US: న్యూ జెర్సీలో మంచు తుఫాను బీభత్సం | Avalanches Wreck Havoc In America | Sakshi
Sakshi News home page

న్యూ జెర్సీలో మంచు తుఫాను బీభత్సం

Published Sat, Jan 20 2024 1:38 PM | Last Updated on Sat, Jan 20 2024 2:01 PM

Avalanches Wreck Havoc In America  - Sakshi

photo credit: THE INDEPENDENT

న్యూజెర్సీ: అమెరికాలో దట్టమైన మంచు తుఫాను కురుస్తోంది. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన న్యూజెర్సీలో మంచు తుఫాను విశ్వరూపం చూపుతోంది. వింటర్ స్టార్మ్‌ కారణంగా హైవేలపై అడుగుల కొద్దీ మంచు పేరుకుపోయింది.

రోడ్డపై గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోవడం వల్ల కార్లు నడవలేని పరిస్థితి ఏర్పడింది. వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై సుమారు 2 నుంచి 6 అంగుళాల మధ్య మంచు కమ్మేసినట్లు స్థానికులు చెబుతున్నారు. 

న్యూజెర్సీతో పాటు దేశంలోని చాలా నగరాల్లో కరెంటు సరఫరా ఆగిపోయి ఆ ప్రాంతాలన్నీ చీకటిమయమైపోయాయి. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం రాలేని పరిస్థితి నెలకొంది.

మంచు తుఫాన్‌ కారణంగా విమానాలు, రైళ్లు, ఇతర రవాణా సర్వీసులను రద్దు చేశారు. పలు ప్రాంతాల్లో 4 నుంచి 12 అంగుళాల మధ్య మంచు కురిసే అవకాశం ఉందని అమెరికా వాతావరణ శాఖ తెలిపింది. భారీ మంచు తుఫాన్‌  నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. 

ఇదీచదవండి.. జనవరి 22 రామ్‌ మందిర్‌డేగా గుర్తించిన కెనడా మునిసిపాలిటీలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement