హన్మకొండలో కాజల్‌ సందడి..   | Kajal Agarwal In Warangal | Sakshi
Sakshi News home page

హన్మకొండలో కాజల్‌ సందడి..  

Published Fri, Jul 20 2018 2:13 PM | Last Updated on Tue, Oct 30 2018 6:01 PM

Kajal Agarwal In Warangal - Sakshi

అభిమానులకు నమస్కరిస్తున్న కాజల్‌ 

హన్మకొండ : సినీ నటి కాజల్‌ అగర్వాల్‌ రాకతో గురువారం హన్మకొండలోని నయీంనగర్‌ సందడిగా మారింది. అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ముందుగా ఆమె పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ఎదుట నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ మొబైల్స్‌ మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ స్టోర్స్‌ షోరూంను ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం మొదటి మొబైల్‌ను కొనుగోలు చేశారు.

ఆ తర్వా త షోరూం ఎదుట ఏర్పాటుచేసిన వేదికపైకి చేరుకుని ప్రజలకు అభివాదం చేయగా.. అభిమానుల ఈలలు, కేరింతలతో ఆ ప్రాంతం మార్మోగింది. అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా హన్మకొండ పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సంపత్‌రావు ఆధ్వర్యం లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా కాజల్‌ మాట్లాడుతూ మొబైల్‌ షోరూ ం ప్రారంభించడానికి హన్మకొండకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

హన్మకొండలో ఏర్పాటుచేసిన హ్యాపీ మోబైల్‌ స్టోర్‌ 27వ షోరూం అని.. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని హ్యాపీ స్టోర్స్‌ మెగా ఆఫర్స్‌ ప్రకటించిందన్నారు. ప్రతి కొనుగోలుపై కచ్చితమైన బహుమతి వస్తుందని.. ప్రజలు ఆదరించాలని కోరారు. హ్యాపీ మొబైల్స్‌ అధినేత కృష్ణ పవన్‌ మాట్లాడుతూ హన్మకొండ నయీంనగర్‌లో, వరంగల్‌లో ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచీ ఎదుట మొబైల్‌ స్టోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు.

తొలి ఏడాది 150 నుంచి 200 షోరూ ంలు ఏర్పాటుచేయాలనే యోచనలో ఉన్నట్లు వివరించారు. హ్యాపీ మోబైల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కోట సంతోష్‌ మాట్లాడుతూ  వినియోగదారులకు విస్తృత శ్రేణి అంతర్జాతీయ బ్రాండ్లతో కూడిన 200 ఎస్‌కేయూ డిస్‌ప్లేతో వినూత్న షాపింగ్‌ అనుభూతులు అందిస్తున్నామన్నారు. అత్యుత్తమ శ్రేణి మొబైల్స్, యాక్సెసరీస్‌ తమ వద్ద లభిస్తాయన్నారు. హాపీ స్టోర్స్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఆఫర్లు ప్రకటించామని వెల్లడించారు.

డ్యూయల్‌ కెమెరా ఫోన్‌ను రూ.399కే అందిస్తున్నామన్నారు. వీవో వై 69 ఫోన్‌ కొనుగోలుపై క్రోమ్టన్‌ ఎయిర్‌ కూలర్‌.. హానర్‌ 91 ఫోన్‌ కొనుగోలుపై వాషింగ్‌ మిషన్‌ను ఉచితంగా అందిస్తున్నామన్నారు. మైక్రోమాక్స్‌ పి701 కొనుగోలుపై హోమ్‌ థియేటర్‌ ఉచితంగా ఇస్తున్నట్లు వివరించారు. ఐ ఫోన్‌ ఎస్‌ఈ ఫోన్‌ పై 27 శాతం డిస్కౌంట్, నోకియా–5 పై 35 శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నామన్నారు. 4జీ స్మార్ట్‌ ఫోన్‌ ప్రారంభ ధర రూ.1999 నుంచి ప్రారంభమవుతుందని వివరించారు.

వరంగల్‌ అంటే ఇష్టం

హన్మకొండ: తనకు వరంగల్‌ అంటే ఇష్టమని.. ఇక్కడికి రావడం రెండో సారి అని సినీ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ అన్నారు. జిల్లాలోని వేయి స్తంభాల దేవాలయం, రామప్ప బాగా నచ్చిన ప్రదేశాలని.. వరంగల్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. హన్మకొండ కిషన్‌పురలో హ్యాపీ మొబైల్‌ స్టోర్‌ను ప్రారంభించిన అనంతరం హన్మకొండ నక్కలగుట్టలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

వరంగల్‌ ప్రాంతంలో సినిమాలు తీస్తే నటిస్తానన్నారు. మహానటి సినిమా తనకు బాగా నచ్చిందన్నారు. అప్పటి నటికి సంబంధించిన చిత్రాన్ని ఇప్పుడు అద్భుతంగా తీశారన్నారు. ప్రస్తుతం మూడు భాషల్లో తీసే చిత్రంలో నటిస్తున్నట్లు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement