ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు.. సిద్దిపేటలో కలకలం | IT Officials Raids In RMP Doctors House In Husnabad Series 66 Lakhs | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు

Published Sun, Mar 7 2021 1:27 PM | Last Updated on Sun, Mar 7 2021 3:41 PM

IT Officials Raids In RMP Doctors House In Husnabad Series 66 Lakhs - Sakshi

హుస్నాబాద్‌లో టాస్క్‌ ఫోర్స్, సివిల్‌ పోలీసుల సోదాలు

హుస్నాబాద్‌: టాస్క్‌ఫోర్స్‌ సోదాల్లో ఓ ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66.11 లక్షలు గుర్తించారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని ఐటీ అధికారులకు అందిన సమాచారం మేరకు శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఆర్‌ఎంపీ కొడం ఆంజనేయులు ఇంట్లో ఏసీపీ మహేందర్‌ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్, సివిల్‌ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. పట్టణంలోని మెయిన్‌రోడ్‌లో క్లినిక్‌ నడిపిస్తూ, వినాయకనగర్‌లో ఆయన నివసిస్తున్నారు.

ఈ సోదాల్లో రూ.66,11,100 స్వాదీనం చేసుకొని సీజ్‌ చేసినట్లు మహేందర్‌ తెలిపారు. సీజ్‌ చేసిన డబ్బులను ఐటీ అధికారులకు అప్పగించనున్నట్లు చెప్పారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో పూర్తి స్థాయిలో అధికారులు విచారించనున్నట్లు తెలిపారు. కాగా, ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చదవండి: 
సంతోష్‌ను చంపింది సోదరుడే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement