mobile showroom
-
బీ న్యూ షోరూంలో సంక్రాంతి ఆఫర్లు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో గత ఎనిమిదేళ్లుగా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న మొబైల్ రిటైల్ సంస్థ బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ సంక్రాంతి పండుగ సందర్భంగా వినియోగదారులకు ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మొబైల్స్ పై 10%, గృహోపకరణాల కొనుగోలుపై 60%వరకు, ల్యాప్‌టాప్‌పై రూ.20,000, టీవీలపై రూ.7000 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు సంస్థ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి కొనుగోలు కు ఎస్బీఐ కార్డుపై 5%, మోబీ క్విక్ పై రూ.1000, బజాజ్ ఫిన్సెర్వ్పై రూ.6000 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది. సిబిల్ స్కోర్‌తో సంబంధంలేకుండా ఆధార్, పాన్ కార్డులపై మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్‌లను 0% డౌన్ పేమెంట్, జీరో శాతం వడ్డీతో కొనుగోలు చేసేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించింది. మరిన్ని ఆఫర్ల కోసం దగ్గరలోని బీ–న్యూ స్టోర్‌ను సందర్శించి, సంక్రాంతి ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఒకడు చోరీ.. మరొకడు కాపలా!
హిమాయత్‌నగర్: ఒకడు గోడకు కన్నం వేస్తాడు... మరొకడు బయట ఉండి కాపాలా కాస్తాడు... ఇలా ఇద్దరి సమన్వయంతో 57 కొత్త ఫోన్లను చోరీ చేసి ఇప్పుడు కటకటాలపాలయ్యారు. ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించిన ఈ కేసులో రూ.14 లక్షల విలువ గల 57 స్మార్ట్ ఫోన్లు రికవరీ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. నిందితులు ఫయజుల్లాఖాన్ అలియాస్ ఖందా ఫయాజ్, సయ్యద్ మహబూబ్ అలీ అలియాస్ ఖుస్రూలను సోమవారం బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో ఏఆర్ శ్రీనివాస్ జాయింట్ సీపీ(వెస్ట్‌జోన్), అడిష్నల్ డీసీపీ టాస్క్‌ఫోర్స్ జి.చక్రవర్తిలతో కలిసి సీపీ మీడియా ఎదుట హాజరుపర్చారు. సీపీ అంజనీ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... నగరానికి చెందిన ఫయాజుల్లా ఖాన్ అలియాస్ ఖందా ఫయాజ్ 2014 నుంచి చోరీలకు పాల్పడుతున్నాడు. ఇప్పటి వరకు నగరంలోని మూడు కమిషనరేట్లలో 10కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతడిపై చాదర్ఘట్ పోలీసులు పీడీ యాక్ట్ ఓపెన్ చేశారన్నారు. మరో నిందితుడు సయ్యద్ మహబూబ్ అలీ అలియాస్ ఖుస్రూ 14 అటెన్షన్ డైవర్షన్, సెల్‌ఫోన్ చోరీ కేసుల్లో నిందితుడు. ఇతడిపై చార్మినార్ పోలీసులు పీడీ యాక్ట్ ఓపెన్ చేశారు. ఇటీవల ఉప్పల్, చార్మినార్, నాంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో టచ్ మొబైల్స్ చోరీ చేశారు. రాత్రి 11 గంటలకు తర్వాత... ఫయాజుల్లా ఖాన్ అలియాస్ ఖందా ఫయాజ్ సెల్ఫోన్లు చోరీ చేయడంలో దిట్ట. రాత్రి 11 గంటల తర్వాత ఫయాజుల్లా ఖాన్ అలియాస్ ఖందా ఫయాజ్, సయ్యద్ మహ్మద్‌తో కలిసి టార్గెట్ చేసిన సెల్‌ఫోన్ షాపు వద్దకు వెళ్తారు. ఫయాజ్ షాపు వెనుక వైపు గోడకు కన్నం వేసి లోపలికి చొరబడి ఫోన్లు చోరీ చేస్తాడు. సయ్యద్ షాపు పరిసరాల్లో నిలబడి ఎవరైనా వస్తుంటే ఫోన్ ద్వారా ఫయాజ్‌కు తెలుపుతాడు. ఇలా వీరు కొంతకాలంగా సెల్ఫోన్లు చోరీ చేస్తున్నారు. కెమెరా కట్... యాక్షన్ గోడకు కన్నం వేసి లోపలికి వెళ్లిన ఫయాజుద్దీన్ ఖాన్ ముందుగా సీసీ కెమెరా వైర్‌ను తెంచేస్తాడు. ఆ తర్వాత కెమెరా వీవైఆర్ను ధ్వంసం చేస్తాడు. షోకేస్‌లో ఉన్న ఖరీదైన మొబైల్స్‌ను బ్యాగ్‌లో నింపుకొని బయటకు వస్తాడు. వీటిని తనకు తెలిసిన వాళ్లకి మాయమాటలు చెప్పి విక్రయిస్తాడు. ఇలా ఇప్పటి వరకు కొట్టేసిన రూ.14లక్షల విలువ గల 57 సెల్ఫోన్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు రికవరీ చేశారు. వీటిలో ఎక్కువగా ఒప్పో కంపెనీకి చెందిన సెల్ఫోన్లు ఉన్నాయి. ఇప్పటికే ఇద్దరిపై పీడీ యాక్ట్‌లు నమోదై ఉండగా, తాజాగా ఉప్పల్ ఠాణా పరిధిలో చేసిన ఈ చోరీ కేసులో కూడా మరోమారు వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. -
మొబైల్ షాప్‌లో చోరీ
మనోహరాబాద్(తూప్రాన్): అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు మొబైల్ షాపు రేకులు పగులగొట్టి అందులోంచి విలువైన మొబైల్ ఫోన్లను చోరీ చేసిన సంఘటన మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ గ్రామ ప్రధాన చౌరస్తా వద్ద బాలాజీ మొబైల్స్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సోమవారం షాపు యజమాని భగవాన్‌దాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తన మొబైల్ షాపులో దాదాపు రూ.12 నుంచి 18 వేల విలువైన వివో, ఒప్పో, రెడ్మీ ఫోన్లు, తదితర ఫోన్లు ఉన్నాయని వాటిలోంచి దాదాపై రూ.3 లక్షల విలువైన వాటిని చోరీ చేసినట్లు తెలిపారు. తన షాప్‌కు పుకు ఇనుప రేకులు, వాటి కింద సిమెంట్ రేకులు, వాటి ఫాల్ సీలింగ్ ఉందని తెలిపారు. వాటిని ధ్వంసం చేసి చోరీ చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన సాయంత్రం వరకు పోలీసులు రాకపోవడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. -
పాయల్ విత్ ఫ్యాన్స్
-
భారత్‌లో యుహో మొబైల్స్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ల తయారీలో ఉన్న చైనా కంపెనీ యుహో మొబైల్... భారత్‌లో తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. తిరుపతి లేదా హరియాణాలోని గురుగ్రామ్‌లో ఈ యూనిట్‌ను నెలకొల్పనుంది. ఇందుకు రూ.100 కోట్లు వెచ్చిస్తామని కంపెనీ సేల్స్ డైరెక్టర్ కేశవ్ అరోరా చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో యుహో వాస్ట్ ప్లస్ మోడల్‌ను సినీ నటి సిమ్రాన్ చౌదరితో కలిసి విడుదల చేసిన సందర్భంగా బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఎక్కడ ప్లాంటును స్థాపించేదీ 3 నెలల్లో నిర్ణయిస్తామన్నారు. గురుగ్రామ్‌లో అసెంబ్లింగ్ యూనిట్ ఉందని, కొత్త ప్లాంటులో ఈ ఏడాదే ఉత్పత్తి కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పారు. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ వంటి మార్కెట్లకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తామన్నారు. 2019లో యుహో మొబైల్స్ కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనుంది. -
అధునాతన కాన్సెప్ట్‌తో ‘సెలెక్ట్ మొబైల్స్’ షోరూంలు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ ఫోన్ రిటైల్ చెయిన్ సంస్థ ‘సెలెక్ట్ మొబైల్స్’ శుక్రవారం హైదరాబాద్, జిల్లాలలో ఒకే రోజున పలు నూతన షోరూంలను ప్రారంభించింది. వీటితో కలిపి తమ మొత్తం షోరూంల సంఖ్య 30 దాటిందని సంస్థ ఫౌండర్, ఛైర్మన్ వై.గురు చెప్పారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో సెలెక్ట్ మొబైల్స్ షోరూంల సంఖ్యను 200కు పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు గుర్తు చేశారు. అధునాతన కాన్సెప్ట్‌తో ప్రారంభమవుతున్న తమ షోరూంలకు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నట్లు తెలియజేశారు. షోరూంల ప్రారంభం సందర్భంగా వినూత్న ఆఫర్లను ప్రకటిస్తున్నట్లు తెలిపిన ఆయన... మొబైల్స్ కొనుగోలు చేసిన కస్టమర్లకు ఆఫర్లలలో భాగంగా వాషింగ్ మెషీన్లు, కూలర్లు, మిక్సీ లు, ఫ్యాన్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. -
హన్మకొండలో కాజల్ సందడి..
హన్మకొండ : సినీ నటి కాజల్ అగర్వాల్ రాకతో గురువారం హన్మకొండలోని నయీంనగర్ సందడిగా మారింది. అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ముందుగా ఆమె పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదుట నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ మొబైల్స్ మల్టీ బ్రాండ్ రిటైల్ స్టోర్స్ షోరూంను ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం మొదటి మొబైల్‌ను కొనుగోలు చేశారు. ఆ తర్వా త షోరూం ఎదుట ఏర్పాటుచేసిన వేదికపైకి చేరుకుని ప్రజలకు అభివాదం చేయగా.. అభిమానుల ఈలలు, కేరింతలతో ఆ ప్రాంతం మార్మోగింది. అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా హన్మకొండ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ సంపత్‌రావు ఆధ్వర్యం లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ మొబైల్ షోరూ ం ప్రారంభించడానికి హన్మకొండకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. హన్మకొండలో ఏర్పాటుచేసిన హ్యాపీ మోబైల్ స్టోర్ 27వ షోరూం అని.. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని హ్యాపీ స్టోర్స్ మెగా ఆఫర్స్ ప్రకటించిందన్నారు. ప్రతి కొనుగోలుపై కచ్చితమైన బహుమతి వస్తుందని.. ప్రజలు ఆదరించాలని కోరారు. హ్యాపీ మొబైల్స్ అధినేత కృష్ణ పవన్ మాట్లాడుతూ హన్మకొండ నయీంనగర్‌లో, వరంగల్‌లో ఎస్బీఐ మెయిన్ బ్రాంచీ ఎదుట మొబైల్ స్టోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. తొలి ఏడాది 150 నుంచి 200 షోరూ ంలు ఏర్పాటుచేయాలనే యోచనలో ఉన్నట్లు వివరించారు. హ్యాపీ మోబైల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోట సంతోష్ మాట్లాడుతూ వినియోగదారులకు విస్తృత శ్రేణి అంతర్జాతీయ బ్రాండ్లతో కూడిన 200 ఎస్కేయూ డిస్ప్లేతో వినూత్న షాపింగ్ అనుభూతులు అందిస్తున్నామన్నారు. అత్యుత్తమ శ్రేణి మొబైల్స్, యాక్సెసరీస్ తమ వద్ద లభిస్తాయన్నారు. హాపీ స్టోర్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆఫర్లు ప్రకటించామని వెల్లడించారు. డ్యూయల్ కెమెరా ఫోన్‌ను రూ.399కే అందిస్తున్నామన్నారు. వీవో వై 69 ఫోన్ కొనుగోలుపై క్రోమ్టన్ ఎయిర్ కూలర్.. హానర్ 91 ఫోన్ కొనుగోలుపై వాషింగ్ మిషన్‌ను ఉచితంగా అందిస్తున్నామన్నారు. మైక్రోమాక్స్ పి701 కొనుగోలుపై హోమ్ థియేటర్ ఉచితంగా ఇస్తున్నట్లు వివరించారు. ఐ ఫోన్ ఎస్ఈ ఫోన్ పై 27 శాతం డిస్కౌంట్, నోకియా–5 పై 35 శాతం డిస్కౌంట్ అందిస్తున్నామన్నారు. 4జీ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.1999 నుంచి ప్రారంభమవుతుందని వివరించారు. వరంగల్ అంటే ఇష్టం హన్మకొండ: తనకు వరంగల్ అంటే ఇష్టమని.. ఇక్కడికి రావడం రెండో సారి అని సినీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అన్నారు. జిల్లాలోని వేయి స్తంభాల దేవాలయం, రామప్ప బాగా నచ్చిన ప్రదేశాలని.. వరంగల్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. హన్మకొండ కిషన్‌పురలో హ్యాపీ మొబైల్ స్టోర్‌ను ప్రారంభించిన అనంతరం హన్మకొండ నక్కలగుట్టలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వరంగల్ ప్రాంతంలో సినిమాలు తీస్తే నటిస్తానన్నారు. మహానటి సినిమా తనకు బాగా నచ్చిందన్నారు. అప్పటి నటికి సంబంధించిన చిత్రాన్ని ఇప్పుడు అద్భుతంగా తీశారన్నారు. ప్రస్తుతం మూడు భాషల్లో తీసే చిత్రంలో నటిస్తున్నట్లు వివరించారు. -
తళుక్కుమన్న తమన్నా..
ప్రొద్దుటూరు : సినీనటి తమన్నా ప్రొద్దుటూరులో హల్చల్ చేశారు. స్థానిక మైదుకూరు రోడ్డులో ఏర్పాటు చేసిన బీన్యూ మొబైల్స్ 53వ షోరూంను శనివారం ఉదయం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు వందల సంఖ్యలో అభిమానులు వచ్చారు.అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నుంచి ఆమె అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తాను నటిస్తున్న సినిమాల గురించి చెప్పడంతో అభిమానులు ఈలలు, కేకలు వేశారు. ఆమె స్వయంగా సెల్ఫీ స్టిక్‌తో ఫొటోలు తీయడం, ఆటో గ్రాఫ్‌లు ఇవ్వడం అభిమానుల్లో ఆనందం నింపాయి. సాంకేతిక సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి సాంకేతిక సేవలు కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేయాల్సిన అవసరం ఉందని తమన్నా పేర్కొన్నారు. బీ న్యూ మొబైల్స్ షోరూం ప్రారంభం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. ఇక్కడ తనకు ఇంత మంది అభిమానులు ఉండటం గర్వంగా ఉందన్నారు. నటిగా రాణించడం తన అదృష్టమని, ఆ కారణంగానే తనకు ఇంత మంది అభిమానులు ఏర్పడ్డారన్నారు. బీన్యూ మొబైల్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ వైడీ బాలాజీ చౌదరి మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలు అంటే తనకెంతో ఇష్టమని, ఆ కారణంగానే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా తమ షోరూంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆదోని, కదిరి ప్రాంతాల్లో సైతం షోరూంలు ఏర్పాటు చేశామని, లక్ష జనాభా ప్రతిపదికన షోరూంలు ప్రారంభిస్తున్నామన్నారు. ఏడాది ఆఖరు నాటికి నవ్యాంధ్రలో వంద, తెలంగాణాలో వంద షోరూంలు ఏర్పాటు చేసి రూ.500 కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో రాయల్ రెసిడెన్సీ ఓనర్ రాఘవరెడ్డి, బీ న్యూ మొబైల్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
కరీంనగర్లో కాజల్ అగర్వాల్ సందడి
-
సమంత ఫ్యాన్‌కు చేదు అనుభవం
సాక్షి, అనంతపురం : మితిమీరిన అభిమానం చేటన్న విషయం మరోసారి రుజువైంది. తాజాగా అగ్ర నటి సమంత అక్కినేని ఫ్యాన్ ఒకరికి చేదు అనుభవం ఎదురైంది. అనంతపురం జిల్లాలో సోమవారం ఓ మొబైల్ షోరూం లాంఛ్ కోసం నటి సమంత విచ్చేసింది. సుభాష్ రోడ్డులో హ్యాపీ మొబైల్ షోరూంను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ఆమెను చూడాలన్న ఆత్రుతతో దూసుకొచ్చాడు. అది గమనించిన పోలీసులు అతన్ని నిలువరించి చితకబాదారు. ఆపై తోపులాటతో పోలీసులు స్వల్ఫ లాఠీ ఛార్జీ చేశారు. అనుకోని ఘటనతో దిగ్భ్రాంతికి లోనైన సమంత.. కార్యక్రమాన్ని త్వరగా ముగించుకుని అనంతరం అక్కడి నుంచి నిష్క్రమించారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హీరోయిన్ సమంత అభిమానికి చేదు అనుభవం
-
చీరాలలో సందడి చేసిన హెబ్బా
-
బీన్యూ ఏలూరు షోరూమ్ ప్రారంభించిన కేథరీన్
ఏలూరు(సెంట్రల్): స్థానిక ఆర్ఆర్ పేటలో సోమవారం బీన్యూ మల్టీ బ్రాండ్ మొబైల్ షోరూంను హీరోయిన్ కేథరిన్ «థెరెస్సా ప్రారంభించారు. అనంతరం నూతనంగా విడుదలైన కొన్ని కంపెనీల ఫోన్లును ఆమె విడుదల చేశారు. కే«థరిన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఒక భాగం అయిందని అందుకు అనుగుణంగా లేటెస్ట్ టైక్నాలజీ మొబైల్స్‌ను మార్కెట్లో ముందుగా అతి తక్కువ ధరలకే బీన్యూ వినియోగదారులకు అందిస్తోందన్నారు. బీన్యూలో దీపావళికి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారని ఏలూరు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాను తమిళంలో హీరోలు జీవ, విశాల్తోను, తెలుగులో రవితేజతో ఒక్కో సినిమాలో నటిస్తున్నట్టు తెలిపారు. బీన్యూ చైర్మన్ బాలాజీ చౌదరీ మాట్లాడుతూ తమ షోరూమ్‌లో ప్రతి కంపెనీకి ఏజెంట్‌ను నియమించామన్నారు. కస్టమర్లు అభిరుచులకు అనుగుణంగా షోరూంలో యువతీయువకులను నియమించి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు త్వరలో ఏపీ, తెలంగాణలో కలిపి 100 షోరూంల వరకు ప్రారంభించనున్నట్టు చెప్పారు. బీన్యూ షోరూం ద్వారా 600 మందికి ఉపా«ధి కల్పించడం సంతోషకరమని, కస్టమర్లకు మంచి సర్వీస్ ఇవ్వాలని ప్రముఖ వ్యాపారవేత్త ఉషా బాలకృష్ణ కోరారు. కే«థరీన్ థెరిస్సాను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున షోరూం వద్దకు తరలిరావడంతో ఆమె కొద్దిసేపు వారితో ముచ్చటించారు. బీన్యూ సేల్స్ హెడ్ సాంబయ్య, మార్కెటింగ్ హెడ్ ఆనందవర్దన్, వినోద్ పాల్గొన్నారు. -
మొబైల్ షోరూమ్‌లో భారీ చోరీ
తాళం వేసి ఉన్న మొబైల్ షోరూమ్‌లో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. ఈ సంఘటన కాకినాడ రూరల్ తిమ్మాపురం సెంటర్లో గురువారం వెలగుచూసింది. స్థానిక స్వాతి మొబైల్ షోరూమ్‌లో బుధవారం రాత్రి దొంగలు పడి రూ. 6 లక్షల నగదుతో పాటు రూ. లక్ష విలువైన నాలుగు మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ టీవీ ఫూటేజీ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. -
హైదరాబాద్‌లో వరుస చోరీలు
హైదరాబాద్: నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా మల్కాజిగిరి ఎం.జె.కాలనీలో శనివారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. రెండు దుకాణాల షట్టర్లు పగలగొట్టి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. కాలనీలోని కిరాణ దుకాణం, మొబైల్ షాప్‌ల్లోని బియ్యం బస్తాలు, విలువైన సెల్ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం గమనించిన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మరో ఘటనలో కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 3వ రోడ్డులోని ఓ ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇంట్లో వారు నిద్రిస్తుండగానే ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 7 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.