జమ్ము కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోగల ఆర్మీ పోస్టుపై మంచు కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో ఒక ఆర్మీ ట్రూపర్ మరణించగా, మరొకరు గల్లంతయ్యారు.
జమ్ము కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోగల ఆర్మీ పోస్టుపై మంచు కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో ఒక ఆర్మీ ట్రూపర్ మరణించగా, మరొకరు గల్లంతయ్యారు. ఈ దుర్ఘటన గురువారం సాయంత్రం తర్వాత జరిగింది.
కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్ సోనాపెండి గలీ ప్రాంతంలో ఉన్న ఆర్మీపోస్టుపై ఈ మంచుకొండ పడిందని, దాని శిథిలాల కింద ఇద్దరు ట్రూపర్లు ఉండిపోయారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. వారిలో సనాతమ్ సింగ్ అనే ట్రూపర్ను వెంటనే అక్కడి నుంచి తీసి కాపాడినా, తర్వాత కాసేపటికి అతడు తీవ్ర గాయాల కారణంగా మరణించాడు. మరో ట్రూపర్ జాడ మాత్రం ఇంకా తెలియరాలేదు. అతడి కోసం గాలింపు జరుపుతున్నారు.