
కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్న నటి సమంత
సాక్షి, అనంతపురం : మితిమీరిన అభిమానం చేటన్న విషయం మరోసారి రుజువైంది. తాజాగా అగ్ర నటి సమంత అక్కినేని ఫ్యాన్ ఒకరికి చేదు అనుభవం ఎదురైంది.
అనంతపురం జిల్లాలో సోమవారం ఓ మొబైల్ షోరూం లాంఛ్ కోసం నటి సమంత విచ్చేసింది. సుభాష్ రోడ్డులో హ్యాపీ మొబైల్ షోరూంను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ఆమెను చూడాలన్న ఆత్రుతతో దూసుకొచ్చాడు. అది గమనించిన పోలీసులు అతన్ని నిలువరించి చితకబాదారు. ఆపై తోపులాటతో పోలీసులు స్వల్ఫ లాఠీ ఛార్జీ చేశారు.
అనుకోని ఘటనతో దిగ్భ్రాంతికి లోనైన సమంత.. కార్యక్రమాన్ని త్వరగా ముగించుకుని అనంతరం అక్కడి నుంచి నిష్క్రమించారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment