
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ ఫోన్ రిటైల్ చెయిన్ సంస్థ ‘సెలెక్ట్ మొబైల్స్’ శుక్రవారం హైదరాబాద్, జిల్లాలలో ఒకే రోజున పలు నూతన షోరూంలను ప్రారంభించింది. వీటితో కలిపి తమ మొత్తం షోరూంల సంఖ్య 30 దాటిందని సంస్థ ఫౌండర్, ఛైర్మన్ వై.గురు చెప్పారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో సెలెక్ట్ మొబైల్స్ షోరూంల సంఖ్యను 200కు పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇందులో భాగంగానే టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్‌టీఆర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు గుర్తు చేశారు. అధునాతన కాన్సెప్ట్‌తో ప్రారంభమవుతున్న తమ షోరూంలకు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నట్లు తెలియజేశారు. షోరూంల ప్రారంభం సందర్భంగా వినూత్న ఆఫర్లను ప్రకటిస్తున్నట్లు తెలిపిన ఆయన... మొబైల్స్ కొనుగోలు చేసిన కస్టమర్లకు ఆఫర్లలలో భాగంగా వాషింగ్ మెషీన్‌లు, కూలర్లు, మిక్సీ లు, ఫ్యాన్లు అందిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment