lb nagaar
-
HYD: మహిళపై థర్డ్ డిగ్రీ..! సీపీ వివరణ
సాక్షి, హైదరాబాద్: ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై థర్డ్ డిగ్రీ కేసులో దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ సీపీ చౌహాన్ అన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశాం. ఒక ఎస్ఐను బదిలీ చేశాం. హైకోర్టుకు పూర్తి నివేదిక సమర్పిస్తాం. బాధితురాలి దగ్గర డబ్బులు, గోల్డ్ తీసుకున్నారనడంలో వాస్తవం లేదు. హైకోర్టు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తామని సీపీ పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే.. వరలక్ష్మీ అనే మహిళ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్ కాలనీ రోడ్డులో తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటూ స్థానికంగా ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆగస్టు 15న దేవరకొండలోని బంధువుల ఇంటికి వెళ్లి ఆ మహిళ రాత్రి తిరిగి వస్తూ ఎల్బీ నగర్లో బస్సు దిగింది. ఆటోలు, బస్సులు లేకపోవడంతో రోడ్డు పక్కన నిలబడింది. పెట్రోలింగ్‌కు వచ్చిన ఎల్బీ నగర్ పోలీసులు ఆ మహిళను ప్రశ్నించారు. ఆమె వద్ద డబ్బులు కూడా ఉండటంతో అనుమానించి స్టేషన్ కు తీసుకెళ్లారు. తన కుమార్తె పెళ్లి కార్డును కూడా చూపినా వదల్లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేశారని, ఉదయానే ఆటోలో ఇంటికి పంపినట్లు ఆమె తెలిపింది. చదవండి: మీర్పేట్లో అమానుషం.. గ్యాంగ్‌రేప్ నిందితుల అరెస్ట్ -
పల్లీపట్టీలు కావాలని వచ్చి... పుస్తెలు అపహరణ!
నాగోలు: పల్లీపట్టీ కావాలని వచ్చిన ఓ దుండగుడు షాపులో ఉన్న మహిళ మెడలోని బంగారు పుస్తెలు తెంచుకొని పారిపోయాడు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... హస్తినాపురం, అనుపమనగర్‌లో నివసించే పెబ్బేటి స్వప్న (35) అదే కాలనీలో జై సంతోషిమాత పింగి గిర్నీ నిర్వహిస్తోంది. గురువారం మధ్యాహ్నం గుర్తుతెలియని యువకుడు దుకాణానికి వచ్చి పల్లీపట్టి కావాలని అడిగి ఆమె మెడలోని పుస్తెలతాడు తెచ్చేందుకు యత్నించాడు. ఆమె తాడును గట్టిగా పట్టుకోవడంతో రెండు పుస్తెలు తెంచుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎల్బీనగర్ లో టిఆర్ఎస్ -బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
-
కార్డన్ సెర్చ్..29 వాహనాలు స్వాధీనం
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయంజాల్ వైఎస్సార్ నగర్లో ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 26 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలు, 1 మారుతి ఓమ్ని, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 8మంది అనుమానితులను ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక బెల్ట్ షాపును సీజ్ చేశారు. -
బుల్లెట్ దిగిందా.. లేదా.?
స్నాచర్ల కోసం పోలీసుల విస్తృత గాలింపు ఆటోనగర్ ఘటనలో గాయపడి ఉంటారని అనుమానం అన్ని చెక్ పాయింట్లు, ఆస్పత్రుల్లోనూ నిఘా సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో: వనస్థలిపురంలోని ఆటోనగర్‌లో చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న చైన్‌స్నాచర్ల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అనురాధ అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కోబోయిన ఇద్దరు దుండగులు సీసీటీం జరిపిన కాల్పుల్లో గాయపడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలి వద్ద ఒక్క బుల్లెట్ కూడా లభించకపోవడంతో అవి వారికి తగిలి ఉంటాయని భావిస్తున్నారు. దుండగులు ఆటోనగర్ నుంచి చింతల్‌కుంట, సాగర్‌రింగ్ రోడ్డు, కర్మన్‌ఘాట్ మీదుగా కంచన్‌బాగ్ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అక్కడి ఆస్పత్రులతో పాటు ఇతర ప్రాంతాల్లోని హాస్పిటళ్లలో పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఎవరైనా గాయపడి చికిత్స కోసం వస్తే వెంటనే తమకు సమాచారమివ్వాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే అన్ని చెక్ పాయింట్ల వద్ద నిఘా ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఊహా చిత్రాలను గీసి ఇప్పటికే గస్తీ సిబ్బందితో పాటు అన్ని పీఎస్‌లకు పంపారు. ‘స్నాచర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. సాధ్యమైనంత తొందరగా వారిని పట్టుకుంటాం. బస్, రైల్వే స్టేషన్లలోనూ గాలిస్తున్నాం. సీసీటీమ్స్ కూడా చాలా చురుగ్గా పనిచేస్తున్నాయ’ని ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ చెప్పారు. -
మహిళ అనుమానాస్పద మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని ఎల్బీనగర్ కాలనీకి చెందిన మహిళ అనుమానాస్పదంగా మృతిచెందింది. కాలనీకి చెందిన దాసరి పద్మ(38) గురువారం మధ్యాహ్నం ఇంట్లో అచేతనంగా పడి ఉంది. ఇది గమనించిన వారు పరిశీలించి చూడగా ఆమె మృతిచెంది ఉంది. ఎలా మరణించిందనే విషయం తెలియరాలేదు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.