గడ్చిరోలి : మహారాష్ట్రలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లా దానోరా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందు పాతర పేల్చారు. మందుపాతర పేలిన ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. పోలీసులే లక్ష్యంగా మావోలు ఈ మందుపాతర పేల్చినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.