భారతదేశంలో క్విక్ కామర్స్ బిజినెస్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఆన్‌లైన్ వ్యాపారం దేశంలోని సుమారు 2 లక్షల కిరాణా షాపులు మూతపడటానికి కారణమవుతాయని 'రిటైల్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్' (AICPDF) వెల్లడించింది.
చాలామంది నిత్యావసర వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ పండుగ సీజన్‌లో కిరాణా స్టోర్ల విక్రయాలు చాలా వరకు మందగించాయని ఫెడరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో సుమారు 13 మిలియన్ల కిరాణా స్టోర్స్ ఉన్నట్లు.. ఇందులో 10 మిలియన్ల కంటే ఎక్కువ టైర్ 2, చిన్న నగరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఏఐసీపీడీఎఫ్ జాతీయ అధ్యక్షుడు ధైర్యశీల్ పాటిల్ ప్రకారం.. క్విక్ కామర్స్ సైట్స్ వల్ల చిన్న వ్యాపారులు భారీగా నష్టపోతున్నారు. దీనికి కారణం ఆ సైట్లలో అందించే కొన్ని డిస్కౌంట్స్ కూడా అని వెల్లడించారు. ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు పెరగటం వల్ల రాబోయే రోజుల్లో చిల్లర వ్యాపారులను భారీ నష్టాన్ని చూడాల్సి ఉంటుంది, లేదా వారి వ్యాపారాలకు మంగళం పాడాల్సి ఉంటుందని అన్నారు.
ఇదీ చదవండి: బాంబుల్లా పేలుతున్న బంగారం ధరలు: తారాజువ్వలా మరింత పైకి..
గత రెండు, మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది కిరాణా స్టోర్‌లకు కస్టమర్ల సందర్శనలు దాదాపు సగానికి పడిపోయాయని తెలుస్తోంది. క్విక్ కామర్స్ ప్రభావం మెట్రోల్ నగరాల్లో ఎక్కువగా ఉంది. ఈ కారణంగా ఇప్పటికే.. టైర్ 1 నగరాల్లో 60,000 స్టోర్స్, టైర్2, టైర్ 3 నగరాల్లో 50,000 స్టోర్స్ మూతపడ్డాయి. కాబట్టి చిన్న చిల్లర వ్యాపారులకు రక్షణ కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఏఐసీపీడీఎఫ్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment