షికాగో: అమెరికాను భారీ హిమపాతం వణికిస్తోంది. మంచు తుపాన్ ధాటికి ఐదు రాష్ట్రాల్లో 13 మంది మృత్యువాత పడినట్లు స్థానిక మీడియా తెలిపింది. గడ్డ కట్టించే చలి వాతావరణంలో తుపాను ప్రభావం మరికొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. పలుచోట్ల వీధుల్లో, వృక్షాలపై మంచు భారీగా పేరుకుపోయింది. విమాన ప్రయాణాలు, రహదారులపై రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఓక్లహామా, టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూ మెక్సికో, ఆరిజోనా తదితర చోట్ల తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. కాలిఫోర్నియాలో విద్యుత్తు తీగలు తెగిపోయి ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు.