పారిస్, బిచాట్ ఆసుపత్రి (ఫైల్ ఫోటో)
పారిస్ : ప్రాణాంతకమైన కోవిడ్-19 (కరోనావైరస్) వ్యాధితో ఫ్రాన్స్‌లో ఒక వృద్ధుడు మరణించాడు. 80 ఏళ్ల చైనా పర్యాటకుడు ఫ్రాన్స్‌లో మరణించారని ఆ దేశ ఆరోగ్య మంత్రి ఆగ్నెస్ బుజిన్ శనివారం ప్రకటించారు. గత మూడు వారాలుగా ఉత్తర పారిస్‌లోని బిచాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా మరణించినట్లు తెలిపారు. 11 ధృవీకరించబడిన కరోనా వైరస్ కేసులలో ఒకరు చనిపోయారని ఆయన తెలిపారు. దీంతో యూరప్‌లో తొలి కరోనావైరస్ మరణంగా ఇది నిలిచింది. కాగా చైనాలో వుహాన్‌లో గత ఏడాది చివరలో గుర్తించిన కరోనావైరస్ అంతకంతకూ విస్తరించి ఆందోళన రేపింది. ఈవ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 1500 దాటింది. ప్రపంచవ్యాప్తంగా 66,000 కన్నా ఎక్కువ కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment