మరో నలుగురికి తీవ్రగాయాలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో శనివారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు జవాన్లు నేలకొరగ్గా మరో నలుగురు జవాన్లు సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కొకెర్‌నాగ్ ప్రాంతం అహ్లాన్ గగర్‌మండులో 10 వేలఅడుగుల ఎత్తులోని అటవీప్రాంతంలో కార్డన్ సెర్ఛ్ చేపట్టాయి.
తనిఖీలు జరుపుతున్న బలగాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనలో ఆరుగురు జవాన్లు, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు జవాన్లు అమరులైనట్లు అధికారులు వెల్లడించారు. మిగతా వారు చికిత్స పొందుతున్నారన్నారు. తప్పించుకుపోయిన ఉగ్రమూకల కోసం గాలింపు కొనసాగుతోందని వివరించారు.
నలుగురు ఉగ్రవాదుల స్కెచ్ విడుదల
జూలై 8వ తేదీన కథువా జిల్లాలోని మచెడిలో భద్రతా బలగాలపై దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను పోలీసులు విడుదల చేశారు. స్థానికులు ఇచి్చన సమాచారం ఆధారంగా ఊహా చిత్రాలను రూపొందించారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు. అప్పటి ఘటనలో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సహా ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment