ఛత్తీస్గఢ్: బీజాపూర్ జిల్లాలోని పురంకొండ అటవీ ప్రాంతంలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు, ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పురంకొండ అటవీ ప్రాంతంలో ఆర్మీ జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా... మావోయిస్టులు ఎదురుపడ్డారు.దాంతో జవాన్లపైకి మావోయిస్టులు కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు.