బంగారు తెలంగాణ అంటే లాఠీఛార్జీ చేయడమా?
హైదరాబాద్: బంగారు తెలంగాణ అంటే రైతులపై లాఠీఛార్జీ చేయడమా అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రైతుల నెత్తురు చిందడం తెలంగాణకు మంచిది కాదని ప్రభుత్వానికి సూచించారు.
రైతులపై లాఠీ చార్జీకి నైతిక బాధ్యతగా కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో నిజాం నియంతృత్వ ధోరణి స్పష్టంగా కనబడుతోందని ఆయన అన్నారు. మెదక్ లాఠీఛార్జ్‌లో గాయపడ్డ రైతులను మీడియా ముందుకు బీజేపీ నేతలు తీసుకొచ్చారు.