మంగళవాయిద్యాలు... అర్చకుల వేదమంత్రోచ్ఛరణలతో నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఆరురోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, ఏకాదశ రుద్రాభిషేకం, నీరాజన మంత్ర పుష్పములు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొన్న నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి యజ్ఞశాలను ప్రారంభించారు.
- న్యూస్‌లైన్, నార్కట్‌పల్లి
నార్కట్‌పల్లి, న్యూస్‌లైన్ : మంగళవాయిద్యాలు.. అర్చకుల మంత్రోచ్ఛరణల నడు మ నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, ఏకాదశ రుద్రాభిషేకం, నీరాజన మంత్ర పుష్పాలు తదితర ప్రత్యేక పూజలను వేద పండితుడు అల్లవరపు సుబ్రహ్మణ్య శాస్త్రి, దేవాలయ ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకట్‌నారాయణగౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రేగట్టే నర్సింహారెడ్డిలకు దేవస్థానం ఈఓ విజయరాజు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ముఖ్య అతిథులను దేవాలయ కార్యనిర్వహణ అధికారి ఘనంగా సన్మానించారు.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి : కోమటిరెడ్డి
చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. కల్యాణ మండపాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కోటి రూపాయలతో కల్యాణ మండపం పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. దేవాలయానికి నిద్రచేసేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఘాట్‌రోడ్ మలుపులో 30 గదుల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనంతరం వినాయక విగ్రహాన్ని, రాజగోపుర శిఖరాన్ని ప్రతిష్ఠించారు. అలాగే యజ్ఞశాలను ప్రారంభించారు. కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి విజయరాజు, సర్పంచ్‌లు పుల్లెంల అచ్చాలు, కొండూరు శంకర్ దేవస్థానం మాజీ చైర్మన్ మేకల రాజిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నేతగాని కృష్ణ, మండల ప్రత్యేక అధికారి మదనాచారి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో గుర్రం సురేశ్, బెరైడ్డి కరుణాకర్‌రెడ్డి, నర్సింహాచారి, వడ్డె భూపాల్‌రెడ్డి, శిగ విష్ణు, బత్తుల ఊషయ్య, పల్లె వెంకట్‌రెడ్డి, పసునూరి శ్రీను, దోసపాటి విష్ణుమూర్తి, ప్రభాకర్‌రెడ్డి, వెంకటయ్య, దొడ్డి నర్సింహ, గాదరి రమేష్, నర్సింహ, సత్తయ్య, సైదులు, సుజాత, జహంగీర్, వీఆర్వో యాదయ్య పాల్గొన్నారు.
ప్రొటోకాల్ పాటించని ఆలయ ఈఓ
చెర్వుగట్టులోని రామలింగేశ్వరస్వామి ఆలయ ఈఓ విజయరాజు ప్రొటోకాల్ పాటించకుండా వ్యవహరిస్తున్నారని గ్రామ సర్పంచ్ మల్గు రమణబాలకృష్ణ ఆరోపించారు. గురువారం చెర్వుగట్టులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికల్లో సర్పంచ్ పేరు పెట్టకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మహిళా సర్పంచ్ అయినందునే తనను అవమాన పర్చినట్లు పేర్కొన్నారు. గతంలో జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఈఓ పట్టించుకోవడంలేదన్నారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డిగూడెం పీఏసీఎస్ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, ఉపసర్పంచ్ నారాయణరెడ్డి, వేణు, అది చంద్రయ్య, చొల్లేటి కోటి, మేడి శంకర్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
స్వామివారి పాదాల వద్ద ఆలయ నిర్మాణం
రామలింగేశ్వర స్వామి పాదాల వద్ద త్వరలో కోటి రూపాయలతో దేవాలయాన్ని నిర్మించి అభివృద్ధి చేయనున్నట్లు మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. గురువారం మండల పరిధిలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో శ్రీపార్వతీజడల రామలింగేశ్వర స్వామి పాదాల వద్ద ఆయన ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు.
దేవాలయానికి వచ్చే భక్తులు స్వామి వారి పాదాలను దర్శించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. దేవాలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండూరు శంకర్, ఉప సర్పంచ్ వడ్డె అండమ్మ, భూపాల్‌రెడ్డి, మారెడ్డి యాదగిరిరెడ్డి, సూర ముత్యాలు, రాములు, మరగోని సైదులు, ఎల్లెందులు లింగస్వామి, పాపులు, భిక్షం, మేడి శంకర్, శ్రీను, శంకరయ్య పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలు షురూ
Published Fri, Feb 7 2014 4:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM
Advertisement
Advertisement