బీజింగ్ : వాయువ్య చైనాను వరుస మంచు తుఫాన్లు బెంబేలెత్తిస్తున్నాయి. డజన్ల కొద్దీ వస్తున్న మంచు తుఫాన్ల ప్రభావంతో ఈ ప్రాంతంలో తీవ్రంగా మంచు కురుస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో వారం రోజుల్లో 1000 మంది దాకా మంచులో చిక్కుకుపోయారు.
మంచు తుఫాన్ల దాటికి జింజ్యాంగ్ ప్రాంతంలో పలు రోడ్లు బ్లాక్ అవడంతో ఇక్కడున్న పలు గ్రామాల వారికి కనెక్టివిటీ లేకుండా పోయింది. దీంతో ఇక్కడి వారికి ఆహారం, ఇంధనం తదితర నిత్యావసరాలను హెలికాప్టర్‌లో సరఫరా చేస్తున్నారు.
మంచులో చిక్కుకున్న వారిని కూడా హెలికాప్టర్ల సాయంతో తరలిస్తున్నారు. ఈ విషయాలను చైనా అధికారిక టీవీ సీసీటీవీ ప్రసారం చేసింది. చిక్కుకుపోయిన వారిలో కొందరు పర్యాటకులు కూడా ఉన్నారు. మంచు తుఫాన్ల దాటికి వాయువ్య చైనాలో మొత్తం 350 కిలోమీటర్ల దాకా రోడ్లుబ్లాక్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment