Ice mountain
-
మంచు పర్వత అధిరోహణ.. దూసుకొచ్చిన హిమపాతం!
ఇంతవరకు ఎముకలు కొరికే మంచు కొండల్లో విహరించడం, విచిత్రమైన స్టంట్లు చేయడం చూశాం. గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా ట్రెక్కింగ్ వెళ్లిన వాళ్ల గురించి విన్నాం. అయితే ఇక్కడొక వ్యక్తి ఏకంగా మంచు పర్వతాన్ని అధిరోహించాలనుకున్నాడు. కానీ ఒక్కసారిగా హిమపాతం బారిన పడ్డాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా!. అసలు విషయంలోకెళ్తే... యూఎస్‌కి చెందిన లేలాండ్ నిస్కీ మంచుతో నిండిన కొలరాడో పర్వతాన్ని అధిరోహిస్తున్నాడు. అయితే ఒక్కసారిగా భారీ హిమ పాతం వచ్చింది. ఆ హిమపాతం తన ఉద్ధృతిని పెంచుతూనే ఉంది. ఏ మాత్రం అతను పట్టు వదిలిన అంతే సంగతులు. ఎందుకంటే అతను భూమి నుండి సుమారు 400 అడుగుల ఎత్తులో ఉండగా హిమపాతం బారిన పడ్డాడు. కానీ అతను తన ధైర్యాన్ని ఏ మాత్రం కోల్పోకుండా బలంగా తన పట్టును కోల్పోకుండా గట్టిగా తన సాధనాలతో తవ్వి పట్టుకున్నాడు. ఆ హిమపాతం తగ్గే వరకు అలాగే గట్టిగా పట్టుకుని ఉన్నాడు. అయితే అతను చివరికి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వెన్నులో వణుకు పుట్టించే ఈ భయంకరమైన వీడియోని మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Leland Nisky (@nemonisky) (చదవండి: ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం.. అదే శాపమయింది..!) -
టైటానిక్ ఢీకొన్న పర్వతానికి లక్ష ఏళ్లు
లండన్: అట్లాంటిక్ మహాసముద్రంలో 1912, ఏప్రిల్ 14న టైటానిక్ ఓడ మునిగిపోవడానికి కారణమైన మంచు పర్వతం (ఐస్‌బర్గ్) లక్ష ఏళ్ల నాటి దని శాస్త్రవేత్తలు తేల్చారు. బ్రిటన్‌లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన గ్రాంట్ బిగ్ అనే శాస్త్రవేత్త తన సమష్టి అధ్యయనంలో ఈ విషయాన్ని కనుగొన్నారు. 1912 నుంచి వాతావరణ శాఖ జరిపిన అధ్యయనాల్లోని సమాచారాన్ని తన పరిశోధనకు తీసుకున్నారు. మహాసముద్రాల ప్రవాహాలు, గాలి అనే అంశంపై జరిపిన అధ్యయనంతో లభించిన ఆధునిక సమాచారాన్ని గత సమాచారంతో కలపి విశ్లేషించిన గ్రాం ట్ బిగ్ ‘టైటానిక్’ ఓడ ఢీకొన్న పర్వతం వయసును నిర్ధారించారు. మంచుపర్వతం వయసును లెక్కకట్టగలిగిన ఓ మోడల్ కంప్యూటర్ ను బిగ్ ఉపయోగించినట్లు సండేటైమ్స్ పత్రిక వెల్లడించింది. ఈ మంచు పర్వతం 400 అడుగుల పొడవు, సముద్ర ఉపరితలంపై 100 అడుగులకు పైగా ఎత్తు, 1.5 మిలియన్ టన్నుల బరువు ఉన్నట్లు మంచు పర్వతం పరిమాణాన్ని మొదట అంచనా వేశారు. కానీ, బిగ్ అధ్యయనం ప్రకారం 1700 అడుగుల పొడవు, 75 మిలియన్ టన్నుల బరువు ఉన్నట్లు చెబుతున్నారు.