ఒకేరోజు 6,400 కోళ్లు మృతి | 6,400 Chickens Died In Single Day Poultry Farm At Narketpally | Sakshi
Sakshi News home page

ఒకేరోజు 6,400 కోళ్లు మృతి

Published Thu, Jan 21 2021 2:38 AM | Last Updated on Thu, Jan 21 2021 2:42 AM

6,400 Chickens Died In Single Day Poultry Farm At Narketpally - Sakshi

సాక్షి, నార్కట్‌పల్లి: కోళ్ల ఫామ్‌లో ఒకేరోజు 6,400 కోళ్లు మృతిచెందాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఏనుగులదోరి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ప్రీమియం కంపెనీ సహకారంతో తాను నిర్వహిస్తున్న కోళ్లఫామ్‌లో ఉన్నట్టుండి 6,400 కోళ్లు ఒకేసారి చనిపోయాయని బాధితుడు పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. వెంటనే కంపెనీ యజమానులకు తెలపగా, సిబ్బంది వచ్చి పరిశీలించి.. ఫామ్‌కు సంబంధించిన నీటిట్యాంకులో విషపూరిత రసాయనాలు కలిపిన ఆనవాళ్లు దొరికాయని, ఆ నీటిని తాగి కోళ్లు చనిపోయాయని నిర్ధారించారని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement