సాక్షిప్రతినిధి, నల్లగొండజిల్లా అంతా స్వాతంత్య్రవేడుకల్లో మునిగి ఉంది... ఎవరిహడావిడిలో వారున్నారు. ఇంతలోనే ఓ వార్త జిల్లాలో దావానంలావ్యాపించింది. సమాచారం తెలుసుకుని టీడీపీ నాయకులంతా నార్కట్‌పల్లికి పరుగులు దీశారు... ఈ లోగాటీవీల్లో స్క్రోలింగులు ప్రత్యక్షమయ్యాయి.. గుంటూరు జిల్లాకుచెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీఎంపీ లాల్‌జాన్ బాషా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారన్నదేఆ వార్త. నార్కట్‌పల్లిలో జాతీయజెండా ఆవిష్కరణ వేడుకల్లో ఉన్నటీడీపీ జిల్లా నాయకుడు రేగట్టే మల్లికార్జున్‌రెడ్డికి రోడ్డు ప్రమాదం సమాచారం అందగానే, ఆయన హైదరాబాద్ ట్రస్ట్ భవన్‌కు సమాచారంఅందించారు. ‘‘ఫేక్ కాల్’ అంటూకార్యాలయ సిబ్బంది కొట్టి పారేశారు. కొద్దిసేపటికే మళ్లీ చంద్రబాబునాయుడు రేగట్టెను వాకబుచేశారు. అప్పటికే నార్కట్‌పల్లి కామినేని జంక్షన్ వద్దకు చేరుకున్నరేగట్టె.. రోడ్డు ప్రమాదంలో చనిపోయింది లాల్‌జాన్ బాషానేననిధృవీకరించుకుని హైదరాబాద్‌కు తెలియజేశారు.
ఈలోగా నల్లగొండ నుంచీటీడీపీ నాయకులు నార్కట్‌పల్లికి చేరుకుని లాల్‌జాన్ బాషా మృతదేహాన్ని అంబులెన్సులోజిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. జోరున కురుస్తున్న వానలో.. అమితమైన వేగంతో హైదరాబాద్ నుంచి విజయవాడవైపు వెళుతున్న ఆ ఇన్నోవా వాహనం డివైడర్‌ను ఢీకొని మూడు పల్టీలు కొట్టడం చూసిన..దగ్గరలోనే ఆస్పత్రి వద్ద టీ తాగుతున్న స్థానికులు ఉరుకుల పరుగుల మీద ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వెంటనే స్థానిక మీడియా,పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదం నుంచి బయట పడిన డ్రైవర్ ముజఫర్ చనిపోయింది టీడీపీ నేత లాల్‌జాన్‌బాషా అంటేముందు ఎవరూ నమ్మలేదు. చివరకు లాల్‌జాన్‌బాషా విజిటింగ్ పోలీసులకు ఇవ్వడంతో కొంతనమ్మకం కుదిరినా, మృత దేహం బొక్కబోర్లాఉండడం, స్థానికంగా గుర్తుపట్టే వారులేకపోవడంతో పోలీసులు ఓ నిర్ణయానికి రావడానికివెనకా ముందాడారు. ఈలోగా అక్కడి చేరుకున్న టీడీపీ నాయకుడు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డిపోలీసుల సమక్షంలో మృతదేహాన్ని వెల్లకిలాతిప్పి ప్రమాదంలో చనిపోయింది లాల్‌జాన్‌బాషా అని గుర్తించారు. నిత్యం ప్రమాదాలతోవందలాది ప్రాణాలను బలిగోరిన జాతీయరహదారిపై ప్రయాణం ఇప్పటికీ నరకానికిదారే అన్న అభిప్రాయాన్ని గురువారం నాటిప్రమాదం చెప్పకనే చెప్పింది. నాలుగు లేన్లరహదారిగా మార్చినా అధికారుల తప్పిదాలు,సాంకేతిక లోపాలు, అయిన వారికోసం రోడ్డుఅలైన్‌మెంటును ఇష్టం వచ్చినట్లు మార్చిన కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా వదిలేసిన రోడ్డు నిర్మాణ సంస్థజీఎంఆర్ నిర్లక్ష్యానికి కామినేని జంక్షన్‌లోఇలాంటి ప్రమాదాలు ఇప్పటికే పదులసంఖ్యలో జరిగాయి. అందుబాటులోకి వచ్చినఎక్స్‌ప్రెస్ హైవేపై వాయువేగంతో దూసుకువెళుతున్న వాహనాల్లో ప్రయాణం గాలిలోదీపంలా మారుతున్నాయి. హైదరాబాద్ నుంచిబయలు దేరే సమయంలోనే కొంత వేగంగావెళ్లాలని లాల్‌జాన్ బాషా చెప్పారని డ్రైవర్‌ముజఫర్ చెబుతున్నాడు. అయినా, జోరుగాకురుస్తున్న వానలో, కనీసం జాగ్రత్తలు పాటించకుండా అపరిమిత వేగంతో వాహనం నడిపినడ్రైవర్ తన యజమాని దుర్మరణానికి ప్రత్యక్షంగా కారణమయ్యాడ న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టీడీపీ సీనియర్ నేత దుర్మరణం వార్తతెలుసుకుని వివిధ పార్టీలకు చెందిన నాయకులు జిల్లా ఆస్పత్రికి చేరుకోవడంతో మార్చురీవద్ద ఆవరణ కిక్కిరిసి పోయింది. రాష్ట్ర టీడీపీనేతలు జిల్లా కేంద్రానికి తరలి వచ్చారు. హైదరాబాద్ నుంచి చంద్రబాబునాయుడు హుటాహుటిన ఇక్కడకు చేరుకున్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడారు. లాల్‌జాన్‌బాషా మతదేహాన్ని హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికితరలించేలా కుటుంబ సభ్యులను ఒప్పించారు.మొత్తంగా గురువారం నాటి రోడ్డు ప్రమాదంజాతీయ రహదారిపై వాయువేగంతో దూసుకుపోయే వాహన చోదకులకు ఓ హెచ్చిరకలాంటిదన్న అభిప్రాయం వ్యక్తమైంది.
ఎవరిదీ... పాపం
Published Fri, Aug 16 2013 3:06 AM | Last Updated on Fri, Aug 10 2018 6:49 PM
Advertisement
Advertisement