
ప్రతీకాత్మక చిత్రం
నాగోలు: పల్లీపట్టీ కావాలని వచ్చిన ఓ దుండగుడు షాపులో ఉన్న మహిళ మెడలోని బంగారు పుస్తెలు తెంచుకొని పారిపోయాడు. ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... హస్తినాపురం, అనుపమనగర్‌లో నివసించే పెబ్బేటి స్వప్న (35) అదే కాలనీలో జై సంతోషిమాత పింగి గిర్నీ నిర్వహిస్తోంది.
గురువారం మధ్యాహ్నం గుర్తుతెలియని యువకుడు దుకాణానికి వచ్చి పల్లీపట్టి కావాలని అడిగి ఆమె మెడలోని పుస్తెలతాడు తెచ్చేందుకు యత్నించాడు. ఆమె తాడును గట్టిగా పట్టుకోవడంతో రెండు పుస్తెలు తెంచుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్ పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment