అణచివేతతో భూములు లాక్కుంటారా? | Lakshman comments on government | Sakshi
Sakshi News home page

అణచివేతతో భూములు లాక్కుంటారా?

Published Tue, Jul 26 2016 2:58 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

అణచివేతతో భూములు లాక్కుంటారా? - Sakshi

అణచివేతతో భూములు లాక్కుంటారా?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్

 సాక్షి, హైదరాబాద్ : రైతులపై పోలీసులతో లాఠీచార్జి చేయించి, ప్రశ్నించేవారిని అణచివేసి భూములను గుంజుకుంటామంటే సహించేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హెచ్చరించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మల్లన్నసాగర్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను బయటపెట్టకుండా, దాచిపెట్టడంలో మర్మం ఏమిటని ప్రశ్నించారు.

రైతులు, నిర్వాసిత గ్రామస్తులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులతో దాడులు చేయించడం అమానుషమన్నారు. రైతులను పరామర్శించడానికి వెళ్లిన బీజేపీ, ఇతర పార్టీల నేతలను అరెస్టు చేయడం అక్రమమన్నారు. ప్రభుత్వ దమనకాండకు నిరసనగా అన్ని మండల కేంద్రాల్లో మంగళవారం నిరసనలు చేపడుతున్నట్టు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement