కొరుకుడు బాబా..దొంగ లీల | Fake Baba in Nalgonda Cheating Public In A Different Way | Sakshi
Sakshi News home page

కొరుకుడు బాబా..దొంగ లీల

Published Mon, Mar 25 2019 12:09 PM | Last Updated on Mon, Mar 25 2019 12:09 PM

Fake Baba in Nalgonda Cheating Public In A Different Way - Sakshi

కొరుకుడు బాబాను తహíసీల్దార్‌ ఎదుట భైండోవర్‌ చేసిన పోలీసులు (ఫైల్‌)

సాక్షి, ఆత్మకూరు(ఎం) : యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పుల్లాయిగూడెం గ్రామానికి చెందిన కొప్పుల రాంరెడ్డికి 35 ఏళ్ల వ యస్సు ఉంటుంది. నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయంలో ఆశించిన దిగుబడులు లేకపోవడంతో జీవనోపాధికి బొంబా యికి వెళ్లాడు. అక్కడ సాంచాలు నడుపుకుంటూ జీవితం గడిపాడు. తర్వాత స్వగ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. గ్రామంలో అతని కున్న నాలుగు ఎకరాలను సాగు చేస్తున్నాడు. గ్రామంలోని పంచా యతీ కార్యాలయం వద్ద కిరాణం కొట్టును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంత చేసినా.. పెద్దగా లాభం లేదనుకున్నాడు. ఎటువంటి పెట్టుబడి లేకుండా డబ్బు సంపాధించాలనుకున్నాడు. అందుకు బాబాగా అవతారం ఎత్తడమే.. మేలని తలచాడు. 

చెర్వుగట్టు వద్ద.. కొన్ని జిమ్మిక్కులు నేర్చుకుని
బాబాగా అవతారం ఎత్తాలనున్న రైతు కొప్పుల రాంరెడ్డి కట్టుబొట్టును మార్చాడు. జుట్టును పెంచాడు. కాషాయపు అడ్డలుంగీ చుట్టాడు. బాబాగా అవతారం ఎత్తాడు. కొన్ని జిమ్మింగ్‌లు నేర్చుకోవడాని ప్రతి అమవాస్య రోజున చెర్వుగట్టుకు వెళ్లుండేవాడు. అక్కడ శివసత్తుల పూనకాలను గ్రహించసాగాడు. తర్వాత గ్రామానికి వచ్చి పూనకం ఊగుతుంతేవాడు. తన కంటూ కొందరు శిష్యులను తయారు చేసుకున్నాడు. తనకు దైవ శక్తులు అవహించినట్లుగా.. నేనేది చెప్పితే అది జరిగి తీరుతుందని ప్రజల్లో శిష్యుల ద్వార ప్రచారం కల్పించుకున్నాడు. 

రాంరెడ్డి కాస్తా కొరుకుడుగా బాబాగా..
కొప్పుల రాంరెడ్డి కొరుకుడు బాబాగా మారాడు. కొద్ది రోజులనుంచి కొరుకుడు బాబా దగ్గరకు భ క్తులు రావడం ప్రారంభమైంది. దీర్ఘకాలిక వ్యాధులు, సంతానలేమితో బాధపడుతున్న వారు, వ్యాపార రంగంతో కలిసి రాక ఇబ్బందులు పడుతున్న వారు కొరుకుడు బాబా దగ్గరకు రావడం ప్రారంభమైంది. రానురాను వారి సంఖ్య పెరిగిం ది. గతంలో ప్రతి ఆదివారం మాత్రమే భక్తులను చూసే ఈ కొరుకుడు బాబా ఆదివారంతో పాటు శుక్రవారం కూడా చూడడం ప్రారంభించాడు.

 
భక్తుడిని కొరుకుతున్న కొప్పుల రాంరెడ్డి, భక్తురాలి ఒళ్లంతా వత్తుతున్న దొంగబాబా (ఫైల్‌) 

పంటిగాటుతో వికృత చేష్టలు..
తన వద్దకు వచ్చే భక్తులకు చిన్న సమస్య అయితే చిన్న పంటి గాటు, పెద్ద సమస్య అయితే పెద్ద పంటి గాటు చేసేవాడు. వంటి మీద కాషాయం వస్త్రం పరిచి తన పంటితో గాటు వేస్తాడు. అయితే ఇందుకు పీజు రూ.200 నుంచి రూ.500 తీసుకునే వాడు. మగవాళ్లు అయితే పడుకోబెట్టి, ఆడవాళ్లు అయితే నిలబెట్టి శరీమంతా తడుముతూ పండి గాట్లు పెట్టేవాడు. అంతే కాకుండా మీ సమస్య జఠిలంగా ఉంది.. ఇక్కడ పరిష్కారం అయ్యేది కాదు.. మీ ఇంటికి వచ్చి చూడాలని అక్కడకు వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బులు  డిమాండ్‌ చేసినట్లు పలువురు బాధితులు చెబుతున్నారు. 

కొబ్బరి కాయలు దందా చేస్తున్న భార్య
ఓ.. వైపు ఇంట్లో కూర్చొని కొరుకుడా బాబా కొప్పుల రాంరెడ్డి తన పంటి గాట్లతో నాలుగు కాసులు సంపాధిస్తుంటే.. అతడి భార్య కవిత వచ్చే భక్తులకు కొబ్బరికాయలు అమ్ముతూ భర్తకు చేదోడుగా నిలుస్తోంది. కొబ్బరికాయ మార్కెట్‌లో రూ.18 ఉంటే.. ఇక్కడ రూ.100కు అమ్ముతుంటుంది. కొబ్బరికాయతో పాటు రెండు నిమ్మకాయలు. పసుపు, కుంకుమ ప్యాకెట్‌ కవరు భక్తులకు అందచేసి రూ.100 తీసుకుంటూ దైవం చాటు దందాగా చేస్తోంది. ఎవరైనా భక్తులు బయట నుంచి కొబ్బరికాయలు తీసుకొస్తే అవి ఇక్కడ పనికి రావు.. బాబా ఆగ్రహానికి గురికా వాల్సి వస్తుందని చెప్పడంతో.. భక్తులు చేసేది లేక రూ.100 పెట్టి కొబ్బరికాయ సెట్‌ తీసుకునేవారు. ఈ కొరుకుడు బాబా వద్దకు హైదరాబాద్, భువనగిరి, మోత్కూరు, ఆత్మకూరు(ఎం), తిరుమలగిరి నుంచి బాధితులు వచ్చేవారు.   

వాట్సప్‌లో వైరల్‌ కావడంతో..
కొరుకుడు బాబా లీలలు వీడియో ఇటీవల వా ట్సప్‌లో వైరల్‌ కావడంతో పోలీసులు స్పందిం చారు. దీంతో కొరుకుడు బాబాను స్థానిక ఎస్‌ఐ కనకటి యాదగిరి ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్‌ పి.జ్యోతి ఎదు ట బైండోవర్‌ చేశారు. దీంతో ఈ కొరుకుడు బా బా లీలలు ఒకోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గ్రామస్తులు కూడా ఇటువంటి కార్యక్రమాలను పోత్సహించొద్దని పోలీసులు హెచ్చరించారు. దీంతో ఈ బాబా ప్రస్తుతం గ్రామంలో ఉండకుండా.. బయట తిరుగుతున్నట్లు సమాచారం.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement