సాక్షి, కశ్మీర్ : జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ మంచుకొండచరియలు విరిగిపడటంతో ఎనిమిదిమంది గల్లంతయ్యారు. కుప్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో పడిన వారంతా కుప్వారా నుంచి కర్ణా ప్రాంతానికి వెళుతున్నారు.
వారు తమ వాహనంలో వెళుతుండగా సరిగ్గా సాధనటాప్ అనే ప్రాంతంలోని తంగ్దార్ వద్ద సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఓ భారీ మంచుకొండ విరిగి వారి వాహనంపై పడింది. దాంతో దాదాపు ఎనిమిదిమంది మంచుదిబ్బల కింద పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, ఆర్మీ, పర్వత ప్రాంతాల్లో భద్రతను చూసేవారు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. సరిహద్దు రహదారుల విభాగంలో పనిచేసే ఓ అధికారి కూడా ఈ ప్రమాదంలో కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది.
వాహనంపై పడిన భారీ మంచుకొండ
Published Fri, Jan 5 2018 8:08 PM | Last Updated on Fri, Jan 5 2018 8:08 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment