సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని హుస్నాబాద్‌లో ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. భూ నిర్వాసితులు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో భూ నిర్వాసితులు, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కాగా, సోమవారం తెల్లవారుజామున 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
దీంతో నిర్వాసితులు ఆందోళనలకు దిగారు. మంగళవారం ప్రజా ప్రతినిధులు ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి నిర్వాసితులు ప్రయత్నించారు. ఈ క్రమంలో క్యాంపు ఆఫీసు నుండి బయటకు వచ్చిన టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో వాగ్వాదం జరిగింది. తోపులాట చోటుచేసుకోవడంతో ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి కింద పడిపోయారు. అనంతరం నిర్వాసితులను పోలీసులు అడ్డుకుని అనంతరం లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో పలువురు నిర్వాసితులు, హుస్నాబాద్ ఎసీపీ సతీష్, ఎస్‌ఐ గాయపడ్డారు. దీంతో ఐదుగురు భూ నిర్వాసిత యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment