రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో మావోయిస్టులు బాంబు పేల్చడంతో ఒక డ్రైవర్‌తోపాటు నలుగురు పోలీసులు మృత్యువాత పడ్డారు. ఈ దాడిలో 15 మంది గాయపడగా..వారందరినీ నారాయణపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో అయిదుగురు పరిస్థితి విషమంగా ఉంది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో పాల్గొన్న డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్(డీఆర్‌జీ) పార్టీ తిరిగి వస్తుండగా మంగళవారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో ఓ బ్రిడ్జ్ వద్ద మావోయిస్టులు బాంబు పెట్టి బస్సును పేల్చేసినట్లు ఛత్తీస్‌గఢ్ యాంటీ నక్సల్స్ ఆపరేషన్ డీజీ అశోక్ జునేజా చెప్పారు.
డ్రైవరు, ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించారని.. మరో ఇద్దరు హాస్పిటల్‌కి తీసుకెళ్లిన తరువాత మరణించారని.. మొత్తం అయిదుగురు ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. మావోయిస్టులు దాడి చేసిన సమయానికి బస్సులో 27 జవాన్లు ఉన్నట్లు, పేలుడు తీవ్రతకు బస్సు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైనట్లు పేర్కొనఆనరు.
Anti-naxal ops were going on. One DRG party was returning after the op when around 4.15 pm, 3 IED blasts took place at a bridge in their route. Driver & 2 jawans died on spot, 2 died later at hospital - 5 jawans lost their lives: Ashok Juneja, DG, Anti Naxal Ops#Chhattisgarh pic.twitter.com/SEEIF5Wqr1
— ANI (@ANI) March 23, 2021
Comments
Please login to add a commentAdd a comment