ప్రొద్దుటూరు : సినీనటి తమన్నా ప్రొద్దుటూరులో హల్‌చల్ చేశారు. స్థానిక మైదుకూరు రోడ్డులో ఏర్పాటు చేసిన బీన్యూ మొబైల్స్ 53వ షోరూంను శనివారం ఉదయం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు వందల సంఖ్యలో అభిమానులు వచ్చారు.అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నుంచి ఆమె అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తాను నటిస్తున్న సినిమాల గురించి చెప్పడంతో అభిమానులు ఈలలు, కేకలు వేశారు. ఆమె స్వయంగా సెల్ఫీ స్టిక్‌తో ఫొటోలు తీయడం, ఆటో గ్రాఫ్‌లు ఇవ్వడం అభిమానుల్లో ఆనందం నింపాయి.
సాంకేతిక సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి
సాంకేతిక సేవలు కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేయాల్సిన అవసరం ఉందని తమన్నా పేర్కొన్నారు. బీ న్యూ మొబైల్స్ షోరూం ప్రారంభం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. ఇక్కడ తనకు ఇంత మంది అభిమానులు ఉండటం గర్వంగా ఉందన్నారు. నటిగా రాణించడం తన అదృష్టమని, ఆ కారణంగానే తనకు ఇంత మంది అభిమానులు ఏర్పడ్డారన్నారు.
బీన్యూ మొబైల్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ వైడీ బాలాజీ చౌదరి మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలు అంటే తనకెంతో ఇష్టమని, ఆ కారణంగానే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా తమ షోరూంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆదోని, కదిరి ప్రాంతాల్లో సైతం షోరూంలు ఏర్పాటు చేశామని, లక్ష జనాభా ప్రతిపదికన షోరూంలు ప్రారంభిస్తున్నామన్నారు. ఏడాది ఆఖరు నాటికి నవ్యాంధ్రలో వంద, తెలంగాణాలో వంద షోరూంలు ఏర్పాటు చేసి రూ.500 కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో రాయల్ రెసిడెన్సీ ఓనర్ రాఘవరెడ్డి, బీ న్యూ మొబైల్స్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment