landmine blast
-
బలగాల బస్సును పేల్చేసిన మావోలు
చర్ల/రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ప్రధాని మోదీ శనివారం పర్యటించనున్న నేపథ్యంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతాబలగాలే లక్ష్యంగా రెండుచోట్ల మందుపాతరలను పేల్చి ఇద్దరు జవాన్లను బలిగొన్నారు. బీజాపూర్ జిల్లాలోని పుట్రు–నమ్మేడ్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న రహదారిని తనిఖీ చేసి తిరిగివస్తున్న భద్రతాబలగాల బస్సే లక్ష్యంగా సోమవారం మధ్యాహ్నం మావోలు శక్తిమంతమైన మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డుల(డీఆర్జీ)కు చెందిన ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రుల్ని రాయ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది జవాన్లు ఉన్నారన్నారు. -
మందుపాతర పేలుడు: జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌ఘడ్: మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి కూంబింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఛత్తీస్‌ఘడ్ సుక్కమాజిల్లా ధోర్నపాల్ అటవీ ప్రాంతంలో శుక్రవారం వెలుగుచూసింది. సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడీ బాంబ్ పేలింది. దీంతో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని జగదల్పూర్ ఆస్పత్రికి తరలించారు. -
చింతపల్లిలో ల్యాండ్‌మైన్ పేలుడు: హోంగార్డు మృతి
విశాఖపట్నం: విశాఖ జిల్లాలోని చింతపల్లి మండలంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. స్థానిక మేడివాడ పంచాయతీ పరిధిలో రామన్నపాలెం వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ సంఘటనలో ఒక హోంగార్డు మృతి చెందాడు. పోలీసు వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సుకుమా జిల్లాలో మందుపాతర పేలుడు
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో మావోల కార్యకలాపాలు పెచ్చుమీరుతున్నాయి. ఆదివారం రాత్రి గడ్చిరోలి జిల్లాలోని సిరోంచ రోంపల్లి కలప డిపోకు నిప్పుపెట్టిన మావోలు.. సోమవారం సుకుమా జిల్లాలోని కుంట సమీపంలో జాతీయ రహదారిపై మందు పాతర పేల్చారు. దీంతో 30 వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మావోయిస్టులు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ హింసాత్మక చర్యలు జరుగుతున్నాయి. అలాగే మద్దేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పొగడపల్లి దగ్గర రోడ్డు నిర్మాణానికి ఉపయోగిస్తున్న జేసీబీ, టిప్పర్లను మావోలు తగలబెట్టారు. -
గుండెల్లో, తలమీద కాల్చి మరీ చంపారు!
సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చడంలో మావోయిస్టులు చాలా దారుణంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ ప్రాంతం గుండా జవాన్లు ఎటువైపు నుంచి ఎటు వెళ్తున్నారో ముందుగానే పక్కా సమాచారం అందుకున్న మావోయిస్టులు.. ఆ దారిలోనే శక్తిమంతమైన మందుపాతర అమర్చి పేల్చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే మరణించినట్లు తొలుత కథనాలు వచ్చాయి. కానీ, దాడికి గురైన జవాన్లను చూసిన తర్వాత సరికొత్త విషయాలు తెలిశాయి. మందుపాతర పేల్చిన తర్వాత జవాన్లు ఇంకా ఎక్కడ బతికుంటారోనన్న అనుమానంతో.. మావోయిస్టులు వాళ్ల తలమీద, గుండెల్లోను కాల్చారని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు చెప్పారు. జవాన్లలో ముగ్గురు పేలుడు తర్వాత కూడా బతికే ఉన్నారని, కానీ ఆ తర్వాత వాళ్లను మావోయిస్టులు కాల్చేశారని సీఆర్పీఎఫ్ డీజీ దుర్గాప్రసాద్ తెలిపారు. బుల్లెట్ గాయాలు తగిలిన తర్వాత వాళ్లు బతికారో లేదో మాత్రం తమకు కూడా ఇంకా పూర్తిగా తెలియడం లేదని ఆయన అన్నారు. -
మందుపాతర పేలుడు: 12 మందికి గాయాలు
భద్రాచలం: మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందు పాతర పేల్చారు. ఈ ఘటనలో 12 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో కుంట పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న పోలీసులే లక్ష్యంగా చేసుకుని ల్యాండ్ మైన్ పెట్టి పేలుడు కు పాల్పడ్డారు. రెండు వారాల క్రితం జరిగిన మావోయిస్టుల ఎన్ కౌంటర్ కు ప్రతీకారంగానే ఈ చర్యకు పాల్పడినట్టు సమాచారం. ఎటువంటి ప్రాణనష్టం జరగక పోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనలో గాయపడిన 12 మంది పోలీసులకు చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో సమీపంలోని ఖమ్మం జిల్లా భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. -
మందుపాతర పేల్చిన మావోలు: జవానుకు తీవ్ర గాయాలు
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లా అర్నాపూర్ వద్ద మావోయిస్టులు ఆదివారం మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఆర్మీ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. అధికారులు వెంటనే స్పందించి... అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టుల కోసం భద్రత దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అందుకోసం ఉన్నతాధికారులు మరింత మంది భద్రత దళాలను రంగంలోకి దింపారు. కూంబింగ్ కొనసాగుతుంది. -
మందుపాతర పేలి 8 మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్ మర్వార్ ప్రాంతంలో గురువారం అర్థరాత్రి గిరిజన తెగ నాయకుడి కాన్వాయినే లక్ష్యంగా చేసుకుని ఆగంతకులు మందుపాతర పేల్చారు. ఈ ప్రమాదంలో గిరిజన నాయకుడితోపాటు ఏడుగురు మృతిచెందారు. ఈ మేరకు శుక్రవారం మీడియా డైలీ టైమ్స్ వెల్లడించింది. అలాగే కాన్వాయినే లక్ష్యంగా చేసుకుని ఆగంతకులు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని పేర్కొంది. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఇంతవరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదు. -
మావోయిస్టుల దాడి:నలుగురు పోలీసుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసరి పంజా విసిరారు. దంతెవాడ జిల్లాలోని కిరండోల్- పల్నార్ వద్ద పోలీసులు ప్రయాణిస్తోన్న మైన్ ప్రొటెక్టెడ్ వాహనం లక్ష్యంగా పేలుడు జరిపారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు మరణించగా, ఏడుగురికి గాయాలయ్యాయి. అత్యంత రక్షణాత్మకంగా రూపొందించిన మైన్ ప్రూఫ్ వాహనం.. మావోయిస్టులు పేల్చిన ల్యాండ్ మైన్ ధాటికి 40- 50 అడుగుల ఎత్తుకు ఎగిరిపడింది. ఆ సమయంలో వాహనంలో 12 మంది పోలీసులు ఉన్నట్లు తెలిసింది. గత వారం రోజులుగా చోటుచేసకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఎస్పీఎఫ్ బలగాలు కూంబింగ్ ను ముమ్మరం చేశాయ. వారిని అడ్డుకునేందుకు మావోయిస్టులు సైతం ప్రతిదాడులకు దిగుతూ దండకారణ్యంపై తమ పట్టును నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన వారం రోజుల్లో పోలీసులపై మావోయిస్టులు జరిపిన మూడోదాడి ఇది. గత సోమవారం సుక్మా జిల్లాలోని చింతగుఫా అటవీప్రాంతంలో ఏడుగురు ఎస్టీఎఫ్ జవాన్లను మట్టుబెట్టిన మావోయిస్టులు.. శవాలకోసం వెళ్లిన సీర్పీఎఫ్ బలగాలపైనా కాల్పులు జరిపారు. ఆదివారం కాంకేర్ జిల్లాలోని ఓ ఐరన్ ఓర్ మైన్ వద్ద 17 వాహనాలను తగలబెట్టారు. ఆ క్రమంలోనే ఈ రోజు పోలీసులు ప్రయాణిస్తోన్న వాహనాన్ని ల్యాండ్‌మైన్‌తో పేల్చారు. -
ఇద్దరు మావోయిస్టుల అరెస్టు
ఓ దళ కమాండర్ సహా ఇద్దరు మావోయిస్టులను జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు.గతంలో జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో కొంతమంది పోలీసులను హతమార్చిన కేసులో వీరిద్దరూ నిందితులు. ముందుగా బుధవారం రాత్రి చక్రధర్పూర్ ప్రాంతంలోని రైల్వే కాలనీలో ఓ మావోయిస్టును పట్టుకున్నామని, అతడిచ్చిన సమాచారంతోనే సిబో చాకి అనే దళ కమాండర్ కూడా అరెస్టయ్యాడని జిల్లా ఎస్పీ ఎన్కే సింగ్ తెలిపారు. వాళ్ల వద్ద ఓ నాటు తుపాకి, మూడు రౌండ్ల మందుగుండును స్వాధీనం చేసుకున్నామన్నారు. 2009 సంవత్సరంలో పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని చిక్రిఘాటి ప్రాంతంలో మందుపాతర పేలుడు సహా 18 కేసుల్లో చాకి నిందితుడు. ఆ పేలుడులోనే గోలికెరా పోలీసు స్టేషన్ ఇన్‌ఛార్జి సహా ఏడుగురు పోలీసులు మరణించారు. -
జార్ఖండ్‌లో మందుపాతరకు 8 మంది బలి
-
రెచ్చిపోయిన మావోలు: సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి
-
రెచ్చిపోయిన మావోలు: సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి
బీహార్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ముంగేర్ జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు వెళ్తున్న భద్రత సిబ్బంది లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఆ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సంఘటనపై సమాచారం అందుకున్న భద్రత దళాలు వెంటనే రంగంలో దూకాయి. మావోయిస్టుల కోసం భద్రత సిబ్బంది గాలింపు చర్యలు తీవ్ర తరం చేశారు. అయితే బీహార్ రాష్ట్రంలోని మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఆరు లోక్‌సభ నియోజకవర్గాలలో నేడు ఎన్నికలు జరగునున్నాయి. ఆరు నియోజకవర్గాలలో మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో 10 మంది మహిళలు కూడా ఉన్నారు. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, బీహార్ అసెంబ్లీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరి, కేరళ మాజీ గవర్నర్, న్యూఢిల్లీ మాజీ పోలీసు కమినర్ నిఖిల్ కుమార్, లోక్ జన శక్తి అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌తో పాటు మాజీ కేంద్ర మంత్రి కాంతీ సింగ్‌లు నేడు పోలింగ్ జరిగే నియోజకవర్గాలలో అభ్యర్థులుగా ఉన్నారు. -
మందుపాతర పేలి ముగ్గురు పోలీసులకు గాయాలు
ఎన్నికలపై మావోయిస్టులు తమ గురిని వదలట్లేదు. ఎన్నికల విధులకు హాజరయ్యే పోలీసులను టార్గెట్ చేయడం మానలేదు. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఓ అధికారి సహా ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. ముర్హు పోలీసు స్టేషన్ ఇన్చార్జి పి.కె.ఝా, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తమ వాహనంలో పొట్నా గ్రామానికి వెళ్తుండగా దారిలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలింది. దీంతో వాళ్లు ముగ్గురూ తీవ్రంగా గాయపడినట్లు డీఐజీ ప్రవీణ్ కుమార్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇది బహుశా పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వర్గానికి చెందిన తీవ్రవాదుల పనే అయి ఉంటుందని డీఐజీ అనుమానం వ్యక్తం చేశారు. -
ఘటనా స్థలం నుంచి మృతదేహాల స్వాధీనం
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి జవాన్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయిదుగురి జవాన్ల మృతదేహాలను తరలించారు. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 20మంది జవాన్లు మృతి చెందినట్లు పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. మృతుల్లో 15మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, అయిదుగురు పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న వారికి భద్రత కల్పించేందుకు జవాన్లు వెళుతున్న మార్గంలో ముందుగా మందుపాతర పేల్చి, అనంతరం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు 150మంది నక్సల్స్ పాల్గొన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో డీఐజీ దీపాంశు కబ్రా తెలిపారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయిన విషయం తెలిసిందే. సుకుమా జిల్లా సొంపల అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి చేయడంతో దాదాపు 20 మంది జవాన్లు అక్కడికక్కడే మరణించారు. మరో 16 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జగదల్పూర్ తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సీఎస్, హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, ముఖ్య ఉన్నత అధికారులతో భేటీ అయ్యారు. దాడిపై చర్చించిన రమణ్ సింగ్...ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. మావోయిస్టుల ఎదుర్కొనేందుకు తమ ముందున్న పెద్ద సవాల్ అన్నారు. మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
మావోయిస్టుల ఘాతుకం : 20 మంది జవాన్ల మృతి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. సుకుమా జిల్లా సొంపల అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి చేయడంతో దాదాపు 20 మంది జవాన్లు అక్కడికక్కడే మరణించారు. మరో 16 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జగదల్పూర్ తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మావోయిస్టుల ఏరివేత కోసం సీఆర్పీఎఫ్ బలగాలు గత కొన్ని రోజులుగా ఇక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న మావోయస్టులు.. తాము మందుపాతరలను అమర్చిన చోట్ల కాపుకాశారు. మంగళవారం నాడు దాదాపు ఒక కంపెనీకి పైగా.. అంటే సుమారు 60 మంది జవాన్లతో కూడిన సీఆర్పీఎఫ్ బృందం సొంపల ప్రాంతానికి రాగానే వెంటనే మావోయిస్టులు మందుపాతర పేల్చేశారు. జవాన్లు తేరుకుని, పొజిషన్లు తీసుకుని మావోయిస్టులపై కాల్పులు జరిపేలోపే చుట్టుముట్టి, విచక్షణారహితంగా తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘాతుకానికి సుమారు 20 మంది జవాన్లు అక్కడికక్కడే మరణించినట్లు ప్రాథమిక సమాచారం. మరో 16 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జగదల్పూర్ ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. మావోయిస్టుల ఘాతకంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
బీహార్‌లో మందు పాతర పేలి 8 మంది పోలీసుల మృతి
పాట్నా(ఐఏఎన్ఎస్): బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో మందు పాతర పేలి 8 మంది పోలీసులు మృతి చెందారు. మందు పాతర పేలడంతో పోలీస్ జీపు తునాతునకలైంది. ఆ జీపులో ఉన్న 8 మంది పోలీసులు దుర్మరణం చెందారు. ఈ ఘటన తాడ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు అడిషనల్ డైరెక్టర్ జనరల్ అమిత్ కుమార్ చెప్పారు. -
మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి
గడ్చిరోలి : మహారాష్ట్రలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లా దానోరా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందు పాతర పేల్చారు. మందుపాతర పేలిన ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. పోలీసులే లక్ష్యంగా మావోలు ఈ మందుపాతర పేల్చినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మందుపాతర పేలి 13మంది జవాన్లు మృతి
విజయనగరం : ఆంధ్రా,ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. సాలూరు నియోజవర్గం సుంకి సమీపంలోని బీఎస్ఎఫ్ జవాన్లు లక్ష్యంగా మావోయిస్టులు ఈ రోజు ఉదయం మందుపాతర పేల్చారు. ఈ దుర్ఘటనలో 13మంది బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మావోయిస్టులు, బీఎస్ఎఫ్ జవాన్ల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.