందిన ఓ టీస్టాల్ యజమాని వాపోయాడు. తాను ఇప్పటి వరకు ఒక్క కూపన్ కూడా విక్రయించలేదని, వై-ఫై రౌటర్‌ను తిరిగి ఇచ్చేయాలని భావిస్తున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం రూ.5 వై-ఫై కూపన్‌కు మంచి డిమాండ్ ఉందని ఓ షాప్ కీపర్ తెలిపాడు. -
కిరాణా స్టోర్లే.. ఇక ఏటీఎంలు
ముంబై : కిరాణా స్టోర్లే.. ఇక ఏటీఎంలు... ఏంటి అదెలా అనుకుంటున్నారా? పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఇది నిజం చేయబోతుంది. తన నెట్‌వర్క్‌ను విస్తరించే క్రమంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఈ వినూత్న ఆలోచనకు తెరతీసింది. వచ్చే నెలల్లో లక్ష కిరాణా స్టోర్లతో పేటీఎం డిజిటల్ బ్యాంకు భాగస్వామ్యం ఏర్పరుచుకోబోతుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో, బీ-టౌన్లలో ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకోబోతుంది. పేటీఎం లాంచ్ చేసిన పేమెంట్స్ బ్యాంకుతో జీరో బ్యాలెన్స్ అకౌంట్లను ప్రారంభించుకోవచ్చు. అంతేకాక డిజిటల్ లావాదేవీలకు జీరో ఛార్జీలే. కిరాణా స్టోర్లే ఏటీఎంలుగా పనిచేయనున్నాయి. ఈ స్టోర్లను 'పేటీఎం కా ఏటీఎం' అని పిలువనున్నారు. వీటిలోనే కస్టమర్లు సేవింగ్స్ అకౌంట్లు ప్రారంభించుకునేందుకు, నగదును డిపాజిట్ చేసి, విత్‌డ్రా చేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ప్రతి భారతీయుడికి బ్యాంకింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో 'పేటీఎం కా ఏటీఎం' బ్యాంకింగ్ అవుట్లెట్లను ప్రారంభిస్తున్నామని పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సీఈవో, ఎండీ రేణు సతి చెప్పారు. తమ ఇంటి పక్కనే ఉన్న అవుట్‌లెట్‌ను సందర్శించి, బ్యాంకు అకౌంట్ ప్రారంభించుకోవచ్చని పేర్కొన్నారు. నగదును డిపాజిట్ చేయడం, విత్‌డ్రా చేయడం, అదనంగా ఆధార్ లింక్‌ను చేపట్టడం వంటి లావాదేవీలను చేపట్టుకోవచ్చని చెప్పారు. నాణ్యమైన బ్యాంకింగ్ సర్వీసులను లక్షల కొద్దీ పనిచేసే, పనిచేయని కస్టమర్లకు అందజేయడానికి హైపర్-లోకల్ మోడల్ బ్యాంకింగ్ కీలక పాత్ర పోషిస్తుందని తాము నమ్ముతున్నట్టు తెలిపారు. ఢిల్లీ ఎన్సీఆర్, లక్నో, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, అలిఘర్ వంటి ఎంపికచేసిన నగరాల్లో 3000 స్టోర్లతో పేటీఎం ఒప్పందం కుదుర్చుకుంది. ఆఫ్‌లైన్ విస్తరణ కోసం దాదాపు రూ.3వేల కోట్లను పెట్టుబడులుగా పెడుతోంది. -
కిరాణా షాపులో చోరీ
హిందూపురం అర్బన్ : స్థానిక «ధనలక్ష్మీ రోడ్డులోని మసీదు వీధిలో మానెంపల్లి ఆదర్శ్ స్టోర్ షట్టర్‌ను ఎత్తి షాపులోని క్యాష్ బాక్సు పగులగొట్టి అందులోని చిల్లర నగదుతో పాటు చాకెట్ల ప్యాకెట్లు దొంగలు ఎత్తుకుపోయినట్లు షాపు నిర్వాహకుడు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెల్లవారుజామున జరిగిన సంఘటన చోటు చేసుకోవడంతో షాపు నిర్వాహకుడు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సంఘటన ప్రదేశాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.