
చర్ల(భద్రాద్రి కొత్తగూడెం): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మారోమారు మావోయిస్టులు రెచ్చిపోయారు. రాజ్‌నందిగామ్ జిల్లాలోని భాగ్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న జవాన్లను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో రవి అనే జవాను మృతి చెందాడు.
ఇదే ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఈ ఘటనల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కూంబింగ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేసినట్లు రాజ్‌నంద్‌గామ్ జిల్లా పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment