మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో చోటుచేసుకుంది.
నల్గొండ: మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న యువకుడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులే ముందుకు రాకపోవడం చర్చనీయాంశమైంది.
చిన్నతుమ్మలగూడెంకు చెందిన వంశీ చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ లో ఉంటున్న అతడు జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసకున్నాడు. అంతిమ సంస్కారాల కోసం వంశీ మృతదేహాన్ని నార్కట్‌పల్లి తీసుకొచ్చారు. బంధువులెవరూ పట్టించుకోకపోవడంతో సాయంత్రం వరకు అంత్యక్రియలు జరగలేదు. వంశీ బంధువుల తీరుపై గ్రామస్తులు మండిపడ్డారు. అంతిమసంస్కారాలు జరపాలంటూ మృతదేహంతో ఆందోళన చేపట్టారు.