జమ్ము: జమ్ము కశ్మీర్‌లో మరోసారి విషాదం చోటు చేసుకుంది. కశ్మీర్‌లో లడక్ ప్రాంతంలోని బాటలిక్ సెక్టార్‌లో మంచు తుఫాన్ రావడంతో ఇద్దరు సైనికులు మరణించగా, మరో సైనికుడి ఆచూకీ తెలియడం లేదని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు.
బాటలిక్ సెక్టార్‌లో మంచు చరియలు విరిగిపడటంతో ఓ సైనిక శిబిరం ధ్వంసమైంది. ఐదుగురు సైనికులు మంచు తుఫానులో చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ఆపరేషన్ ప్రారంభించి ఇద్దరిని ప్రాణాలతో రక్షించారు. కాగా ఈ శిబిరంలో ఉన్న మరో ఇద్దరు సైనికులు మరణించగా, మరో సైనికుడి ఆచూకీ ఇప్పటికీ లభించడం లేదు.
జమ్ముకశ్మీర్‌లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీనగర్‌లో 83.9 మిల్లీ మీటర్లు, కొకెర్‌నాగ్‌లో 69.9 మి.మీ, పహల్గాంలో 64.2 మి.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక్కడ ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. గత జనవరిలో కశ్మీర్‌లో మంచు తుఫాన్ రావడంతో మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఓ మేజర్ సహా 20 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే.
కశ్మీర్‌లో మళ్లీ విషాదం
Published Fri, Apr 7 2017 9:40 AM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM
Advertisement