ఛత్తీస్గఢ్లో మావోయిస్టు పార్టీకి మరో భారీ దెబ్బ తగిలింది. ఎదురుకాల్పుల్లో 19 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. కోబ్రా బెటాలియన్, సీఆర్‌పీఫ్ సిబ్బంది కూంబింగ్‌లో పాల్గొన్నారు. కుటరిఘాట్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం.
ఈ ఎదురు కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు జైరామ్ అలియాస్ చలపతి మృతి చెందారు. చలపతిపై రూ.కోటి రివార్డ్ ఉంది. ఘటనా స్థలం నుంచి ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్‌తో పాటు భారీ ఎత్తున ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఈ నెల 19 నుంచి రెండు రాష్ట్రాల బలగాల ఉమ్మడి ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
భారీగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రెండు రోజులుగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. నిన్న, ఇవాళ ఎదురు కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతిచెందారు.
కాగా, తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌లో గత గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరో ఘటనలో బిజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో కోబ్రా బెటాలియన్ కానిస్టేబుళ్లు మృదుల్ బర్మన్, మహ్మద్ ఇషాఖ్ గాయపడ్డారు.
తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం(కే) మండల సరిహద్దులోని మారేడుబాక –ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరం ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. మొత్తం రెండు వేల మంది జవాన్లు అడవులను జల్లెడ పట్టడం మొదలెట్టారు.
ఇదీ చదవండి: బాయ్‌ఫ్రెండ్‌ను చంపిన గ్రీష్మకు ఉరిశిక్ష.. కోర్టు సంచలన తీర్పు!
Comments
Please login to add a commentAdd a comment