ఒంగోలు : ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ప్లాజా వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో - ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.