హైదరాబాద్లో వరుస చోరీలు | theft in malkajgiri mobile, kirana shops | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో వరుస చోరీలు

Published Sun, Jul 3 2016 11:17 AM | Last Updated on Sat, Aug 11 2018 6:04 PM

theft in malkajgiri mobile, kirana shops

హైదరాబాద్: నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా మల్కాజిగిరి ఎం.జె.కాలనీలో శనివారం రాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. రెండు దుకాణాల షట్టర్‌లు పగలగొట్టి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. కాలనీలోని కిరాణ దుకాణం, మొబైల్ షాప్‌ల్లోని బియ్యం బస్తాలు, విలువైన సెల్‌ఫోన్‌లు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం గమనించిన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

మరో ఘటనలో కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 3వ రోడ్డులోని ఓ ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇంట్లో వారు నిద్రిస్తుండగానే ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 7 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement