రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
Published Fri, Sep 30 2016 10:54 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
నార్కట్‌పల్లి : రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను అమలు చేయకుండా వారి జీవితాలతో సీఎం కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఎన్నికల్లో గెలిచిన అనంతరం విడుతలుగా మాఫీ చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం 7.90కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేస్తే రైతుల ఖాతాలలో జమచేయకుండా కృష్ణ పుష్కరాలకు నిధులను వాడుకోవడం సరైంది కాదన్నారు. అకాల వర్షాలతో మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.4లక్షలు కేటాయించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అక్టోబర్ 3న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అద్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాకి పాపయ్య, నియోజకవర్గ ఇన్‌చార్జి పాల్వాయి భాస్కర్‌రావు, లింగాల వీరయ్య తదితరులు ఉన్నారు.
Advertisement