Lati charge
-
రైతు ఖరీఫ్ కష్టాలు..
-
టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
-
జింఖానా గ్రౌండ్స్ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 25వ తేదీన భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం నగరంలోని జింఖానా మైదానంలో టికెట్ విక్రయాలు జరుగుతున్నాయి. కాగా, మ్యాచ్ వీక్షేందుకు టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు అర్ధర్రాతి నుంచే క్యూ లైన్లలో బారులుతీరారు. పెద్ద సంఖ్యలో అభిమానులు జింఖానా మైదానం వద్దకు తరలివచ్చారు. ఈ క్రమంలో టికెట్స్ కోసం ఒక్కసారిగా ఎగబడటంతో గ్రౌండ్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో నలుగురు త్రీవంగా గాయపడ్డారు. పలువురు స్పృహ తప్పపడిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పోలీసులు సైతం గాయపడ్డారు. పరిస్థితి అదుపుతప్పి ఉద్రికత్త చోటుచేసుకుంది. దీంతో, పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇదిలా ఉండగా.. టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. మ్యాచ్ టికెట్స్ విషయంలో బ్లాక్ టికెట్స్‌పై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. టికెట్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని సేల్ చేశారు? ఎవరికి ఎన్ని టికెట్స్ కేటాయిస్తున్నారో చెప్పాలన్నారు. బ్లాక్ దందా కోసం మ్యాచ్ టికెట్స్ ఇవ్వలేదన్నారు. క్రికెట్ మ్యాచ్ టికెట్స్ విషయంలో తెలంగాణ రాష్ట్ర పరువు తీయొద్దన్నారు. బ్లాక్ దందా జరిగినట్లు తెలిస్తే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైదరాబాద్‌లో హై టెన్షన్.. అసెంబ్లీ టూ ప్రగతి భవన్ రోడ్డు మూసివేత!
సాక్షి, తెలంగాణ: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు ప్రయత్నించారు. వీఆర్ఏలు, పలు ప్రజాసంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో అసెంబ్లీ నుంచి ప్రగతిభవన్ రోడ్డును పోలీసులు మూసివేశారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అక్కడున్న వ్యాపార సముదాయాలను సైతం పోలీసులు మూసివేయించారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక, ఇందిరా పార్క్ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన వీఆర్ఏలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు, వీఆర్ఏల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు.. వీఆర్ఏలపై లాఠీచార్జ్ చేశారు. కాగా, పెద్ద ఎత్తున జిల్లాల నుంచి వీఆర్ఏలు హైదరాబాద్‌కు తరలివచ్చినట్టు సమాచారం. అయితే, వీఆర్ఏల సమస్యలపై జిల్లాలో, గ్రామాల్లో వీఆర్ఏలు గత 50 రోజుల నుంచి నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం వల్లే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఇందిరా పార్క్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కాగా, పే స్కేల్ అమలు చేయాలంటూ వీఆర్ఏలు డిమాండ్ చేస్తున్నారు. రెడ్డి కార్పొరేషన్ కోసం రెడ్డి సంఘం ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని మత్య్సకారులు, సింగరేణి కార్మికులు నిరసనలు తెలిపారు. దీంతో ఎక్కడికక్కడ ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం వెంటనే బదిలీలు, పదోన్నతుల అమలుకు జీవో జారీ చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక, అసెంబ్లీ ముట్టడికి ఏడు సంఘాలు ప్రయత్నించినట్టు సమాచారం. -
బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత
-
బండి సంజయ్ పాదయాత్రలో హై టెన్షన్.. పోలీసుల లాఠీఛార్జ్
సాక్షి, జనగామ: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంజయ్ పాదయాత్రలో బండి సంజయ్ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు.. టీఆర్ఎస్ కార్యకర్తలతో కర్రలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో, ఒక్కసారిగా పరిస్థితి మారిపోయి ఉద్రిక్తతకు దారితీయడంతో కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి రెండు పార్టీలను కార్యకర్తలను చెదరగొట్టారు. ఇక, లాఠీఛార్జ్ కారణంగా కొందరు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉండగా.. హైకోర్టు అనుమతులతో పాంనూర్ నుంచి బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉప్పుగల్, కోనూర్, గరిమిళ్లపల్లి, నాగాపురం వరకు పాదయాత్ర కొనసాగనుంది. శనివారం భద్రకాళీ ఆలయం వద్ద మూడో విడతలో పాదయాత్ర ముగియనుంది. కాగా, పాదయాత్ర నేపథ్యంలో బండి సంజయ్‌ను టీఆర్ఎస్ సర్కార్ హెచ్చరించింది. పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఇక, పాదయాత్ర రూట్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇది కూడా చదవండి: పవర్ఫుల్ పీడీ యాక్ట్.. అదే జరిగితే ఎమ్మెల్యే రాజాసింగ్ ఏడాది జైల్లోనే! -
హుస్నాబాద్‌లో హై టెన్షన్.. పోలీసుల లాఠీఛార్జ్
సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని హుస్నాబాద్‌లో ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. భూ నిర్వాసితులు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో భూ నిర్వాసితులు, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కాగా, సోమవారం తెల్లవారుజామున 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. దీంతో నిర్వాసితులు ఆందోళనలకు దిగారు. మంగళవారం ప్రజా ప్రతినిధులు ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి నిర్వాసితులు ప్రయత్నించారు. ఈ క్రమంలో క్యాంపు ఆఫీసు నుండి బయటకు వచ్చిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో వాగ్వాదం జరిగింది. తోపులాట చోటుచేసుకోవడంతో ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి కింద పడిపోయారు. అనంతరం నిర్వాసితులను పోలీసులు అడ్డుకుని అనంతరం లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో పలువురు నిర్వాసితులు, హుస్నాబాద్ ఎసీపీ సతీష్, ఎస్ఐ గాయపడ్డారు. దీంతో ఐదుగురు భూ నిర్వాసిత యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఆ ఘటనను రాష్ట్రం మొత్తం ఆపాదించలేం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న సమయంలో పోలీసులు చేసిన లాఠీఛార్జ్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వనపర్తి ఘటనను రాష్ట్రం మొత్తం ఆపాదించలేమని తేల్చి చెప్పింది. పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశం హైకోర్టుకు లేదని పేర్కొంది. ప్రజలు రోడ్లపైకి ఎందుకు వచ్చారో.. అత్యవసరమా లేదా అనేది చూడాలని తెలిపింది. వనపర్తి ఘటనపై ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఘటనపై 17 లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. -
లాఠీఛార్జ్‌ని ఖండించిన వైఎస్ జగన్
-
రైతులపై దండయాత్ర!
పదకొండేళ్లక్రితం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటిస్తూ ఆయన ఇచ్చి వెళ్లిన స్ఫూర్తితో సకల మానవాళికి మానవ హక్కులు దక్కేందుకు కంకణధారులమవుదామని పిలుపునిచ్చింది. పైగా ఈసారి మహాత్ముడి జన్మదినం రోజున దేశవ్యాప్తంగా ఆయన 150వ జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. కానీ తమ కడగండ్లను పాలకుల దృష్టికి తీసుకొచ్చి, తక్షణ పరిష్కారం కోరేందుకు మంగళవారం భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి 70,000మందితో బయల్దేరిన ‘కిసాన్ క్రాంతి యాత్ర’ ఇంకా ఢిల్లీ చేరుకోకముందే, ఘజియాబాద్ వద్దే దానికి లాఠీలు ఎదురొచ్చాయి. వారిపై బాష్పవాయు గోళాలు, వాటర్కేనన్లు ప్రయోగించారు. ఎందరో గాయాలపాలయ్యారు. ఢిల్లీ సరిహద్దు రణరంగాన్ని తలపించింది. ఇది నిన్ననో, మొన్ననో ప్రారంభమైన క్రాంతియాత్ర కాదు. గత నెల 23న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచి కొన్ని వందలమందితో ప్రారంభమైన యాత్ర ముందుకు సాగినకొద్దీ పెరుగుతూ వచ్చింది. రైతులంతా ఇందులో ఎంతో క్రమశిక్షణతో పాల్గొన్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఢిల్లీలో ప్రవేశించినంత మాత్రాన వారి వల్ల శాంతిభద్రతలకు ముప్పు కలిగేదేమీ ఉండదు. ఒకవేళ దానిపై అనుమానాలుంటే ఆ క్రాంతియాత్ర నిర్వాహకులతో ముందుగానే మాట్లాడి, వారి డిమాండ్ల గురించి అవగాహన ఏర్పర్చుకుని, సాదరంగా చర్చలకు ఆహ్వానించి, తగిన నిర్ణయాలు ప్రకటించాల్సింది. కానీ అందుకు బదులుగా ఆ రైతులను ఢిల్లీ వెలుపలే నిలువరించడానికి పాలకులు నిశ్చయించుకున్నారు. నిషేధాజ్ఞలు విధించారు. రాజధాని నగరంలో అడుగుపెట్టడానికే వీల్లేదన్నారు. ఎండనకా, వాననకా పగలంతా నడుస్తూ...రాత్రుళ్లు పచ్చికబయళ్లలో నిద్రిస్తూ ఎన్నో కష్టాలకోర్చి వచ్చిన రైతులతో ఇలా వ్యవహరించడం సబబేనా? ఇంత జరిగాక రైతులు అడిగిన తొమ్మిది డిమాండ్లలో ఏడింటికి ఒప్పుకున్నామని, రైతులు సంతృప్తి వ్యక్తం చేశారని కేంద్రం ప్రకటించగా, అన్నీ అంగీకరిస్తేనే ఆందోళన విరమిస్తామని ఉద్యమకారులు చెబుతున్నారు. రైతుల డిమాండ్లు కొత్తవేమీ కాదు. వాటిల్లో అధిక భాగం గత సార్వత్రిక ఎన్నికల్లోనూ, అటుపై జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ హామీ ఇచ్చినవే. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని, ముఖ్యంగా సాగు దిగుబడులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, రుణమాఫీ చేస్తామని, చెరకు రైతుల బకాయిలు చెల్లిస్తామని ఆ పార్టీ వాగ్దానం చేసింది. దానికితోడు పదేళ్లువాడిన ట్రాక్టర్లపై జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో ఉన్ననిషేధాన్ని రద్దు చేయాలని, డీజిల్ ధరలు రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని, వ్యవసాయానికి వాడే విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇన్సూరెన్స్ సంస్థలకే తప్ప తమకు ప్రయోజనకరంగా ఉండటం లేదని చెబుతున్నారు. దాన్ని తగిన విధంగా సవరించి అన్ని పంటలకూ వర్తింపజేయాలని విన్నవించుకుంటున్నారు. చెరకు సీజన్ ముగిసినా తమకు రావాల్సిన రూ. 19,000 కోట్ల రూపాయల బకాయిల సంగతి ఎత్తరేమని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 14 రోజుల్లో వీటిని చెల్లిస్తామన్న హామీ ఏమైందని అడుగుతున్నారు. దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాల మాదిరే రుణమాఫీ అమలు చేశామని యోగి ప్రభుత్వం కూడా చెబుతోంది. కానీ పాత రుణాలు మాఫీ కాక, కొత్త రుణాలు లభ్యంకాక అనేకమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మేం అధికారంలోకి రాకముందు కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరణనివ్వడం తప్ప ఇంతవరకూ ప్రభుత్వం చేసిందేమీ లేదు. యోగి ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు 40 శాతం పెరిగాయన్న సమాజ్‌వాదీ నేత అఖిలేష్ యాదవ్ ప్రకటనలో అతిశయోక్తి ఉండొచ్చు. కానీ అంతక్రితంకన్నా పెరిగాయన్నది వాస్తవం. మన వ్యవసాయ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సాగు వ్యయం అపరిమితంగా పెరిగింది. డీజిల్ ధర అయితే భరించలేని స్థాయికి చేరుకుంది. వీటన్నిటి కోసం భారీ మొత్తంలో పెట్టుబడి అవసరమవుతోంది. పాత రుణాలు మాఫీ అయ్యాయని ప్రభుత్వాలు చెబుతుండగా, ఆ బకాయిలు తీరకపోవడం వల్ల కొత్త రుణాలివ్వలేమని బ్యాంకులు ముఖం చాటేస్తున్నాయి. పర్యవసానంగా వారు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించక తప్పడం లేదు. కరువు, అకాలవర్షాలతో వచ్చే కష్టాలు సరేసరి. వీటన్నిటినీ ఓర్చుకుని పంటలు పండిస్తుంటే ఆ దిగుబడులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రైతులు చావు తప్ప పరిష్కారం లేదనుకోవడంలో వింతేముంది? క్వింటాల్ ధాన్యానికి ఇప్పుడిస్తున్న గిట్టుబాటు ధర రూ. 1,550ను రూ. 1,750కి పెంచుతామని గత నెలలో యూపీ సర్కారు ప్రకటించింది. నిజానికి అది కూడా రైతులకు ఏమూలకూ సరిపోదు. సాధారణ బియ్యం క్వింటాల్ కొనాలంటే వినియోగదారులు రూ. 5,000కు పైగా వెచ్చించవలసి వస్తుండగా ఆరుగాలం కష్టపడిన అన్నదాతకు దక్కుతున్నదెంత? ఒక్క ధాన్యానికి మాత్రమే కాదు, ఇతర పంటలకు కూడా ఇలా అరకొర ధరలే దక్కుతున్నాయి. బీకేయూ నిర్వహించిన క్రాంతియాత్ర అనేకవిధాల చెప్పుకో దగినది. ఇందులో మహిళలు సైతం చిన్న పిల్లలతో సహా వచ్చి పాల్గొన్నారు. మూడేళ్లక్రితం ముజఫర్‌నగర్‌లో హిందూ–ముస్లిం ఘర్షణలు జరిగాక పశ్చిమ యూపీలో రైతు ఉద్యమం దెబ్బతింది. కానీ గత నాలుగేళ్లుగా బీజేపీకి వెన్నుదన్నుగా నిలబడిన జాట్ రైతులు మళ్లీ ముస్లిం రైతులతో చేయి కలిపారు. ఒక్క యూపీలో మాత్రమే కాదు...అన్ని రాష్ట్రాల్లోని రైతులు ఏకమవుతున్నారు. ఉద్యమించడానికి సిద్ధపడుతున్నారు. వారి సమస్యలను ఉపేక్షించడం ఇక సాధ్యం కాదని, ఉత్తుత్తి వాగ్దానాలతో కాలక్షేపం చేయడం కుదరదని పాలకులు గుర్తించాలి. -
సమంత ఫ్యాన్‌కు చేదు అనుభవం
సాక్షి, అనంతపురం : మితిమీరిన అభిమానం చేటన్న విషయం మరోసారి రుజువైంది. తాజాగా అగ్ర నటి సమంత అక్కినేని ఫ్యాన్ ఒకరికి చేదు అనుభవం ఎదురైంది. అనంతపురం జిల్లాలో సోమవారం ఓ మొబైల్ షోరూం లాంఛ్ కోసం నటి సమంత విచ్చేసింది. సుభాష్ రోడ్డులో హ్యాపీ మొబైల్ షోరూంను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ఆమెను చూడాలన్న ఆత్రుతతో దూసుకొచ్చాడు. అది గమనించిన పోలీసులు అతన్ని నిలువరించి చితకబాదారు. ఆపై తోపులాటతో పోలీసులు స్వల్ఫ లాఠీ ఛార్జీ చేశారు. అనుకోని ఘటనతో దిగ్భ్రాంతికి లోనైన సమంత.. కార్యక్రమాన్ని త్వరగా ముగించుకుని అనంతరం అక్కడి నుంచి నిష్క్రమించారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భక్తులపై పోలీసుల ప్రతాపం
మంథని : గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు వెళ్తున్న భక్తులపై పోలీసులు ప్రతాపం చూపించారు. కమాన్‌పూర్ మండలం సెంటనరీకాలనీ ముల్కలపల్లికి చెందిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మంథని వద్ద గల గోదావరిలో వినాయకుడిని నిమజ్జనం చేశారు. అనంతరం నదిలో స్నానాలు చేస్తున్నారు. వారిని బయటకు రావాలని ఎస్సై ఉపేందర్ సూచించారు. వారు వినిపించుకోలేదు. ఎస్సై వారి వద్దకు వెళ్లగా.. ఓ భక్తుడు ఎస్సైని పక్కకు నెట్టేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్సై వారిపై లాఠీ ఝుళిపించారు. గన్‌మన్ కూడా లాఠీతో తన ప్రతాపాన్ని చూపించాడు. ఈ సంఘటనలో మల్లేశ్ అనే భక్తుడి చేయికి గాయమైంది. దీంతో వివాదం చెలరేగింది. ఎస్సై చెప్పిన వెంటనే బయటకువచ్చామని, గన్‌మన్ తమపై ఎందుకు దాడి చేస్తారని ప్రశ్నించారు. ఎస్సై ఉపేందర్ అక్కడి వచ్చి భక్తులకు నచ్చజెప్పారు. -
బంగారు తెలంగాణ అంటే లాఠీఛార్జీ చేయడమా?
హైదరాబాద్: బంగారు తెలంగాణ అంటే రైతులపై లాఠీఛార్జీ చేయడమా అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రైతుల నెత్తురు చిందడం తెలంగాణకు మంచిది కాదని ప్రభుత్వానికి సూచించారు. రైతులపై లాఠీ చార్జీకి నైతిక బాధ్యతగా కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో నిజాం నియంతృత్వ ధోరణి స్పష్టంగా కనబడుతోందని ఆయన అన్నారు. మెదక్ లాఠీఛార్జ్‌లో గాయపడ్డ రైతులను మీడియా ముందుకు బీజేపీ నేతలు తీసుకొచ్చారు. -
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడి
- కర్రలు, ఖాళీ మద్యం బాటిళ్లతో టీడీపీ నేతల దాడి - 11 మందికి గాయాలు - అర్ధరాత్రి పోలీసుల లాఠీచార్జి సోమల, న్యూస్‌లైన్: మండలంలోని పెద్ద ఉప్పరపల్లెలో మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. బస్టాం డులో ఖాళీ మద్యం బాటిళ్లు, కట్టెలతో టీడీపీ కార్యకర్తలు వీరవిహారం చేస్తూ దాడులకు పాల్పడ్డారు. ఈ సంఘటనలో 11 మంది వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దాడి విషయాన్ని తెలుసుకున్న సోమల ఎస్ఐ చిన్న రెడ్డెప్ప తన సిబ్బందితో కలసి పెద్ద ఉప్పరపల్లెకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపు లోకి తెచ్చేందుకు ఇరుపార్టీల నాయకులపై లాఠీచార్జి చేశారు. స్థానిక ఎన్నికల్లో భాగంగా పెద్ద ఉప్పరపల్లె-1 ఎంపీటీసీ స్థానానికి వైఎస్ఆర్ సీపీ తరపున పోటీ చేసిన గంగాధరం విజయం సాధిందారు. దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు తమ అనుచరుల తో కలసి వాహనాల్లో పెద్ద ఉప్పరపల్లె బస్టాండుకు చేరుకున్నారు. అదే సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో వాహనాలలో తెచ్చుకున్న కట్టెలు, ఖాళీ మద్యం బాటిళ్లు విసురుతూ కేకలు వేస్తూ బస్టాండులో ఉన్న వైఎస్ఆర్ సీపీ నాయకులపై దాడి చేశారు. ఈ సంఘటనలో పెద్ద ఉప్పరపల్లె కు చెందిన పద్మనాభరాజు(24), మునస్వామి(24), దాము(35), ప్రవీణ్(25), మునీంధ్ర(24), మస్తాన్(25), సద్ధామ్(23), చిట్టి(24), బాబ్జీ(28), ప్రకాష్‌రెడ్డి(25), రాము(30) గాయపడ్డారు. దాడి విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ సీపీ నాయకులు పెద్దఎత్తున పెద్ద ఉప్పరపల్లెకు చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఎస్ఐ చిన్న రెడ్డెప్ప సిబ్బందితో కలసి అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలపై లాఠీచార్జ్ చేశారు. అందరినీ చెదరగొట్టారు. వేకువ జాము వరకు పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. గాయపడిన కార్యకర్తలను ఎంపీటీసీ సభ్యుడు గంగాధరం, సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు గణపతి, మాజీ సర్పంచ్ బషీర్, మండల మాజీ ఉపాధ్యక్షుడు రామేశ్వర ప్రసాద్ తదితరులు పరామర్శించారు. దాడి హేయమైన చర్య వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకుల దాడి హేయమైన చర్య అని సింగిల్‌విండో మాజీ అధ్యక్షు డు శ్రీనివాసులు అన్నారు. బుధవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు ఓట ములు సహజమని, ఓడిపోయామనే ఆవేశంతో గెలుపొందిన వారిపై దాడులకు పాల్పడ్డం సరికాదన్నా రు. మండలంలో ఎక్కడైనా సరే వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే తగిన రీతిలో గుణ పాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. -
రణరంగమైన ‘నిజాం’ హాస్టల్
దత్తాత్రేయనగర్ /కలెక్టరేట్, న్యూస్‌లైన్: నిజాం కళాశాల హాస్టల్ శనివారం రణరంగంగా మారింది. ఏపీ ఎన్జీవోల సభ నేపథ్యంలో.. తెలంగాణ నినాదాలు చేస్తున్న విద్యార్థులపై పోలీసులు పలుమార్లు విరుచుకుపడ్డారు. వసతిగృహంలో టీఆర్ఎస్వీ నేత బాల్క సుమన్ హాస్టల్లో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు లోనికి వెళ్లారు. సుమన్‌తో పాటు దాదాపు 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అనుమతి లేకుండా హాస్టల్లోకి రావడంపై విద్యార్థులు ప్రశ్నించగా.. వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. దీంతో రోడ్లపైకి రాళ్లు రువ్వారు. అనంతరం కొందరు హాస్టల్ భవనం ఎక్కి నిరసన తెలిపారు. పోలీసులు హాస్టల్ విడిచి వెళ్లకపోతే దూకుతామంటూ హెచ్చరించారు. పోలీసులు మరోసారి హాస్టల్ లోపలికి ప్రవేశించి భవనంపై ఎక్కి వారిని అదుపులో కి తీసుకోవడంతో కొద్ది సేపు పరిస్థితి సద్దుమణిగింది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న నిజాం కళాశాల ప్రిన్సిపల్ టిఎల్ఎన్ స్వామి.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లోకి వచ్చేందుకు మీకెవరు అనుమతి ఇచ్చారని నిలదీశారు. అనుమతి లేకుండా హాస్టల్లోకి వెళ్లి విద్యార్థులపై లాఠీచార్జి చేయడాన్ని ఖండించిన ఆయన.. ఓయూ వీసీకి దృష్టికి తీసుకెళ్లి, హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మధ్యాహ్నం సమయంలో విద్యార్థులు మళ్లీ భవనమెక్కి, జెతైలంగాణ నినాదాలు చేశారు. పోలీసులు మళ్లీ వెళ్లి కిందకు దింపేందుకు యత్నించారు. అయితే, పోలీసులు వెళ్లిపోవాలని కోరాగా.. పట్టించుకో ని పోలీసులు వారిని నెట్టివేశారు. ప్రతిఘటిం చిన వారిపై లాఠీలతో విరుచుకు పడ్డారు. దీం తో శేఖర్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా, ప్రశాంత్ అనే విద్యార్థి చేయి విరిగింది. మరికొం దరికి గాయాలయ్యాయి. తోటి విద్యార్థులు శేఖర్‌ను చేతులపై ఎత్తుకుని బయటకు తీసుకురాగా, పోలీసులు డీసీఎంలో తీసుకెళ్లారు. అతని పరిస్థితి ఆందోళ న కరంగా ఉన్నట్లు సమాచారం. జర్నలిస్టుల ధర్నా.. విద్యార్థులపై లాఠీచార్జి ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాను పోలీసులు అనుమతించ లేదు. లోపల లాఠీచార్జి జరగడం లేదని వాదించారు. కానీ, పలువురు గాయాలతో బయటకు రావడంతో జర్నలిస్టులు లోనికి అనుమతించాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులు వారిని నెట్టివేయడంతో జర్నలిస్టులు అక్కడే ధర్నాకు దిగారు. దాడులను ఖండించిన ఓయూ జేఏసీ విద్యార్థులపై పోలీసులు, సీమాంధ్రులు దాడులు చేయడాన్ని టీఎస్, ఓయూ జేఏసీ ఖండించింది. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే భౌతిక దాడులకు తప్పవని హెచ్చరించింది.