సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న సమయంలో పోలీసులు చేసిన లాఠీఛార్జ్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వనపర్తి ఘటనను రాష్ట్రం మొత్తం ఆపాదించలేమని తేల్చి చెప్పింది. పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశం హైకోర్టుకు లేదని పేర్కొంది. ప్రజలు రోడ్లపైకి ఎందుకు వచ్చారో.. అత్యవసరమా లేదా అనేది చూడాలని తెలిపింది. వనపర్తి ఘటనపై ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఘటనపై 17 లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment