సాక్షి, హైదరాబాద్: ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై థర్డ్ డిగ్రీ కేసులో దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ సీపీ చౌహాన్ అన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశాం. ఒక ఎస్‌ఐను బదిలీ చేశాం. హైకోర్టుకు పూర్తి నివేదిక సమర్పిస్తాం. బాధితురాలి దగ్గర డబ్బులు, గోల్డ్ తీసుకున్నారనడంలో వాస్తవం లేదు. హైకోర్టు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తామని సీపీ పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
వరలక్ష్మీ అనే మహిళ మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్ కాలనీ రోడ్డులో తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటూ స్థానికంగా ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆగస్టు 15న దేవరకొండలోని బంధువుల ఇంటికి వెళ్లి ఆ మహిళ రాత్రి తిరిగి వస్తూ ఎల్‌బీ నగర్‌లో బస్సు దిగింది. ఆటోలు, బస్సులు లేకపోవడంతో రోడ్డు పక్కన నిలబడింది. పెట్రోలింగ్‌కు వచ్చిన ఎల్‌బీ నగర్ పోలీసులు ఆ మహిళను ప్రశ్నించారు. ఆమె వద్ద డబ్బులు కూడా ఉండటంతో అనుమానించి స్టేషన్ కు తీసుకెళ్లారు.
తన కుమార్తె పెళ్లి కార్డును కూడా చూపినా వదల్లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేశారని, ఉదయానే ఆటోలో ఇంటికి పంపినట్లు ఆమె తెలిపింది.
చదవండి: మీర్‌పేట్‌లో అమానుషం.. గ్యాంగ్‌రేప్ నిందితుల అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment