మండలంలోని పెద్ద ఉప్పరపల్లెలో మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.
- కర్రలు, ఖాళీ మద్యం బాటిళ్లతో టీడీపీ నేతల దాడి
- 11 మందికి గాయాలు
- అర్ధరాత్రి పోలీసుల లాఠీచార్జి
సోమల, న్యూస్‌లైన్: మండలంలోని పెద్ద ఉప్పరపల్లెలో మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. బస్టాం డులో ఖాళీ మద్యం బాటిళ్లు, కట్టెలతో టీడీపీ కార్యకర్తలు వీరవిహారం చేస్తూ దాడులకు పాల్పడ్డారు. ఈ సంఘటనలో 11 మంది వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దాడి విషయాన్ని తెలుసుకున్న సోమల ఎస్‌ఐ చిన్న రెడ్డెప్ప తన సిబ్బందితో కలసి పెద్ద ఉప్పరపల్లెకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపు లోకి తెచ్చేందుకు ఇరుపార్టీల నాయకులపై లాఠీచార్జి చేశారు. స్థానిక ఎన్నికల్లో భాగంగా పెద్ద ఉప్పరపల్లె-1 ఎంపీటీసీ స్థానానికి వైఎస్‌ఆర్ సీపీ తరపున పోటీ చేసిన గంగాధరం విజయం సాధిందారు. దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు తమ అనుచరుల తో కలసి వాహనాల్లో పెద్ద ఉప్పరపల్లె బస్టాండుకు చేరుకున్నారు.
అదే సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో వాహనాలలో తెచ్చుకున్న కట్టెలు, ఖాళీ మద్యం బాటిళ్లు విసురుతూ కేకలు వేస్తూ బస్టాండులో ఉన్న వైఎస్‌ఆర్ సీపీ నాయకులపై దాడి చేశారు. ఈ సంఘటనలో పెద్ద ఉప్పరపల్లె కు చెందిన పద్మనాభరాజు(24), మునస్వామి(24), దాము(35), ప్రవీణ్(25), మునీంధ్ర(24), మస్తాన్(25), సద్ధామ్(23), చిట్టి(24), బాబ్జీ(28), ప్రకాష్‌రెడ్డి(25), రాము(30) గాయపడ్డారు. దాడి విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్ సీపీ నాయకులు పెద్దఎత్తున పెద్ద ఉప్పరపల్లెకు చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఎస్‌ఐ చిన్న రెడ్డెప్ప సిబ్బందితో కలసి అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలపై లాఠీచార్జ్ చేశారు. అందరినీ చెదరగొట్టారు. వేకువ జాము వరకు పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. గాయపడిన కార్యకర్తలను ఎంపీటీసీ సభ్యుడు గంగాధరం, సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు గణపతి, మాజీ సర్పంచ్ బషీర్, మండల మాజీ ఉపాధ్యక్షుడు రామేశ్వర ప్రసాద్ తదితరులు పరామర్శించారు.
దాడి హేయమైన చర్య
వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకుల దాడి హేయమైన చర్య అని సింగిల్‌విండో మాజీ అధ్యక్షు డు శ్రీనివాసులు అన్నారు. బుధవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు ఓట ములు సహజమని, ఓడిపోయామనే ఆవేశంతో గెలుపొందిన వారిపై దాడులకు పాల్పడ్డం సరికాదన్నా రు. మండలంలో ఎక్కడైనా సరే వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే తగిన రీతిలో గుణ పాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు.