Snow Cyclone
-
అమెరికాను అతలాకుతలం చేసిన మంచు తుపాన్.. వైరల్ ఫొటోలు
-
అమెరికాలో భారీ మంచు తుపాను
న్యూయార్క్/టోక్యో: అమెరికాలో బుధ, గురువారాల్లో కురిసిన తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో 40 అంగుళాల మేర రోడ్లపై మంచు పేరుకుపోయింది. మంచు తుఫానుకు చలిగాలి తోడవడంతో న్యూఇంగ్లాండ్ప్రాంతంలోని రాష్ట్రాల్లో, మిడ్ అట్లాంటిక్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. మంచు తుఫానుతో ప్రభావితం అవుతారని భావిస్తున్న 60 లక్షల మందిని అప్రమత్త పరిశీలనలో ఉంచినట్లు అధికారులు చెప్పారు. పలు విమానాశ్రయాల్లో మంచు పేరుకుపోతోందని తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తుపాను తగ్గగానే మంచు తవ్వే ప్రక్రియ ఆరంభిస్తామన్నారు. ఒకటీ రెండు రోజుల్లో తుపాను కాస్త తగ్గు ముఖం పట్టవచ్చని అంచనా. జపాన్‌లో జా..మ్ గురువారం రాత్రి నుంచి మంచు తుపాను కారణంగా జపాన్‌లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 15 కిలోమీటర్ల పొడవున వాహనాలు ఆగిపోగా, సుమారు 1000 మందికి పైగా ఇందులో చిక్కుకుపోయారు. టోక్యో, నైగటాలను కలిపే కనెట్సు ఎక్స్‌ప్రెస్‌వేలో ట్రాఫిక్ జామ్ బుధవారం నుంచి ఆరంభమై, గురువారం నాటికి తీవ్రతరమైంది. దీంతో ప్రస్తుతం సదరు రహదారి ఎంట్రన్స్‌ను అధికారులు మూసివేసి ట్రాఫిక్ క్లియరెన్సు చేపట్టారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతోప్రయాణికులు, బైక్ చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారానికి ఇంకా 1000కిపైగా కార్లు నిలిచిపోయి ఉన్నట్లు అధికారులు చెప్పారు. వాహనదారులకు ఆహారం, నీరు, ఇంధనం అందిస్తున్నారు. అయితే, తీవ్రమైన చలి వారిని భయపెడుతోంది. -
అమెరికాను వణికిస్తున్న ఆర్కిటిక్ చలి
షికాగో: భీకరస్థాయిలో విరుచుకుపడుతున్న ఆర్కిటిక్ చలి దెబ్బకు అమెరికాలో లక్షలాది ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇళ్లలోనే ఉండిపోవాలని చాలా సంస్థలు తమ ఉద్యోగులకు సమాచారమిచ్చాయి. చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు, వ్యాపార, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఇప్పటికే 2000కుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎలాంటి విపత్కర వాతావరణ పరిస్థితిల్లోనైనా ఉత్తరాలను బట్వాడా చేసే ‘యూఎస్ పోస్టల్ సర్వీస్’ సైతం ఇండియానా, మిషిగాన్, ఇల్లినాయిస్సహా 5 రాష్ట్రాల్లో తన సేవలను అర్ధంతరంగా నిలిపేసింది. ఉత్తర డకోటా, దక్షిణ డకోటా మొదలుకొని ఓహియో దాకా (1,930 కిలోమీటర్ల పొడవునా) డజనుకుపైగా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఇటీవల కాలంలో ఎన్నడూలేనంతటి కనిష్టస్థాయిలకు పడిపోయాయి. ఆరుబయటకెళ్లి ఎక్కువసేపు మాట్లాడొద్దని, సెకన్లలోనే ఒళ్లు మొద్దుబారేలా చేసే చలివాతావరణం ఆవరించి ఉందని అమెరికన్ పౌరులను జాతీయ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. షికాగోలో ఉష్ణోగ్రత ఏకంగా మైనస్ 30 సెల్సియస్‌గా నమోదైంది. షికాగోలో మైనస్ 50కి సైతం పడిపోయే ప్రమాదముంది. అంటార్కిటికా ఖండంలోని కొన్నిచోట్ల సైతం ఇంతటి చలిలేదు. నార్త్ డకోటాలో ఉష్ణోగ్రత మైనస్ 35 డిగ్రీ ఫారన్‌హీట్‌గా నమోదైంది. కొన్ని రైళ్ల సర్వీసులనైనా నడిపేందుకు వీలుగా, మంచును కరిగించేందుకు షికాగోలో రైళ్ల పట్టాల దగ్గర సిబ్బంది మంటలు అంటించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్లో ‘మంచు ఎమర్జెన్సీ’ని ప్రకటించారు. ఇల్లినాయిస్, మిషిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో వాతావరణ ఎమర్జెనీ ప్రకటించారు. కెనడాలో సైతం చలి విజృంభిస్తోంది. ట్రంప్ వ్యంగ్య ట్వీట్: అమెరికాను మంచుదుప్పటి కప్పేసిన వేళ అధ్యక్షుడు ట్రంప్ తన వాదనను వ్యంగ్యంగా తెరపైకి తెచ్చారు. భూతాపం(గ్లోబల్ వార్మింగ్) అనేదే లేదని వాదించే ట్రంప్ బుధవారం.. ‘గ్లోబల్ వార్మింగ్ ఎక్కడ? త్వరగా అమెరికాకు వచ్చెయ్. ఈ చలిలో మాకు నీ అవసరం చాలా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై జాతీయ వాతావరణ శాఖ ఘాటుగా స్పందించింది. ‘చలి తుపాన్లు వచ్చినంతమాత్రాన గ్లోబల్ వార్మింగ్ అనేది లేదని కాదు’అంటూ ట్వీట్ చేసింది. -
అమెరికాలో మంచు తుపాను; 13 మంది మృతి
షికాగో: అమెరికాను భారీ హిమపాతం వణికిస్తోంది. మంచు తుపాన్ ధాటికి ఐదు రాష్ట్రాల్లో 13 మంది మృత్యువాత పడినట్లు స్థానిక మీడియా తెలిపింది. గడ్డ కట్టించే చలి వాతావరణంలో తుపాను ప్రభావం మరికొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. పలుచోట్ల వీధుల్లో, వృక్షాలపై మంచు భారీగా పేరుకుపోయింది. విమాన ప్రయాణాలు, రహదారులపై రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఓక్లహామా, టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూ మెక్సికో, ఆరిజోనా తదితర చోట్ల తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. కాలిఫోర్నియాలో విద్యుత్తు తీగలు తెగిపోయి ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు.