చింతూరు (రంపచోడవరం): ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. నారాయణ్‌పూర్, బీజాపూర్ జిల్లాల్లో బుధవారం జరిపిన రెండు వేర్వేరు దాడుల్లో ఇద్దరు ఎస్‌ఐలు సహా ఐదుగురు పోలీసులు మృతి చెందారు. నారాయణ్‌పూర్ జిల్లాలోని అబూజ్‌మఢ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం అందడంతో వంద మంది పోలీసులు కూంబింగ్‌కు వెళ్లారు. దీంతో ఇర్‌పానార్ అటవీ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
నక్సల్స్ కాల్పుల్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్‌జీ) గ్రూప్‌కు చెందిన ఎస్‌ఐలు వినోద్ కౌశిక్, మూల్‌చంద్‌లతోపాటు కానిస్టేబుళ్లు దేవ్‌నా«థ్ పూజారి, రామ్‌సింగ్‌లు మృతిచెందారు. గాయాలపాలైన మరో తొమ్మిది మందిని చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తరలించారు. మరో ఘటనలో బీజాపూర్ జిల్లా బాసగూడ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లిన పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఒక కానిస్టేబుల్ మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment