Narketpally
-
రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెను ప్రమాదం
సాక్షి, నల్గొండ జిల్లా: తెల్లవారు జామున ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. నార్కెట్‌పల్లి అద్దంకి రహదారిపై కృష్ణాపురం వద్ద ఘటన జరిగింది. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులోని 26 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు వేమూరి-కావేరి ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా బస్సు వెనుక టైర్ పేలడంతో రాపిడికి గురవడంతో ఘటన జరిగింది. చదవండి: గందరగోళంగా వాతావరణం.. తెలుగు రాష్ట్రాలకు కొనసాగనున్న వర్షాలు -
ప్రియుడితో కలిసి పేగు బంధం మరచి.. కన్నతల్లి కర్కశత్వం
సాక్షి, నల్గొండ: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓ తల్లి పేగుబంధం మరచి రెండేళ్ల పసిపాపను అత్యంత కర్కశంగా చంపేసింది. ప్రియుడితో కలిసి చిన్నారి ఊపిరి తీసేసింది. తలను గోడకు బాది.. ఆపై ముక్కు మూసి నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా హత్య చేసి ‘అమ్మ’తనానికి మాయని మచ్చతెచ్చింది. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడడంతో చివరకు కటకటాలపాలైంది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన రెండేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను సోమవారం నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. చిట్యాల మండలం ఎల్లికట్టె గ్రామానికి చెందిన ఉయ్యాల వెంకన్నకు కనగల్ మండలం లచ్చుగూడెం గ్రామానికి చెందిన రమ్యతో 2015లో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ప్రియాంశిక ఉన్నారు. రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి బారిన పడి వెంకన్న మృతిచెందడంతో రమ్య తన అత్తగారింట్లోనే ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. ఈక్రమంలో అదే గ్రామంలో కిరాణా దుకాణం నడుపుతున్న పెరిక వెంకన్నతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది అత్తమామలకు తెలియడంతో పలుమార్లు పెద్ద మనుషుల వద్ద పంచాయితీలు కూడా జరిగాయి. దీంతో మకాం నార్కట్‌పల్లికి మార్చారు. పెరిక వెంకన్న, రమ్య భార్యాభర్తలమని నమ్మబలికి రెండేళ్ల ప్రియాంశికతో కలిసి ఆరు నెలలుగా నార్కట్‌పల్లిలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కుమారుడిని మాత్రం తాత, నాయనమ్మల వద్ద ఎలికట్టేలోనే ఉంచింది. ఏడుస్తోందని చంపేశారు.. చిన్నారి రోదిస్తూ, భయపడుతోందంటూ పెరిక వెంకన్న, రమ్య హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ప్లాన్‌కు అనుగుణంగా తనకు, ఇద్దరు పిల్లలకు ఏమైనా హాని కలిగితే అత్త మామలు, ఎల్లికట్టె గ్రామ ఎంపీటీసీ దశరథ, మాదగోని శ్రీను, గ్రామ పెద్ద మనుషులే కారణం అని ఓ వీడియో తీసి దానిని ఈ నెల 13న ఎలికట్టె విలేజ్ గ్రూపులో పెట్టి బంధువులకు రమ్య వైరల్ చేసింది. మరుసటి రోజు రాత్రి ఇద్దరూ కలిసి చిన్నారి ప్రియాంశిక తలను గోడకు బాది.. సెల్‌ఫోన్‌తో కొట్టి, ఆ తర్వాత ముక్కు మూసి నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం చిన్నారికి ఫిట్స్ వచి్చందని నమ్మబలికి అదే రోజు రాత్రి 11 గంటలకు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలిక మృతిచెందిందని ధ్రువీకరించడంతో, మృతదేహాన్ని మార్చురీలో వదిలేశారు. సమాచారాన్ని అత్తమామలకు చేరవేసి ప్రియుడితో కలిసి రమ్య పరారైంది. బాలిక తాత యాదయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా రమ్య, పెరిక వెంకన్నను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారని డీఎస్పీ వివరించారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీఐ శివరాంరెడ్డి, ఎస్ఐ బొడిగే రామకృష్ణ, ఏఎస్ఐ నర్సిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్స్ సురేందర్, రమేశ్‌లను డీఎస్పీ అభినందించారు. -
నార్కట్ పల్లి బస్సు డిపో మూతపడనుందా..?
-
వైఎస్ఆర్ పాలన ఒక స్వర్ణయుగం: వైఎస్ విజయమ్మ
-
ఒకేరోజు 6,400 కోళ్లు మృతి
సాక్షి, నార్కట్‌పల్లి: కోళ్ల ఫామ్‌లో ఒకేరోజు 6,400 కోళ్లు మృతిచెందాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఏనుగులదోరి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ప్రీమియం కంపెనీ సహకారంతో తాను నిర్వహిస్తున్న కోళ్లఫామ్‌లో ఉన్నట్టుండి 6,400 కోళ్లు ఒకేసారి చనిపోయాయని బాధితుడు పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. వెంటనే కంపెనీ యజమానులకు తెలపగా, సిబ్బంది వచ్చి పరిశీలించి.. ఫామ్‌కు సంబంధించిన నీటిట్యాంకులో విషపూరిత రసాయనాలు కలిపిన ఆనవాళ్లు దొరికాయని, ఆ నీటిని తాగి కోళ్లు చనిపోయాయని నిర్ధారించారని చెప్పారు. -
పెళ్లి విందు పెట్టలేదని..
సాక్షి, నల్గొండ: పెళ్లి భోజనం పెట్టనందుకు కుల పెద్దలు ఓ కుటుంబానికి రూ. లక్ష జరిమానా విధించి, కులం నుంచి బహిష్కరించారు. జరిమానా చెల్లిస్తేనే కులదైవం గంగదేవమ్మ పండుగలో తమతో కలిసి పాల్గొనే అర్హత ఉంటుందంటూ ఆదేశించడంతో బాధితులు పోలీసులను, మీడియాను ఆశ్రయించారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ఏపీ లింగోటంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యాదవ కులస్థులు ఉగ్గేపల్లి లక్ష్మయ్య, రాములమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాస్ వివాహాన్ని గ్రామంలోనే ఏప్రిల్ 27న జరిపించారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో బంధువులను పెళ్లికి ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకున్న కుల పేద్దలు కులస్థులను, గ్రామస్థులకు విందు భోజనం ఏర్పాటు చేయనందుకు ఆగ్రహించారు. గ్రామంలో జరగనున్న కులదైవం గంగదేవమ్మ పండుగకు ఆనవాయితీ ప్రకారం లక్ష్మయ్య కుటుంబం ఇచ్చిన నగదును(పట్టి) నిర్వాహకులు తిరిగి ఇచ్చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. కుమారుడి పెళ్లికి విందు ఏర్పాటు చేయనందుకు కుల బహిష్కరణ విధిస్తున్నట్లు చెప్పారు. తమను అవమానించిన కుల పెద్దలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, డీజీపీ, నల్లగొండ కలెక్టర్, ఎస్పీలకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. ఇలాంటి ఆధునిక యుగంలో కూడా కుటుంబాలను వేలేస్తూ, విధించిన జరిమానా కట్టాలని వేధిస్తున్న వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. దీంతో స్థానిక నార్కట్ పల్లి పోలీసులు, తహశీల్దార్ దీనిపై గ్రామంలోకి వెళ్లి విచారణ చేపట్టారు. -
సబ్ స్టేషన్లో అగ్నిప్రమాదం.. ఎగిసిన మంటలు
-
విద్యుత్ సబ్ స్టేషన్లో షార్ట్ సర్క్యూట్!
సాక్షి, నల్గొండ: నార్కట్‌పల్లిలోని విద్యుత్ సబ్ స్టేషన్లో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. భారీగా అగ్ని కీలలు ఎగిసి పడుతున్నాయి. పోలీసు, ఎలక్ట్రిసిటీ, అగ్నిమాపక దళ సిబ్బంది వెనువెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రానప్పటికీ.. అధిక ఉష్ణోగ్రతకు తోడు వర్షం పడటంతో 220/132 కేవీ సబ్ స్టేషన్లో షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీ ట్రాన్స్ ఫార్మర్లు పేలి పోవడంతో ఆ ప్రాంతమంతా గట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
సబ్ స్టేషన్లో అగ్నిప్రమాదం..షార్ట్ సర్క్యూట్!
-
అక్కడ మోదీ పాట, ఇక్కడ ఓవైసీ పాట
సాక్షి, నల్గొండ: రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో మోదీ పాట.. రాష్ట్రంలో ఓవైసీ పాట పాడుతూ ద్వంద వైఖరిని అవలంభిస్తున్నారని మండిపడ్డారు. దీన్ని మైనారిటీ ముస్లింలు గ్రహించాలని కోరారు. నార్కట్‌పల్లిలోని వివేర హోటల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ ఎన్నికల నుంచే కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర మొదలవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయలేమని మంత్రి కేటీఆరే స్వయంగా ఒప్పుకున్నారని పేర్కొన్నారు. వచ్చే నాలుగు సంవత్సరాల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: ఎయిమ్స్‌కు నిధులివ్వండి -
వీఆర్ఓ ఆత్మహత్య
నార్కట్‌పల్లి: పని ఒత్తిడి భరించలేక ఓ వీఆర్ఓ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం నెమ్మాని గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పంగ కృష్ణయ్య (46) కట్టంగూర్ మండలం పరడ గ్రామంలో వీఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. పాసు పుస్తకాలు అందడం లేదని, రైతుబంధు పథకానికి దూరమవుతున్నామని పలువురు రైతులు ఇటీవల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్.. రైతుల సమస్యలను పరిష్కరించాలని ఇన్చార్జి తహసీల్దార్ మహ్మద్ అలీని ఆదేశించారు. దీంతో ఈ నెల 7న కృష్ణయ్యతో పాటు మరో ఐదుగురికి చార్జీ మెమోలు జారీ చేశారు. పని ఒత్తిడితో పాటు మెమో రావడంతో మనస్తాపానికి గురైన కృష్ణయ్య.. తన పొలం వద్ద పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల రైతులు గమనించి వెంటనే నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. పని ఒత్తిడితోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని భార్య పుష్పలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. బదిలీ చేయాలని విజ్ఞప్తి గ్రామంలో పని ఒత్తిడి తీవ్రంగా ఉందని, తనను బదిలీ చేయాలని కృష్ణయ్య.. తహసీల్దార్‌ను కోరగా, ఈ నెల 20వ తేదీ తర్వాత చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈలోపే అతను ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
బస్సులో రూ.10 లక్షల నగదు చోరీ
నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లాలో బస్సులో ఓ ప్రయాణికుడి బ్యాగులోంచి రూ.10 లక్షల నగదు చోరీ అయింది. నార్కట్‌పల్లి శివారులో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన సంజీవరెడ్డి కారు కొనుగోలుకుగాను రూ.10.3 లక్షలను బ్యాగ్‌లో పెట్టుకుని విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాడు. సంజీవరెడ్డి ప్రయాణిస్తున్న బస్సును నార్కట్‌పల్లి శివారులోని పూజిత హోటల్ వద్ద ప్రయాణికులు టిఫిన్ చేసేందుకు డ్రైవర్ నిలిపాడు. సంజీవరెడ్డితోపాటు ఇరవై మంది ప్రయాణికులు బస్సు దిగారు. అనంతరం బస్సు ఎక్కిన సంజీవరెడ్డికి తన బ్యాగ్‌ను పరిశీలించగా రూ.30 వేలు మాత్రమే ఉన్నాయి. దీంతో బాధితుడు నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బస్సులో ఇరవై ఒక్క మంది ప్రయాణించగా నగదు చోరీకి గురైన అనంతరం 20 మంది ప్రయాణికులు మాత్రమే బస్సులో మిగిలారు. మిగిలిన ఆ ఒక్కరు ఎవరు అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘నూకలు చెల్లినయ్.. ఆ పార్టీని తరిమేయాలి’
సాక్షి, నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల మాదిరే తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతోందని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి జోస్యం చెప్పారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి బండ నరేందర్ భారీ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం శబరి గార్డెన్స్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. జిల్లా కాంగ్రెస్ నాయకుల చేతకానితనం వల్లనే ఫ్లోరైడ్ సమస్య, కరువు విస్తరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మరోసారి టీఆర్ఎస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినయ్, జిల్లా నుంచి కాంగ్రెస్‌ను తరిమేయాలి’ అని అన్నారు. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జడ్పీ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. -
రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
నార్కట్‌పల్లి : రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను అమలు చేయకుండా వారి జీవితాలతో సీఎం కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఎన్నికల్లో గెలిచిన అనంతరం విడుతలుగా మాఫీ చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం 7.90కోట్లు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేస్తే రైతుల ఖాతాలలో జమచేయకుండా కృష్ణ పుష్కరాలకు నిధులను వాడుకోవడం సరైంది కాదన్నారు. అకాల వర్షాలతో మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.4లక్షలు కేటాయించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అక్టోబర్ 3న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అద్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాకి పాపయ్య, నియోజకవర్గ ఇన్చార్జి పాల్వాయి భాస్కర్‌రావు, లింగాల వీరయ్య తదితరులు ఉన్నారు. -
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
నార్కట్‌పల్లి (నల్లగొండ) : నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు.. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. తిరుమలగిరికి చెందిన సంతోష్ రైస్ మిల్లు యజమాని అక్రమంగా కొనుగోలు చేసిన 350 బస్తాల్లో ఉన్న 17.50 టన్నుల బియ్యాన్ని లారీలో కర్ణాటకకు తరలించేందుకు యత్నించారు. ఈ మేరకు ముందస్తు సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు.. సోమవారం మధ్యాహ్నం లారీని నార్కట్‌పల్లి సమీపంలో అడ్డుకుని తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అందులో ఉన్న రేషన్ బియ్యం బయటపడింది. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి, బియ్యాన్ని సమీపంలోని పౌర సరఫరాల శాఖ గోదాముకు తరలించారు. లారీని సీజ్ చేశారు. -
ఓసీటీఎల్ కార్మికుల ఆందోళన
నార్కెట్‌పల్లి : నల్లగొండ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నార్కెట్‌పల్లి ఓసీటీఎల్ పరిశ్రమలో కార్మికుల తొలగింపుపై వివాదం చెలరేగుతోంది. తమను విధుల్లోకి తీసుకొవాలని కోరుతూ.. పరిశ్రమ ఎదుట తొలగించిన కార్మికులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. తమను విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన యాజమాన్యం కేసులు ఉన్న వారిని తీసుకునేదిలేదని స్పష్టంచేసింది. ఈ నిర్ణయంతో ఆగ్రహించిన కార్మికులు పరిశ్రమలోకి చొచ్చుకుపోవడానికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
ఆటో - కారు ఢీ: ఆరుగురికి గాయాలు
నల్గొండ : నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి జాతీయరహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు గాయపడ్డారు. రహదారిపై వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులంతా పత్తి కూలీలని పోలీసులు తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
నార్కట్‌పల్లి : అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన నార్కట్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధి గోపులాయపల్లి శివారు గుట్టపై పొదలలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోపులాయపల్లి గ్రామానికి చెందిన గొర్లకాపరులు గురువారం సాయంత్రం గుట్ట కింద ద్విచక్ర వాహనం గమనించారు. తిరిగి శుక్రవారం ఉదయం గొర్రెలను మేపడానికి తోలుకెళ్తుండగా ఆ వాహనం అక్కడే దారిలో ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ మోతీరామ్, ఏఎస్ఐలు లింగారెడ్డి, గౌస్‌తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి గుట్టపై గాలింపు చర్యలు చేపట్టారు. గుట్టపై రాళ్ల మధ్యతో ఓ యువకుడి మృతదేహం కాలిపోయి ఉండడాన్ని గుర్తించారు. గుట్ట కింద ఉన్న వాహనంలో మృతుడి వివరాలు గుర్తించారు.మృతుడు మండలంలోని తొండలవాయి గ్రామ పంచాయతీ పరిధి వెంకటేశ్వరబాయి గ్రామానికి చెందిన వడ్డెపల్లి నరేష్ (25)గా గుర్తించారు. మృతుడి వివరాలను తల్లి మంగమ్మకు తెలియజేయగా తన కుమారుడేనని గుర్తించింది. తన కుమారుడు నల్లగొండలోని ఎస్పీటీ మార్కెట్లో పనిచేస్తున్నాడని,నార్కట్‌పల్లిలోని ఓపెన్ పరీక్షలకు హాజరయ్యేందుకు వెళ్లి రెండు రోజులుగా ఇంటికి రాలేదని వివరించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మోతీరామ్ తెలిపారు. -
ప్రేమ విఫలమై మెడికో బలవన్మరణం
నార్కట్‌పల్లి/వనస్థలిపురం: ప్రేమ విఫలమై వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్కట్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నివాసం ఉండే తాడిచెర్ల సత్యనారాయణ పౌల్ట్రీ వ్యాపారి. ఇతనికి కుమారుడు రఘురామ్ (26), ఇద్దరు కూతుళ్లు సంతానం. చిన్న తనం నుంచి రఘురామ్ ఆటపాటలతో పాటు చదువులో ముందుండేవాడు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన రఘురామ్ ప్రస్తుతం నార్కట్‌పల్లిలోని కామినేని వైద్య కళాశాలలో పీజీ చదువుతూ అక్కడే గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. రఘురామ్ అదే కళాశాలలో చదువుతున్న ఓ యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వారం రోజులుగా రఘురామ్ తీవ్రమనోవేదనకు గురవుతున్నాడు. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పి బాధపడ్డాడు. ఇదిలా ఉండగా.. శనివారం రాత్రి పొద్దుపోయే వరకు తండ్రి సత్యనారాయణ పలుమార్లు ఫోన్ చేసినా రఘురామ్ లిఫ్ట్ చేయలేదు. దీంతో కుమారుడికి నచ్చచెప్పేందుకు ఆయన తెల్లవారుజామునే నార్కట్‌పల్లికి వచ్చాడు. రఘురామ్ అద్దెకుంటున్న గదికి వెళ్లి తలుపుతట్టగా ఎంతకీ తెరవలేదు. దీంతో కిటికీలోంచి చూడగా మంచంపై కుమారుడు అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. వెంటనే సత్యనారాయణ విషయాన్ని పోలీసులకు తెలపడంతో ఎస్ఐ మోతీరామ్ ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో తలుపులు తెరవగా అప్పటికే రఘురామ్ మృతి చెంది ఉన్నాడు. ప్రేమ విఫలం కావడంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని రఘురామ్ తన ల్యాప్‌టాప్‌లో సూసైడ్‌నోట్ టైప్ చేసినట్టు తెలిసింది. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మత్తుమందు తాగి, ఆపై ఊపిరాడకుండా ముఖానికి కవర్ చుట్టుకోవడంతో రఘురామ్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. సాయిరఘురాం మృతితో వనస్థలిపురం కాంప్లెక్స్ సమీపంలోని ఆయన నివాసం వద్ద తీవ్రవిషాద ఛాయలు అలుముకున్నాయి. -
నార్కట్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం
-
జ్యోతి రూపంలో అయ్యప్ప దర్శనం?
-
ఆగిఉన్న లారీని ఢీకొన్న బస్సు: ఒకరి మృతి
నల్గొండ: జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం ఏపీలింగోటం వద్ద తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 14మందికి గాయాలయ్యాయి. ఆగిఉన్న లారీని సూపర్ లగ్జరీ బస్సు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఏలూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
గవర్నర్ జాయింట్ సెక్రటరీకి గాయాలు
నార్కెట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి సమీపంలో గవర్నర్ నరసింహన్ జాయింట్ సెక్రటరీ బసంత్ కుమార్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైయ్యింది. కుటుంబసభ్యులతో విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు టైర్ పగిలి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో బసంత్ కుమార్‌కు గాయాలయ్యాయి. ఆయన్ను వెంటనేసమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
నార్కట్‌పల్లిలో మంటగలిసిన మానవత్వం
నల్గొండ: మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న యువకుడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులే ముందుకు రాకపోవడం చర్చనీయాంశమైంది. చిన్నతుమ్మలగూడెంకు చెందిన వంశీ చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ లో ఉంటున్న అతడు జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసకున్నాడు. అంతిమ సంస్కారాల కోసం వంశీ మృతదేహాన్ని నార్కట్‌పల్లి తీసుకొచ్చారు. బంధువులెవరూ పట్టించుకోకపోవడంతో సాయంత్రం వరకు అంత్యక్రియలు జరగలేదు. వంశీ బంధువుల తీరుపై గ్రామస్తులు మండిపడ్డారు. అంతిమసంస్కారాలు జరపాలంటూ మృతదేహంతో ఆందోళన చేపట్టారు. -
డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల నిరసన
నార్కట్‌పల్లి : డిపో మేనేజర్ వెంకట్‌రెడ్డి ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం నార్కట్‌పల్లి డిపోలో పని చేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు విధులు బహిష్కరించారు. డిపోఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి నరేందర్ మాట్లాడుతూ డిపోలో పనిచేస్తున్న కండక్టర్, డ్రైవర్ల సీనియారిటీ ప్రకారం డ్యూటీలు వేయకుండా డిపో అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో కార్మికులు వీక్లీఆఫ్‌లు కూడా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అనేక పర్యాయాలు అధికారులకు తెలిపినా పట్టించుకోలేదన్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎంఈ జాన్‌రెడ్డి, డిప్యూటీ సీటీఎం అనిల్‌కుమార్‌లు డిపోవద్దకు చేరుకొని యూనియన్ నాయకులతో చర్చించారు. కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఐతరాజు వెంకటయ్య, యాసిన్అలి, ప్రభాకర్, వెకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాలు షురూ
మంగళవాయిద్యాలు... అర్చకుల వేదమంత్రోచ్ఛరణలతో నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఆరురోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, ఏకాదశ రుద్రాభిషేకం, నీరాజన మంత్ర పుష్పములు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొన్న నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి యజ్ఞశాలను ప్రారంభించారు. - న్యూస్‌లైన్, నార్కట్‌పల్లి నార్కట్‌పల్లి, న్యూస్‌లైన్ : మంగళవాయిద్యాలు.. అర్చకుల మంత్రోచ్ఛరణల నడు మ నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, ఏకాదశ రుద్రాభిషేకం, నీరాజన మంత్ర పుష్పాలు తదితర ప్రత్యేక పూజలను వేద పండితుడు అల్లవరపు సుబ్రహ్మణ్య శాస్త్రి, దేవాలయ ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకట్‌నారాయణగౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రేగట్టే నర్సింహారెడ్డిలకు దేవస్థానం ఈఓ విజయరాజు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ముఖ్య అతిథులను దేవాలయ కార్యనిర్వహణ అధికారి ఘనంగా సన్మానించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి : కోమటిరెడ్డి చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. కల్యాణ మండపాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కోటి రూపాయలతో కల్యాణ మండపం పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. దేవాలయానికి నిద్రచేసేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఘాట్‌రోడ్ మలుపులో 30 గదుల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనంతరం వినాయక విగ్రహాన్ని, రాజగోపుర శిఖరాన్ని ప్రతిష్ఠించారు. అలాగే యజ్ఞశాలను ప్రారంభించారు. కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి విజయరాజు, సర్పంచ్‌లు పుల్లెంల అచ్చాలు, కొండూరు శంకర్ దేవస్థానం మాజీ చైర్మన్ మేకల రాజిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నేతగాని కృష్ణ, మండల ప్రత్యేక అధికారి మదనాచారి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో గుర్రం సురేశ్, బెరైడ్డి కరుణాకర్‌రెడ్డి, నర్సింహాచారి, వడ్డె భూపాల్‌రెడ్డి, శిగ విష్ణు, బత్తుల ఊషయ్య, పల్లె వెంకట్‌రెడ్డి, పసునూరి శ్రీను, దోసపాటి విష్ణుమూర్తి, ప్రభాకర్‌రెడ్డి, వెంకటయ్య, దొడ్డి నర్సింహ, గాదరి రమేష్, నర్సింహ, సత్తయ్య, సైదులు, సుజాత, జహంగీర్, వీఆర్వో యాదయ్య పాల్గొన్నారు. ప్రొటోకాల్ పాటించని ఆలయ ఈఓ చెర్వుగట్టులోని రామలింగేశ్వరస్వామి ఆలయ ఈఓ విజయరాజు ప్రొటోకాల్ పాటించకుండా వ్యవహరిస్తున్నారని గ్రామ సర్పంచ్ మల్గు రమణబాలకృష్ణ ఆరోపించారు. గురువారం చెర్వుగట్టులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికల్లో సర్పంచ్ పేరు పెట్టకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మహిళా సర్పంచ్ అయినందునే తనను అవమాన పర్చినట్లు పేర్కొన్నారు. గతంలో జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఈఓ పట్టించుకోవడంలేదన్నారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డిగూడెం పీఏసీఎస్ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, ఉపసర్పంచ్ నారాయణరెడ్డి, వేణు, అది చంద్రయ్య, చొల్లేటి కోటి, మేడి శంకర్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. స్వామివారి పాదాల వద్ద ఆలయ నిర్మాణం రామలింగేశ్వర స్వామి పాదాల వద్ద త్వరలో కోటి రూపాయలతో దేవాలయాన్ని నిర్మించి అభివృద్ధి చేయనున్నట్లు మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. గురువారం మండల పరిధిలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో శ్రీపార్వతీజడల రామలింగేశ్వర స్వామి పాదాల వద్ద ఆయన ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. దేవాలయానికి వచ్చే భక్తులు స్వామి వారి పాదాలను దర్శించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. దేవాలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండూరు శంకర్, ఉప సర్పంచ్ వడ్డె అండమ్మ, భూపాల్‌రెడ్డి, మారెడ్డి యాదగిరిరెడ్డి, సూర ముత్యాలు, రాములు, మరగోని సైదులు, ఎల్లెందులు లింగస్వామి, పాపులు, భిక్షం, మేడి శంకర్, శ్రీను, శంకరయ్య పాల్గొన్నారు. -
పాదచారులపైకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు మృతి
నల్గొండ: నార్కెట్‌పల్లి మండలం ఏపీలింగోటం వద్ద గురువారం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడిక్కడే మృతిచెందారు. రోడ్డు ప్రక్కన నడుస్తున్న పాదచారులపైకి ఓ కారు దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. కారును అతివేగంగా నడపడం వల్లే అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లినట్టు తెలిసింది. ఈ ఘటనలో మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమించడంతో స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఎవరిదీ... పాపం
సాక్షిప్రతినిధి, నల్లగొండజిల్లా అంతా స్వాతంత్య్రవేడుకల్లో మునిగి ఉంది... ఎవరిహడావిడిలో వారున్నారు. ఇంతలోనే ఓ వార్త జిల్లాలో దావానంలావ్యాపించింది. సమాచారం తెలుసుకుని టీడీపీ నాయకులంతా నార్కట్‌పల్లికి పరుగులు దీశారు... ఈ లోగాటీవీల్లో స్క్రోలింగులు ప్రత్యక్షమయ్యాయి.. గుంటూరు జిల్లాకుచెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీఎంపీ లాల్‌జాన్ బాషా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారన్నదేఆ వార్త. నార్కట్‌పల్లిలో జాతీయజెండా ఆవిష్కరణ వేడుకల్లో ఉన్నటీడీపీ జిల్లా నాయకుడు రేగట్టే మల్లికార్జున్‌రెడ్డికి రోడ్డు ప్రమాదం సమాచారం అందగానే, ఆయన హైదరాబాద్ ట్రస్ట్ భవన్‌కు సమాచారంఅందించారు. ‘‘ఫేక్ కాల్’ అంటూకార్యాలయ సిబ్బంది కొట్టి పారేశారు. కొద్దిసేపటికే మళ్లీ చంద్రబాబునాయుడు రేగట్టెను వాకబుచేశారు. అప్పటికే నార్కట్‌పల్లి కామినేని జంక్షన్ వద్దకు చేరుకున్నరేగట్టె.. రోడ్డు ప్రమాదంలో చనిపోయింది లాల్‌జాన్ బాషానేననిధృవీకరించుకుని హైదరాబాద్‌కు తెలియజేశారు. ఈలోగా నల్లగొండ నుంచీటీడీపీ నాయకులు నార్కట్‌పల్లికి చేరుకుని లాల్‌జాన్ బాషా మృతదేహాన్ని అంబులెన్సులోజిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. జోరున కురుస్తున్న వానలో.. అమితమైన వేగంతో హైదరాబాద్ నుంచి విజయవాడవైపు వెళుతున్న ఆ ఇన్నోవా వాహనం డివైడర్‌ను ఢీకొని మూడు పల్టీలు కొట్టడం చూసిన..దగ్గరలోనే ఆస్పత్రి వద్ద టీ తాగుతున్న స్థానికులు ఉరుకుల పరుగుల మీద ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వెంటనే స్థానిక మీడియా,పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదం నుంచి బయట పడిన డ్రైవర్ ముజఫర్ చనిపోయింది టీడీపీ నేత లాల్‌జాన్‌బాషా అంటేముందు ఎవరూ నమ్మలేదు. చివరకు లాల్‌జాన్‌బాషా విజిటింగ్ పోలీసులకు ఇవ్వడంతో కొంతనమ్మకం కుదిరినా, మృత దేహం బొక్కబోర్లాఉండడం, స్థానికంగా గుర్తుపట్టే వారులేకపోవడంతో పోలీసులు ఓ నిర్ణయానికి రావడానికివెనకా ముందాడారు. ఈలోగా అక్కడి చేరుకున్న టీడీపీ నాయకుడు రేగట్టె మల్లికార్జున్రెడ్డిపోలీసుల సమక్షంలో మృతదేహాన్ని వెల్లకిలాతిప్పి ప్రమాదంలో చనిపోయింది లాల్‌జాన్‌బాషా అని గుర్తించారు. నిత్యం ప్రమాదాలతోవందలాది ప్రాణాలను బలిగోరిన జాతీయరహదారిపై ప్రయాణం ఇప్పటికీ నరకానికిదారే అన్న అభిప్రాయాన్ని గురువారం నాటిప్రమాదం చెప్పకనే చెప్పింది. నాలుగు లేన్లరహదారిగా మార్చినా అధికారుల తప్పిదాలు,సాంకేతిక లోపాలు, అయిన వారికోసం రోడ్డుఅలైన్మెంటును ఇష్టం వచ్చినట్లు మార్చిన కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా వదిలేసిన రోడ్డు నిర్మాణ సంస్థజీఎంఆర్ నిర్లక్ష్యానికి కామినేని జంక్షన్లోఇలాంటి ప్రమాదాలు ఇప్పటికే పదులసంఖ్యలో జరిగాయి. అందుబాటులోకి వచ్చినఎక్స్ప్రెస్ హైవేపై వాయువేగంతో దూసుకువెళుతున్న వాహనాల్లో ప్రయాణం గాలిలోదీపంలా మారుతున్నాయి. హైదరాబాద్ నుంచిబయలు దేరే సమయంలోనే కొంత వేగంగావెళ్లాలని లాల్‌జాన్ బాషా చెప్పారని డ్రైవర్ముజఫర్ చెబుతున్నాడు. అయినా, జోరుగాకురుస్తున్న వానలో, కనీసం జాగ్రత్తలు పాటించకుండా అపరిమిత వేగంతో వాహనం నడిపినడ్రైవర్ తన యజమాని దుర్మరణానికి ప్రత్యక్షంగా కారణమయ్యాడ న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ సీనియర్ నేత దుర్మరణం వార్తతెలుసుకుని వివిధ పార్టీలకు చెందిన నాయకులు జిల్లా ఆస్పత్రికి చేరుకోవడంతో మార్చురీవద్ద ఆవరణ కిక్కిరిసి పోయింది. రాష్ట్ర టీడీపీనేతలు జిల్లా కేంద్రానికి తరలి వచ్చారు. హైదరాబాద్ నుంచి చంద్రబాబునాయుడు హుటాహుటిన ఇక్కడకు చేరుకున్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడారు. లాల్‌జాన్‌బాషా మతదేహాన్ని హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికితరలించేలా కుటుంబ సభ్యులను ఒప్పించారు.మొత్తంగా గురువారం నాటి రోడ్డు ప్రమాదంజాతీయ రహదారిపై వాయువేగంతో దూసుకుపోయే వాహన చోదకులకు ఓ హెచ్చిరకలాంటిదన్న అభిప్రాయం వ్యక్తమైంది.