ఇంతవరకు ఎముకలు కొరికే మంచు కొండల్లో విహరించడం, విచిత్రమైన స్టంట్‌లు చేయడం చూశాం. గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా ట్రెక్కింగ్ వెళ్లిన వాళ్ల గురించి విన్నాం. అయితే ఇక్కడొక వ్యక్తి ఏకంగా మంచు పర్వతాన్ని అధిరోహించాలనుకున్నాడు. కానీ ఒక్కసారిగా హిమపాతం బారిన పడ్డాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా!.
అసలు విషయంలోకెళ్తే... యూఎస్‌కి చెందిన లేలాండ్ నిస్కీ మంచుతో నిండిన కొలరాడో పర్వతాన్ని అధిరోహిస్తున్నాడు. అయితే ఒక్కసారిగా భారీ హిమ పాతం వచ్చింది. ఆ హిమపాతం తన ఉద్ధృతిని పెంచుతూనే ఉంది. ఏ మాత్రం అతను పట్టు వదిలిన అంతే సంగతులు. ఎందుకంటే అతను భూమి నుండి సుమారు 400 అడుగుల ఎత్తులో ఉండగా హిమపాతం బారిన పడ్డాడు.
కానీ అతను తన ధైర్యాన్ని ఏ మాత్రం కోల్పోకుండా బలంగా తన పట్టును కోల్పోకుండా గట్టిగా తన సాధనాలతో తవ్వి పట్టుకున్నాడు. ఆ హిమపాతం తగ్గే వరకు అలాగే గట్టిగా పట్టుకుని ఉన్నాడు. అయితే అతను చివరికి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వెన్నులో వణుకు పుట్టించే ఈ భయంకరమైన వీడియోని మీరు ఓ లుక్కేయండి.
Comments
Please login to add a commentAdd a comment