నల్గొండ : నల్గొండ జిల్లా నార్కట్పల్లి జాతీయరహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు గాయపడ్డారు. రహదారిపై వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులంతా పత్తి కూలీలని పోలీసులు తెలిపారు.