
సమయానికి అంబులెన్స్ ఘటన స్థలానికి రాకపోవడంతో షర్మిల తన కాన్వాయ్‌లోని అంబులెన్స్‌లో క్షతగాత్రులని ఆస్పత్రికి తరలించారు.
నల్లగొండ: వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మానవత్వం చాటుకున్నారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం క్రిష్టారాయపల్లిలో తన క్యాంపు సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకి గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన షర్మిల స్వయంగా 108 వాహనానికి ఫోన్ చేశారు.
చదవండి:టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిసిన చేవేళ్ల ఎమ్మెల్యే
అయితే సమయానికి అంబులెన్స్ ఘటన స్థలానికి రాకపోవడంతో షర్మిల తన కాన్వాయ్‌లోని అంబులెన్స్‌లో క్షతగాత్రులని ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్ ఆలస్యంపై షర్మిల స్పందిస్తూ.. 108 సేవలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ పరిస్థితి చూస్తే అర్థం అవుతుందని విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే 108 వాహన సేవలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.